రోబో తార వచ్చింది.. హీరోయిన్లకు పంచ్ పడింది

Written By:

ఇంతవరకు రోబో రూపంలో మనిషి చేసిన విన్యాసాలు మనం చూసాం. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. రోబోలే సినిమాల్లో యాక్టింగ్ చేస్తున్నాయి. అది అలా ఇలా కూడా కాదు..మాములు యాక్టర్లు ఇవ్వలేని హవభావాలను అత్యద్భుతంగా ఇస్తోంది ఆ రోబోతార..ఈ రోబోలతో సినిమాలు నడిస్తే ఇక రానున్న కాలంలో హీరోయిన్లకు గడ్డు పరిస్థితి తప్పదు. ఎందుకంటే ఆ రోబోలే హీరోయిన్లుగా మారుతున్నాయి. మరి ఎలా యాక్ట్ చేసిందో చూడండి మీకే తెలుస్తుంది.

Read more : మారుమూల పల్లెల్లోకి వైఫై హాట్ స్పాట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జపాన్ చిత్ర నిర్మాతలు ..

జపాన్ చిత్ర నిర్మాతలు ..

జపాన్ చిత్ర నిర్మాతలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ‘రోబో మూవీ స్టార్'ను సృష్టించారు. ముమ్ముర్తులా మనిషిలాగే ఉండే ఆ రోబో నవ్వగలదు,

కనుబొమ్మల కదలికలతో హావభావాలను..

కనుబొమ్మల కదలికలతో హావభావాలను..

కనుబొమ్మల కదలికలతో హావభావాలను వ్యక్తం చేయగలదు, మనిషిలాగా మాట్లాడగలదు, పాడగలదు. ఎవరు డబ్బింగ్ చెప్పినా దానికి అనుగుణంగా పెదవులను కదలించగలదు.

ప్రముఖ జపాన్ దర్శకుడు కోజి ఫుకడ నిర్మించిన ‘సయోనారా' చిత్రంలో ..

ప్రముఖ జపాన్ దర్శకుడు కోజి ఫుకడ నిర్మించిన ‘సయోనారా' చిత్రంలో ..

ప్రముఖ జపాన్ దర్శకుడు కోజి ఫుకడ నిర్మించిన ‘సయోనారా' చిత్రంలో లియోనా పాత్రలో ఈ రోబో తార అద్భుతంగా నటించింది. ఆండ్రాయిడ్ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ రోబో తారకు ‘జెమినాయిడ్ ఎఫ్' అని నామకరణం కూడా చేశారు.

అణు ప్రమాదం మానవులపై ఎలాంటి దారుణ ప్రభావాన్ని..

అణు ప్రమాదం మానవులపై ఎలాంటి దారుణ ప్రభావాన్ని..

అణు ప్రమాదం మానవులపై ఎలాంటి దారుణ ప్రభావాన్ని చూపిస్తుందన్న ఇతివృత్తంతో నిర్మించిన సయోనార చిత్రంలో ప్రధాన పాత్ర రోబో తారదే. కాకపోతే అందులో పాత్రకు తగ్గట్టుగానే రోబో నడవలేదు. వీల్‌చైర్‌కే అంకితమవుతుంది.

మానవులను పోలిన రోబోలను సృష్టించడంలో..

మానవులను పోలిన రోబోలను సృష్టించడంలో..

మానవులను పోలిన రోబోలను సృష్టించడంలో ప్రపంచ ఖ్యాతి గడించిన హిరోషి ఇషిగురో యంత్ర పరికరాలతోపాటు రబ్బర్‌ను ఉపయోగించి ఈ రోబో తారను సృష్టించారు. దీనికి కేవలం 76 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయని దర్శకుడు కోజి తెలిపారు.

యంత్రల్లా ఉండే రోబో క్యారెక్టర్లకు గ్రాఫిక్స్ ఉపయోగించి..

యంత్రల్లా ఉండే రోబో క్యారెక్టర్లకు గ్రాఫిక్స్ ఉపయోగించి..

యంత్రల్లా ఉండే రోబో క్యారెక్టర్లకు గ్రాఫిక్స్ ఉపయోగించి నటింపచేయడం, లేదా రోబో పాత్రల్లో నిజమైన నటులే నటించడం ఇప్పటివరకు మనం సినిమాల్లో చూశాం.

ఇప్పడు అచ్చం మనిషి పాత్రలో రోబో నటించడం..

ఇప్పడు అచ్చం మనిషి పాత్రలో రోబో నటించడం..

ఇప్పడు అచ్చం మనిషి పాత్రలో రోబో నటించడం ప్రపంచంలో ఇదే మొదటి సారని కోజి తెలిపారు. మోటారు యంత్రాలు, ల్యాప్‌ట్యాప్ ద్వారా నియంత్రించడం ద్వారా రోబో తారను నటింప చేశామని ఆయన చెప్పారు.

సయోనారా చిత్రం గతవారం జపాన్‌లో ..

సయోనారా చిత్రం గతవారం జపాన్‌లో ..

సయోనారా చిత్రం గతవారం జపాన్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు విడుదల చేసేది చిత్ర నిర్మాతలు ఇంకా వెల్లడించలేదు.

సినీ తారలతో నటింపచేయడం కన్నా రోబోలతో..

సినీ తారలతో నటింపచేయడం కన్నా రోబోలతో..

సినీ తారలతో నటింపచేయడం కన్నా రోబోలతో నటింపచేయడమే చాలా సులభమనే విషయం తనకీ సినిమా ద్వారా అనుభవపూర్వకంగా తెల్సిందని, పైగా ప్రశస్త భోజనం కావాలని, లగ్జరీ సూట్లు కావాలని డిమాండ్లు ఉండవని జోజి తెలిపారు.

కాకపోతే ఎప్పుడైనా మరమ్మతు అవసరం కావచ్చని..

కాకపోతే ఎప్పుడైనా మరమ్మతు అవసరం కావచ్చని..

కాకపోతే ఎప్పుడైనా మరమ్మతు అవసరం కావచ్చని, వాటికి కూడా నిజమైన తారలతో పోల్చుకుంటే ఖర్చు తక్కువేనని తెలిపారు. తన చిత్రం చివరలో ఇతర తారలకు ఇచ్చినట్లే రోబో తారకు కూడా క్రెడిట్‌ లైన్ ఇచ్చానని ఆయన చెప్పారు.

ఈ రోబో తారలను మరింత ఆధునీకరిస్తే..

ఈ రోబో తారలను మరింత ఆధునీకరిస్తే..

ఈ రోబో తారలను మరింత ఆధునీకరిస్తే భవిష్యత్తులో నిజమైన తారల డిమాండ్ పడిపోవచ్చు లేదా వారి అవసరమే రాకపోవచ్చునేమో!

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇదే

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇదే

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Meet the world s first android actress
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting