Just In
- 2 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 19 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 20 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 23 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- News
CM: ఆ సీఎం సీరియస్ అయితే ఆ కిక్కేవేరప్ప, వారంలో సినిమా గ్యారెంటి, అమ్మాయిలతో గేమ్స్ ఆడితే ?
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- Sports
శుభ్మన్ కాదు.. కోహ్లీ వారసుడు అతనే: దినేశ్ కార్తీక్
- Movies
Intinti Gruhalakshmi Today Episode: అభితో కలిసి గాయత్రి ప్లాన్.. చివరి నిమిషంలో మాట మార్చిన నందూ
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
విమానం తయారుచేసినందుకు బతుకు రోడ్డు మీదకు చేరింది
అతను చదివింది ఏడో తరగతి...అంతే కాదు పుట్టుకతోనే మూగ ,చెవిటి వంటి అంధత్వ లక్షణాలు ఆయన్ని నీడలా వెంటాడుతున్నాయి. అయితే చేయాలనే ధైర్యం ముందు ఇవేమి సాటిరావని నిరూపించి దేశానికే ఆదర్శంగా నిలిచాడు...అతి తేలికైన విమానాన్ని రూపొందించి సంచలనం సృష్టించాడు. అయితే ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉన్నాడు...ఓ చిన్న ఉద్యోగం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు..హృదయాన్ని తట్టి లేపే కధనం అలాగే స్ఫూర్తి నింపే కథనం..
Read more : రోబో తార వచ్చింది.. హీరోయిన్లకు పంచ్ పడింది

టాలెంట్ చాలు నన్ను నేను ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి..
అతనో పుట్టుకతోనే మూగ చెవిటి. ఇక చదివింది 7వ తరగతి మాత్రమే. అయితేనేం..ఆయనలో టాలెంట్ కేమీ కొదవ లేదు. ఆ టాలెంట్ చాలు నన్ను నేను ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి అని అనుకున్నాడు..

అనుకున్నది సాధించాలన్న పట్టు..
అనుకున్నది సాధించాలన్న పట్టు వీడలేదు. అతని సాంకేతిక నైపుణ్యాన్ని గుర్తించిన డిస్కవరీ ఛానల్ ఒక డాక్యుమెంటరీని కూడా ప్రసారం చేసింది. కానీ ఇపుడు భార్యాబిడ్డలను పోషించుకోవడానికి ఏదైనా ఓ చిరుద్యోగం దొరికితే బావుండు అని ఎదురు చూస్తున్నాడు..

విద్యలో అగ్రగామిగా వెలుగుతున్న కేరళకు చెందిన సాజి థామస్ కథ..
విద్యలో అగ్రగామిగా వెలుగుతున్న కేరళకు చెందిన సాజి థామస్ కథ ఇది.. థామస్ (45) మాట్లాడలేడు.. వినలేడు. అయితేనేమీ విభిన్నమైన ఆలోచనలు అతని మదిలో నిరంతరం మెదిలేవి. ఎపుడూ మోటార్లు, మెషీన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటి రిపేర్లు ఇదే అతడి లోకం.

ఎందుకు ఈ పనికిరాని పనులు ..
మొదట్లో అతని భార్య మరియాకు ఇదేమీ అర్థం కాలేదు. భర్త ఓ మంచి ఎలక్ట్రీషియన్ స్థిరపడితే బావుండు కదా..ఎందుకు ఈ పనికిరాని పనులు అనుకునేది. కానీ భర్తకున్న ఆసక్తిని గమనించి అతని అన్ని విధాలుగా అండగా నిలిచింది. అలా 14 ఏళ్లు అతనికి తోడ్పాటు అందించింది.

ముందు ఒక హెలికాప్టర్ నమూనా ..
ముందు ఒక హెలికాప్టర్ నమూనా తయారుచేశాడు. ఆ తరువాత ఇద్దరు ప్రయాణించడానికి వీలుగా అతి తేలికైన విమానాన్ని రూపొందించాడు. వీటిపైనే డిస్కవరీ ఛానల్ ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించింది. శభాష్ అంటూ జేజేలు పలికింది.

అప్పట్లో ఆయనకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో..
అప్పట్లో ఆయనకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో కూడా సాజికి పరిచయం ఉంది. సాజిలో ఉన్న ఉత్సుకతను గమనించిన రాజీవ్ తప్పకుండా సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో 1991 లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు.

విమానాన్ని తయారు చేయాలన్న తన ప్రయత్నాన్ని..
దీంతో ఒక్కసారిగా ఎవరికైనా నిరాశ ఆవహిస్తుంది. కాని సాజి నిరుత్సాహపడలేదు. పట్టుదల మరింత పెరిగింది. విమానాన్ని తయారు చేయాలన్న తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. సుమారు అయిదేళ్ల కఠోర దీక్ష, శ్రమ తరువాత ఒక చిన్న విమానానికి (రెండు చక్రాల ఇంజిన్ కలిగిన) రూపకల్పన చేశాడు.

మధురైకి సమీపంలోని అంబా సముద్రం ఎయిర్ లైన్ అకాడమీ..
దీన్ని మధురైకి సమీపంలోని అంబా సముద్రం ఎయిర్ లైన్ అకాడమీ అతని విమానాన్ని పరిశీలించింది. చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ , మాజీ విమానదళ అధికారి కొన్ని నిమిషాలపాటు దీన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు. కానీ ఏం లాభం లేకపోయింది. అతనికిగానీ, అతను కనిపెట్టిన విమానానికి గానీ లైసెన్స్ లభించలేదు.

నిబంధనలు అనుమతించడంలేదని అధికారులు..
నిబంధనలు అనుమతించడంలేదని అధికారులు సమాధానమిచ్చారు. సాజి దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థంకాక అయోమయంలో ఉన్నాడు. కాగా ఈ విమానాన్ని తయారుచేయడానికి 13 లక్షల రూపాయల వెచ్చించాడు.

తన హాబీ కోసం మొత్తం ఉన్న ఆస్తి అంతా..
ఈక్రమంలో తన హాబీ కోసం మొత్తం ఉన్న ఆస్తి అంతా ఖర్చుపెట్టాడు. దాదాపు 25 లక్షలు హారతికర్పూరంలా కరిగిపోయాయి. దీంతో సాజి కుటుంబంలో కష్టాల్లో పడింది. అధికారులు ఇప్పటికైనా తన భర్తకు సరైన ప్రోత్సాహాన్నివ్వాలని సాజి భార్య మరియా కోరుతోంది.

అతని ప్రతిభను గుర్తించి, త్వరలో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుందని ..
అతని ప్రతిభను గుర్తించి, త్వరలో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుందని తెలిపింది. ప్రభుత్వం తన భర్తకు ఉద్యోగాన్ని కల్పించి తమ కుటుంబానికి వేడుకుంటోంది. తద్వారా తమ బిడ్డ జోషు(13) కొడుకును మంచి సాంకేతిక నిపుణుడుగా చేయాలని తమ కోరికను నెరవేర్చాంటూ కన్నీళ్లతో అభ్యర్థిస్తోంది.

ప్రభుత్వం అతనిని ఆదుకోవాలని..
అటు ఇదిక్కి జల్లాలో గ్రామ ప్రజలు కూడా సాజికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం అతనిని ఆదుకోవాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఇటువంటి శాస్ర్తవేత్తలకు తోడ్పాటునందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని మనమందరం కోరుకుందాం.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి
మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. https://www.facebook.com/GizBotTelugu/
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470