4జీ రాకముందే 5జీ రెడీ

Written By:

మనదేశంలోకి ఇంకా పూర్తి స్థాయిలో 4జీ రానేలేదు. ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే జపాన్ మాత్రం ఒక అడుగు ముందుకేసి 4జీ కాలం చెల్లిందంటూ అప్పుడే 5జీ నెట్ వర్క్ పై కన్నేసింది. అక్కడ వైర్‌లెస్ కమ్యూనికేషన్లలో ముందంజలో ఉన్న ఓ కంపెనీ.. విజయవంతంగా 5జీ డేటా ట్రాన్స్‌మిషన్ ప్రయోగాలు చేసింది.

Read more: నెల్లూరు,తిరుపతిలో ఎయిర్ సెల్ 3జీ సేవలు

4జీ రాకముందే 5జీ రెడీ

2020 నాటికి దీన్ని వాణిజ్యపరంగా ప్రవేశపెడతామని చెబుతోంది. ఎన్ఐటీ డొకోమో ఇంక్ సంస్థ ఈ ప్రయోగం చేసింది. టోక్యోలోని రొపోంగి హిల్స్ కాంప్లెక్సులో తాము అక్టోబర్ 13వ తేదీన అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్‌మిషన్ చేశామని, అది దాదాపు 2 జీబీపీఎస్ వేగాన్ని అందుకుందని కంపెనీని ఉటంకిస్తూ సిన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఈ ప్రయోగంలో.. మిల్లీమీటరు తరంగదైర్ఘ్యంతో కూడిన సిగ్నళ్లను అత్యధికంగా 70 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యంతో పంపారు.

Read more: ఉగ్రవాదుల సైట్లపై వయాగ్రాతో దాడి

4జీ రాకముందే 5జీ రెడీ

ఇప్పటివరకు షాపింగ్ మాల్స్ లాంటి వాణిజ్య ప్రాంగణంలో ఎవరూ 5జీ డేటా ట్రాన్స్‌మిషన్ ప్రయోగాలు చేయలేదని, సాధారణంగా ఇలాంటి చోట్ల డేటా ట్రాన్స్‌మిషన్‌లో రకరకాల సమస్యలు రావడమే ఇందుకు కారణమని డొకోమో సంస్థ తెలిపింది.

4జీ రాకముందే 5జీ రెడీ

అయితే, తాము బీమ్ ఫార్మింగ్, బీమ్ ట్రాకింగ్ అనే రెండు కొత్త టెక్నాలజీలు ఉపయోగించి మొబైల్ పరికరం ఎక్కడుందో అన్న దాని ఆధారంగా బీమ్ దిశను నియంత్రించామని డొకోమో వివరించింది. దానివల్ల తమ ప్రయోగం విజయవంతం అయినట్లు చెప్పింది.

Read more about:
English summary
Here Write NTT DoCoMo conducts first real-world 5G trials in Japan
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting