Home
News

హాత్వే బ్రాడ్‌బ్యాండ్ VS ACT ఫైబర్‌నెట్: ఆకర్షణీయమైన ప్లాన్‌లలో విజయం ఎవరిది?

రిలయన్స్ జియోఫైబర్ FTTH సర్వీస్ ను ప్రారంభించటం గురించి అధికారిక ప్రకటన విడుదల చేసినప్పటి నుండి గత కొన్ని నెలలుగా భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ రంగం తీవ్రంగా పోటీ పడుతోంది. ఏదేమైనా ఇతర బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు కూడా కొత్త చందాదారులు వారి ధర, ప్రణాళికలు మరియు ఆఫర్‌ల వైపు ఆకర్షించబడ్డారని నిర్ధారించుకోవడానికి చాలా రకాల ఆఫర్లను ప్రవేశపెట్టారు. ఈ రంగంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు సర్వీస్ ప్రొవైడర్లు ACT ఫైబర్నెట్ మరియు హాత్వే బ్రాడ్బ్యాండ్.

Hathaway Broadband VS ACT Fibernet: Who Gave Better Plans?

ACT ఫైబర్‌నెట్ హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుందని తెలిసినప్పటికీ హాత్వే సర్వీసు ప్రొవైడర్ కూడా అనేక ప్లాన్‌లపై అపరిమిత డేటాను అందిస్తోంది. అలాగే ACT ఫైబర్నెట్ చురుకుగా ఉన్న చాలా నగరాలలో కూడా హాత్వే దానికి గట్టి పోటీ ఇస్తోంది. అందువల్ల కొన్ని పోటీలలో రెండు సంస్థల మధ్య విజయం నీదా లేక నాద అని ఉన్నాయి. రెండు సర్వీసు ప్రొవైడర్ల మధ్య వున్న చిన్న చిన్న పోలికలు ఏవో తెల్సుకోవాలనుకుంటే మరియు మీరు మీ ఇంటి బ్రాడ్‌బ్యాండ్ అవసరాలకు తగిన ప్రణాళిక ఎదో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చదవండి.

ACT ఫైబర్నెట్ vs హాత్వే బ్రాడ్‌బ్యాండ్: 30 Mbps వరకు ప్లాన్‌లు

ACT ఫైబర్నెట్ vs హాత్వే బ్రాడ్‌బ్యాండ్: 30 Mbps వరకు ప్లాన్‌లు

గమనించదగ్గ మొదటి విషయం ఏమిటంటే ACT ఫైబర్నెట్ ను తక్కువ వేగంతో వున్న ప్లాన్ ను ఎంచుకున్నప్పుడు దీనికి చాలా తక్కువ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు ACT ఫైబర్నెట్ 100GB డేటాను అందించే 15 Mbps ప్లాన్‌ను నెలకు 685 రూపాయలకు అందిస్తుంది. దీని తరువాత ACT ఫైబర్నెట్ నేరుగా 240GB డేటాతో 50 Mbps ప్లాన్‌ను నెలకు 959 రూపాయలకు 1500GB అదనపు డేటాతో అందిస్తుంది. అయితే హాత్వే తక్కువ-స్పీడ్ పరిధిలో తన చందాదారులకు అపరిమిత డేటాను అందించడంపై ఎక్కువ దృష్టి సారించింది. హాత్వే తన చందాదారులకు 50 Mbps ప్లాన్‌తో పాటు 20 Mbps, 30 Mbps వంటి ఎంపికలను ఇస్తోంది. ఉదాహరణకు మేము రెండు కంపెనీలకు రిఫరెన్స్ సిటీగా తీసుకుంటున్న బెంగళూరులో అపరిమిత డేటాను అందించే ACT ఫైబర్నెట్ నుండి 30 Mbps ప్లాన్ నెలకు 999 రూపాయలకు లభిస్తుంది. కానీ హాత్వే తన చందాదారులకు 25Mbps ప్లాన్‌ను నెలకు 649 రూపాయలకు అందిస్తుంది.

ACT ఫైబర్నెట్ vs హాత్వే బ్రాడ్‌బ్యాండ్: 50 Mbps ప్లాన్‌లు

ACT ఫైబర్నెట్ vs హాత్వే బ్రాడ్‌బ్యాండ్: 50 Mbps ప్లాన్‌లు

మీరు ఆన్‌లైన్‌ ద్వారా కొంత కంటెంట్‌ను ప్రసారం చేయాలనుకుంటే మరియు మీ ఇంటర్నెట్‌కు కనీస బ్రౌజింగ్ అవసరమైతే అపరిమిత డేటాను అందించే హాత్వే యొక్క ఈ ప్రణాళిక మంచి ఎంపిక . మరోవైపు 100GB డేటాతో హాత్వే యొక్క 20 Mbps ప్లాన్ రూ .699 కు లభిస్తుంది. కానీ ACT ఫైబర్నెట్ 15 Mbps ప్లాన్‌తో 685 రూపాయల ధరతో నేరుగా పోటీపడుతుంది. అయితే 50 Mbps ప్రణాళికలో హాత్వే నుండి ACT ఫైబర్‌నెట్ మధ్య ఇది కఠినమైన ఎంపిక. హాత్వే యొక్క 50 Mbps స్పీడ్ ప్లాన్ 500GB డేటాను అందిస్తుంది. దీని తరువాత 4 Mbps ఆఫ్టర్-FUP స్పీడ్ తో లభిస్తుంది. దీని యొక్క ధర నెలకు 999 రూపాయలు. కాగా ACT ఫైబర్నెట్ 50Mbps ప్లాన్ 240GB నెలవారీ డేటాతో వస్తుంది. ప్లాన్ యొక్క ధర నెలకు 959 రూపాయలు. FUP తరువాత దీని వేగం 512 Kbps గా ఉంది.

ACT ఫైబర్నెట్ vs హాత్వే బ్రాడ్‌బ్యాండ్: 100 Mbps మరియు దాని పైన ప్లాన్‌లు

ACT ఫైబర్నెట్ vs హాత్వే బ్రాడ్‌బ్యాండ్: 100 Mbps మరియు దాని పైన ప్లాన్‌లు

100 Mbps విభాగంలోకి వస్తే సర్వీస్ ప్రొవైడర్ హాత్వే 100 Mbps ప్లాన్‌ను నెలకు 1000 జిబి డేటాను, FUP తరువాత 5 Mbps స్పీడ్‌తో అపరిమిత డేటాను అందిస్తుంది. దీని యొక్క నెలవారీ అద్దె 999 రూపాయలకు అందిస్తున్నందున హాత్వే స్పష్టమైన విజయాన్ని సాధించింది. కాని ఈ ప్లాన్ ను పొందడానికి చందాదారులు కనీసం 3 నెలల చందా కాలంతో రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. మరో వైపు ACT ఫైబర్నెట్ కూడా 400GB నెలవారీ డేటాతో 100 Mbps ప్లాన్ ను మరియు FUP తరువాత దాని వేగం 1 Mbpsతో అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ధర సుమారు 1,159 రూపాయలు. అయితే హాత్వే ప్లాన్ ఎంచుకున్న ప్రదేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. అదేవిధంగా 1000GB డేటాతో హాత్వే 150 Mbps ప్లాన్ కూడా నెలకు 1,299 రూపాయలతో మొదలవుతుంది, అయితే ACT ఫైబర్నెట్ 150 Mbps ప్రణాళికలు 1,999 రూపాయల నుండి ప్రారంభమవుతాయి.

తీర్పు

తీర్పు

హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ఎంచుకున్న ప్రదేశాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది కావున ఎంచుకున్న ప్రదేశాలలో మాత్రం హాత్వే బ్రాడ్‌బ్యాండ్ విజయం సాధించింది అని చెప్పవచ్చు. ముక్యంగా తెలుగు రాష్టాలలో మాత్రం ACT ఫైబర్నెట్ కంటే హాత్వే బ్రాడ్‌బ్యాండ్ మంచి ఎంపిక అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Hathaway Broadband VS ACT Fibernet: Who Gave Better Plans?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X