25 సంవత్సరాల్లో ముఖ్యమైన ఆవిష్కరణలు

Written By:

నేడు టెక్నాలజీ అమితవేగంతో దూసుకుపోతోంది. గత 25 సంవత్సరాలుగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ ఎన్నో ఆవిష్కరణలను మనకు అందించింది. అవి ఇప్పుడు టెక్నాలజీకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కొత్త కొత్తవి బయటి ప్రపంచానికొస్తున్నాయి. అలాగే పాతవి మరుగున పడిపోతున్నాయి. అయితే మరుగునపడిన వాటి ద్వారానే కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఈ సందర్భంగా గత 25 సంవత్సరాల కాలంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణలను కొన్నింటిని ఓ సారి చూద్దాం.

Read more: 4జీ రాకముందే 5జీ రెడీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హైబ్రిడ్ కార్లు ( Hybrid Cars )

1900 సంవత్సరంలో లెజెండ్ ఇంజనీర్ ఫెర్డినాండ్ పోర్స్చే దీన్ని ప్రారంభించారు. అతను తన వ్యక్తిగత అవసరాలకోసం దీన్ని తయారు చేశారు. అయితే ఈ హైబ్రిడ్ కారు 1997 దాకా అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటూ వచ్చింది. అనేక సమస్యల మధ్య మార్కెట్లోకి వచ్చిన ఈ కారు 2009లో 2.5 శాతం సేల్స్ వృద్ధిని నమోదు చేసింది. అప్పట్లో ఇదే పెద్ద బిజినెస్.

మినిడిస్క్ ( MiniDisc )

ఇది జపాన్ మేజర్ హిట్. ఇది వచ్చి రావడంతోనే సీడీలను పక్కకు నెట్టేసింది. సోనీ మినీ డిస్క్ హెచ్ డి క్వాలిటీతో చిన్న సైజులో హై డిఫిసేషన్ సౌండ్ తో వీటిని ఇప్పుడు మార్కెట్టోకి తెచ్చింది

కలర్ ప్లాస్మా డిస్ ప్లే (Color Plasma Display)

ఇంతకు ముందు బ్లాక్ అండ్ వైట్ ఉంటే చాలా ఆనందపడేవారు. కాని ప్లాస్మా రాకతో టీవీల ప్రపంచమే మారిపోయింది. పుజిస్టు కంపెనీ ఫస్ట్ ప్లాస్మా టీవీని డెవలప్ చేసింది.

శాటిలైట్ టీవీ (Satellite TV)

అప్పటిదాకా కేబుల్ తోనే నడుస్తున్న టీవీలు ఒక్కసారిగా శాటిలైట్ దెబ్బకు తమ రూపు రేఖలను మార్చుకున్నాయి.

రికార్డబుల్ డివిడి (Recordable DVDs)

పియోనీర్ కంపెనీ దీన్ని 1997లో డెవలప్ చేసింది. ఇది ఇప్పుడు రికార్డింగ్ లో రారాజుగా వెలుగుతోంది.

లిధియం రీచార్జబుల్ బ్యాటరీస్ (Lithium Rechargeable Batteries)

ఇంతకు ముందు ఉన్నబ్యాటరీలు చార్జింగ్ అయిపోగానే పారేసేవారు. అలా పర్యావరణం కలుషితం అవుతుందని చెప్పి రీ చార్జబుల్ బ్యాటరీని కనుగొన్నారు.

డివిడి (DVD)

1993లో వచ్చిన ఈ డివిడి మొత్తంగా ఇండస్ట్రీనే డామినేట్ చేసింది. సోనీ కంపెనీ అలాగే ఫిలిప్స్ కంపెనీ లు వీటికి అత్యాధునిక రంగులన అద్ది ముందుకు తెచ్చాయి.

డాప్లర్ రాడార్ ( Doppler Radar)

ఇంతకుముందు వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది.ఎప్పుడయితే రాడార్లు వచ్చాయో వెదర్ ప్రపంచమే మారిపోయింది.

ఫ్లాష్ మెమొరీ (Flash Memory)

స్టీవ్ జాబ్స్ ఆపిల్ కంప్యూటర్ ఎప్పుడయితే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ప్రజలు ప్లాపీ డిస్క్ డ్రైవ్ లను చూడటం మానేశారు. సో వీటి స్థానంలో కొత్తగా ఈ ఫ్లాష్ మెమొరీలు వచ్చి చేరాయి

బ్లూటూత్ (Bluetooth)

దీన్ని ఎరిక్ సన్ డెవలప్ చేసింది. ఫోన్ నుంచి కంప్యూటర్ కు వైర్ లెస్ ద్వారా పైల్స్ ను పంపుకోవచ్చు. ఇది కూడా అద్భుతమైన టెక్నాలజీగా నిలిచింది.

హోమ్ ఆడియో వీడియో ఎడిటింగ్ ( Home Audio ,Video Editing)

హోమ్ ఆడియో వీడియో ఎడిటింగ్ ( Home Audio ,Video Editing)
గత 25 సంవత్సరాలలో ఇదొక గొప్ప ఆవిష్కరణ

మల్టీ కోర్ ప్రాసెసర్ (Multi-Core Processors)

సిస్టం స్లో గా నడుస్తుందని చెప్పి ఇలాంటివి కనుగొన్నారు. ఇప్పుడు ఏది బెటర్ అనేది చూసి కొంటున్నారు.

జెపిఈజి ( JPEG)

గత 25 సంవత్సరాలలో ఇదొక గొప్ప ఆవిష్కరణ

బ్లాగ్స్ ( Blogs )

ఈ బ్లాగ్స్ రాకతో ఎవరికి వారు తమ సొంత బ్లాగులను నిర్వహించుకుంటున్నారు

ఎంపీ 3 ప్లేయర్ ( MP3 Player)

ఇప్పుడు ఇది లేనిదే బయటకు అడుగు పెట్టడం లేదంటే అతిశయోక్తి కాదు

సోషల్ నెట్ వర్కింగ్ ( Social Networking Service)

ఇదొక విప్లవం... ఇప్పుడున్న టెక్నాలజీలో సోషల్ మీడియానే అతి పెద్ద పాత్ర పోషిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Greatest Technological Inventions of the Past 25 Years
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot