హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఉత్తమ 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

|

ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో అనేక వివిధ రకాల బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు ఉన్నారు. వీరు తమ చందాదారుల కోసం కొత్త ప్రణాళికలు, ఆఫర్‌లు మరియు సర్వీస్ లతో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ఎప్పుడు యుద్ధం చేస్తుఉంటారు. రిలయన్స్ జియో గిగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ప్రారంభించాలని ప్రకటించినప్పటి నుండి వివిధ టెలికాం ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎక్కువ మంది చందాదారుల కోసం పోటీ పడుతున్నారు.

హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఉత్తమ 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

 

మరియు ఇప్పుడు వున్న చందాదారులను కోల్పోకుండా ఉండడానికి కూడా చాలా రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు . రిలయన్స్ జియో గిగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యొక్క కొత్త ఆకర్షణీయమైన ఆఫర్‌లు మరియు స్పీడ్ చూసి చాలా మంది చందాదారులు ఇప్పటికే వున్న తమ బ్రాడ్‌బ్యాండ్ సభ్యత్వాలను మార్చుకునే అవకాశం ఉంది.

హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఉత్తమ 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

ఈ రోజుల్లో ఏదైనా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ వెనుక ప్రధాన కారకాలలో ఒకటి వినియోగదారులు 100 Mbps స్పీడ్ తో మరియు మరిన్ని ప్రయోజనాలతో అందించే ప్రణాళికలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్, ACT ఫైబర్‌నెట్ మరియు టాటా స్కై వంటి కొన్ని అగ్రశ్రేణి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు తమ వినియోగదారులకు 100 ఎమ్‌బిపిఎస్ ప్లాన్‌లను అందిస్తున్నారు.

హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఉత్తమ 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

ఒకవేళ మీరు మీ ఇంటికి 100 Mbps ప్లాన్ పొందాలనుకుంటే మీరు తప్పక పరిగణలోకి తీసుకోవలసిన కొన్ని ఎంపికలు ఇక్కడ ఉన్నాయి చదవండి.

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ 100 Mbps ప్లాన్లు:

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ 100 Mbps ప్లాన్లు:

ఎయిర్‌టెల్ సంస్థ100 Mbps ప్లాన్‌లను రూ .1,099 ధరతో అందించడం ప్రారంభించింది. యాదృచ్చికంగా ఇది ఎయిర్టెల్ సంస్థ యొక్క దాని ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలను అందించే అతి పెద్ద శ్రేణి. ఈ శ్రేణి క్రింద ఉన్న ప్లాన్ 799 రూపాయలకు వస్తుంది కానీ ఇది అదనపు ప్రయోజనంతో రాదు అంతేకాకుండా ఇది కేవలం 40 Mbps వేగాన్ని మాత్రమే అందిస్తుంది. ఎయిర్‌టెల్ అధిక ధర కలిగిన ప్లాన్ 100 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ తో 300 GB డేటాతో పాటు 500GB అదనపు డేటాతో కలిపి ఆరు నెలల పాటు అందిస్తుంది. ఇందులో ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్‌తో సహా మూడు నెలల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరానికి, ఎయిర్‌టెల్ టివి మరియు Zee 5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.1,599 ప్లాన్:
 

ఎయిర్‌టెల్ రూ.1,599 ప్లాన్:

ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ.1,599 ప్లాన్ మునుపటి ప్లాన్ కంటే మూడు రేట్లు స్పీడ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 300 ఎమ్‌బిపిఎస్ స్పీడ్‌ను 600 జిబి డేటాను మరియు 1000 జిబి బోనస్ డేటాతో కలిపి ఆరు నెలల వరకు అందిస్తుంది. 100 Mbps మరియు 300 Mbps ప్లాన్‌లలో వర్తించే డేటా రోల్‌ఓవర్ ఫీచర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనంతో కూడా వస్తుంది. చివరగా ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం రూ.1,999 ప్లాన్ కూడా అందిస్తోంది ఇది చందాదారులకు అపరిమిత డేటాను అందిస్తుంది. ఇది కూడా ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్‌తో వస్తుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 100 Mbps ప్లాన్లు:

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 100 Mbps ప్లాన్లు:

టాటా స్కై విషయానికి వస్తే సర్వీస్ ప్రొవైడర్ 100 Mbps వంటి హై-స్పీడ్ ప్లాన్‌లకు సంబంధించిన పరిమిత ఎంపికలను కలిగి ఉంది. బెంగళూరు ప్రాంతంలో ఆపరేటర్ 2,400 రూపాయలకు అపరిమిత డేటా ప్రయోజనంతో 100 ఎమ్‌బిపిఎస్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇది ఎయిర్‌టెల్‌తో పోలిస్తే చాలా ఖరీదైనది. అదే సర్కిల్‌లో టాటా స్కైకి పరిమిత డేటాను అందించే 100 ఎమ్‌బిపిఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లేదు. అయితే ఢిల్లీ ప్రాంతంలో టాటా స్కై 100 ఎమ్‌బిపిఎస్ అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌ను నెలకు 1,599 రూపాయలకు అందిస్తోంది. కాకపోతే ఇది అదనపు ప్రయోజనాలతో రాదు. ఒకవేళ మీరు ఈ ప్రాంతంలో ఉండి హై-స్పీడ్ అపరిమిత డేటా కనెక్షన్‌ని పొందాలనుకుంటే ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్ తో వచ్చే ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎంచుకోవడం ఉత్తమం.

ACT ఫైబర్‌నెట్ 100 Mbps ప్లాన్లు:

ACT ఫైబర్‌నెట్ 100 Mbps ప్లాన్లు:

హై-స్పీడ్ ప్లాన్‌ల విషయానికి వస్తే ACT ఫైబర్‌నెట్ చాలా ఎంపికలను కలిగి ఉంది. ఎందుకంటే భారతదేశంలోని బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో అగ్రశ్రేణి బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలలో ఇది ఒకటి. ఇది 100 Mbps స్పీడ్ తో 400 జిబి డేటాను మరియు 1500 జిబి బోనస్ డేటాను కేవలం రూ.1,159 లకు అందిస్తోంది. అలాగే 125 Mbps స్పీడ్ తో 550 జిబి డేటాను మరియు 1500 జిబి బోనస్ డేటాను 1,399 రూపాయలకు అందిస్తోంది. అలాగే 150 Mbps స్పీడ్ అందించే ACT ఫైబర్‌నెట్ ఇన్క్రెడిబుల్ ప్లాన్ 875 జీబీ డేటాను మరియు 1500 జీబీ బోనస్ డేటాతో కలిపి 1,999 రూపాయలకు లభిస్తుంది.

ACT ఎసెన్షియల్ ప్లాన్:

ACT ఎసెన్షియల్ ప్లాన్:

ఇంకా 150 Mbps స్పీడ్ తో 1200 జిబి డేటాను మరియు1500 జిబి బోనస్ డేటాతో కూడిన ACT ఎసెన్షియల్ ప్లాన్ 2999 రూపాయలకు లభిస్తుంది. అదే స్పీడ్ తో మరిన్ని ప్లాన్లు ఉన్నాయి. వాటిలో 1650 జిబి డేటా మరియు 2200 జిబి గల డేటా వరుసగా నెలకు రూ .3,999 మరియు 4,999 రూపాయలకు లభిస్తాయి. చివరగా 2500GB డేటాతో 1 Gbps ప్లాన్ కూడా ఉంది దీని ధర 5,999 రూపాయలు.

పైన ఉన్న ఎంపికలలో ఎంచుకోవలసినది ఏది?

పైన ఉన్న ఎంపికలలో ఎంచుకోవలసినది ఏది?

ఒక్క మాటలో చెప్పాలంటే మీరు 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో సరళమైన అపరిమిత డేటా ప్లాన్‌ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం టాటా స్కై మంచి ఎంపికగా ఉంటుంది. టాటా స్కై వివిధ ప్రాంతాలకు వేర్వేరు ధరలను కలిగి ఉన్నందున ఇది పోటీ ధరతో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వంటి ప్రయోజనాల మీద మీకు ఆసక్తి కలిగి ఉంటే ఎయిర్‌టెల్ యొక్క 1,999 రూపాయల ప్లాన్ ఉత్తమ ఎంపిక. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా మీరు 100 Mbps ప్లాన్ మరియు పరిమిత డేటాను ఎంచుకోగలిగితే అప్పుడు ACT ఫైబర్నెట్ యొక్క రూ .1,259 ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

Most Read Articles
Best Mobiles in India

English summary
best high speed plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X