సెగ పుట్టించనున్న మొబైల్ ధరలు, రీచార్జిలు

Written By:

దేశమంతా ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రానున్న జీఎస్టీ అమలుతో ప్రతి యూజర్ చేతిలోని మొబైల్ ఫోన్ల ధరలు కాకపుట్టనున్నాయట. ఒక్క మొబైల్ హ్యాండ్ సెట్లు మాత్రమేకాక, మొబైల్ ఫోన్ బిల్స్ కు మోత మోగనున్నాయని తెలుస్తోంది. దీంతో మొబైల్ యూజర్లకు డబుల్ షాకేనని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఐఫోన్ 7లోని ఇంత వరస్ట్ ఫీచర్‌ని వన్‌ప్లస్ 5లో కాపీ కొట్టారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పన్ను భారం

మొబైల్ ఇండస్ట్రీని 12 శాతం, టెలికాం సేవలను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రేట్లతో వినియోగం, పెట్టుబడులు తగ్గిపోతాయని మొబైల్ ఫోన్ ఇండస్ట్రి ఆందోళన వ్యక్తంచేస్తోంది.

1000 రూపాయల మొబైల్ బిల్లుకు అదనంగా 30 రూపాయలు

వినియోగదారులు ఇక తమ నెలవారీ 1000 రూపాయల మొబైల్ బిల్లుకు అదనంగా 30 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.

పన్ను రేట్లు 15 శాతం నుంచి 18 శాతం పెరుగుదల

ప్రస్తుతమున్న టెలికాం సర్వీసుల పన్ను రేట్లు 15 శాతం నుంచి 18 శాతానికి పెరగడంతో ఈ మేరకు మొబైల్ ఫోన్ బిల్లులకు భారీగా చిల్లులు పడనున్నట్టు తెలిసింది.

టాక్ టైమ్ కూడా

అదేవిధంగా ప్రీపెయిడ్ యూజర్ల ఎఫెక్టివ్ టాక్ టైమ్ కూడా తగ్గిపోనుందట. జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మొబైల్ ఫోన్లు 4-5 శాతం ఖరీదుగా మారతాయని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి.

18 శాతం పన్నుపై

18 శాతం పన్నుపై టెలికాం ఇండస్ట్రి ఇప్పటికే పెదవి విరిచేసింది. ఇక మొబైల్ ఇండస్ట్రి నుంచి కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

దిగుమతులు మరింత పెరిగే అవకాశం

విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయించే ఫోన్ల సుంకం 17 శాతం నుంచి 27 శాతంగా ఉంది. ఇప్పుడది 12 శాతానికి తగ్గింది. దీనివల్ల దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుమతులు పెరగడంతో, స్థానిక మొబైల్ ఫోన్లకు భారీగా డిమాండ్ పడిపోనుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
GST: Double bad news for mobile users Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot