ఆ క్షణం దద్దరిల్లింది..?

Posted By:

‘చరిత్రలో మొదటిసారి బ్రిటీషు సైన్యం పైన టిప్పు సుల్తాన్ రాకెట్లను ప్రయోగించాడు. అది చూసిన బ్రిటీష్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్లను నిర్మాణానికి అంకురార్పణచ చేసారు' - వికీపీడియా

ఇస్రోగా పిలవబడుతోన్న ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్‌ను అంతరిక్ష పరిశోధనల నిమిత్తం భారత ప్రభుత్వం 1972లో అధికారికంగా నెలకొల్పింది. 1947లో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న తరువాత భౌగోళికంగా పెద్దదైన మన భారత దేశం రక్షణ అవసరాలు ఇంకా అభివృద్థి కోసం అంతరిక్ష పరిశోధన ఎంతో అవసరమని భావించి ఆ దిశగా అడుగులు వేసింది.

Read More: ఆ వాట్సాప్ మెసెజ్‌లు ఎవరివి..?

భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థకు విక్రం సారా భాయ్‌ను పితామహుడిగా అభివర్ణిస్తారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన్ స్పుత్నిక ప్రయోగించినపుడు శాటిలైట్ అవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు వివరించి 1962లో భారత అణు శక్తి వ్యవస్థ పితామహుడైన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ (Indian National Committee for Space Research)ను ఏర్పాటు చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ (2013 ఏప్రిల్ 22)

ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ (2013 ఏప్రిల్ 22)

ఆశ్చర్యపరుస్తున్న శాటిలైట్ వీక్షణలు


ఉటా కొలరాడో నది (, 2013 ఏప్రిల్ 22)

ఆశ్చర్యపరుస్తున్న శాటిలైట్ వీక్షణలు

మౌంట్ వెసువియస్ నేపుల్స్, ఇటలీ. (2013 ఫిబ్రవరి 19)

ఆశ్చర్యపరుస్తున్న శాటిలైట్ వీక్షణలు

జియాన్‌లోని షియాన్ పార్క్, చైనా,(సెప్టెంబర్ 24, 2013)

ఆశ్చర్యపరుస్తున్న శాటిలైట్ వీక్షణలు

కతర్ రాజధాని దోహాలో 1.5 చదరపు మైళ్ళు విస్తరించి ఉన్న కృత్రిమ ద్వీపం.

ఆశ్చర్యపరుస్తున్న శాటిలైట్ వీక్షణలు

భూకపం కారణంగా పాకిస్థాన్‌లో గ్వాదర్ తీరంలో ఏర్పడిన చిన్న ద్వీపం (సెప్టెంబర్ 29, 2013)

ఆశ్చర్యపరుస్తున్న శాటిలైట్ వీక్షణలు

గుండె ఆకారంలో ఉన్న క్రొయేషియా ద్వీపం, (ఫిబ్రవరి 16, 2013)

ఆశ్చర్యపరుస్తున్న శాటిలైట్ వీక్షణలు

మనం అగ్నిపర్వతం, న్యూగినియా ( 2013 మార్చి 22)

ఆశ్చర్యపరుస్తున్న శాటిలైట్ వీక్షణలు

వేర్సైల్లెస్ భవనం, ఫ్రాన్స్ ( 2013 ఆగష్టు 20)

ఆశ్చర్యపరుస్తున్న శాటిలైట్ వీక్షణలు

క్యామ్ బాంబీ డ్యామ్, సౌత్ ఆఫ్రికా అంగోలా (ఏప్రిల్ 28, 2013)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ క్రమంలో కేరళలోని త్రివేండ్రం వద్ద తంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ను నెలకొల్పి అమెరికా, రష్యాల నుంచి దిగమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ అనతి కాలంలోనే పూర్తి స్థాయి రాకెట్‌లను తయారు చేసే స్ధాయికి భారత్ ఎదిగింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో చర్చలు అనంతరం శాటిలైట్‌లను తయారు చేయటమే కాకుండా వాటిని ప్రయోగించాలని ఓ అవగాహనకు వచ్చిన సారాభాయ్ ఇస్రోతో కలిసి ఉపగ్రహాలను ప్రయోగించే లాంచింగ్ ప్యాడ్‌ను తయారు చేయటం మొదలుపెట్టారు. దాని పేరే శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎల్‌వీ). మరో వైపు ఇస్రో పూర్తిస్థాయి ఉపగ్రహాన్ని తయారు చేయగా, దానికి భారత గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టబడింది.

Read More: ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?

భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమయిన ఆర్యభట్టను ఏప్రిల్ 19, 1975న అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. 1979 నాటికి శ్రీహరికోటలో SLV లాంచ్ ప్యాడ్ సిద్దమవడంతో ప్రయోగించిన ఉపగ్రహం రెండవ దశలో ఎదురయిన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన రోహిణి-1 భారతదేశంలో ప్రయోగింపబడిన మొదటి ఉపగ్రహంగా చరిత్రలో నిలిచిపోయింది. భారత్ 1975 నుంచి ఇప్పటి వరకు 77 శాటిలైట్‌లను ప్రయోగించింది. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ ముందు ముందు మరిన్ని మైలురాళ్లను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుందాం...

source: wikipedia

English summary
Great history of Indian space satellites. Read Mor in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting