పాక్‌తో యుద్ధం: ఇండియాకు 15 సెకన్లే ఎక్కువ

Written By:

నాటి నుంచి నేటి దాకా భారత్ పాకిస్తాన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థతి. ఎప్పుడు దాడి చేద్దామా అని పాకిస్తాన్ అణుక్షణం సరిహద్దుల్లో కాచుకూర్చుని ఉంది.ఇక పాకిస్తాన్ ఇప్పుడు మాటలకు కూడా పని చెప్పింది. హద్దు అదుపూ లేకుండా మాట్లాడుతోంది. ఇప్పుడు సడన్ గా యుద్ధం వస్తే మన దేశంలో ఓ రాష్ర్టమంత భూభాగం కూడా లేని ఆ దేశం మనదేశాన్ని కొద్ది సెకన్లలోనే భూ స్థాపితం చేస్తుందని పాకిస్తాన్ సైంటిస్ట్ ముబారక్ గత కొద్ది రోజుల క్రితం చెప్పారు. అత్యాధునికి మిస్సైల్స్ తో దాడిచేస్తామని బీరాలు పలుకుతున్నారు.దీనికి మన ఇండియా కూడా తన మాటలకు పని చెప్పింది. పాక్ తో యుద్ధం వస్తే కేవలం 15 సెకన్లలో దానిని నామరూపాల్లేకుండా చేయగల సత్తా ఇండియాకు ఉందని ఇండియా టుడే కథనం రాసింది. మిగతా కథనం స్లైడర్ లో

Read more:ప్రపంచాన్నే టార్గెట్ చేసిన పాకిస్తాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దౌత్య సంబంధాలకు రాం రాం

దౌత్య సంబంధాలకు రాం రాం

మూడు దశాబ్దాలుగా ముష్కరుల్ని మన దేశం మీదికి ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ దౌత్య సంబంధాలకు రాం రాం చెప్పి ఎప్పుడు దాడి చేద్దామా అని కాచుకూర్చుని ఉంది. ఓ తీవ్రవాదికి శిక్ష విషయంలో భారత్‌లో చర్చలు జరుగుతాయి. కాని అమాయకుల ప్రాణాలు బలిగొని పక్క దేశాన్ని అస్థిర పరిచేందుకు పాకిస్తాన్‌లో పథకాలు రచింపబడతాయి.

20000 రౌండ్లు కాల్పులతో సమాధానం చెప్పినపుడు ..

20000 రౌండ్లు కాల్పులతో సమాధానం చెప్పినపుడు ..

నిజానికి 200 రౌండ్లు కాల్పుల స్థాయినుంచి మన సరిహద్దు సేనలు ప్రస్తుత ప్రభుత్వ హయాం లో 20000 రౌండ్లు కాల్పులతో సమాధానం చెప్పినపుడు పాకిస్తాన్ సైన్యం భయపడింది. కొన్ని నెలలపాటు బుద్ధిగా కూర్చుంది. యుద్ధాలలో గెలవడం పాకిస్తాన్‌తో చర్చలలో ఓడిపోవడం మన ప్రభుత్వాల కలవాటే!

1947లో భారత్ సెక్యులర్ దేశంగా, పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యంగా..

1947లో భారత్ సెక్యులర్ దేశంగా, పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యంగా..

1947లో భారత్ సెక్యులర్ దేశంగా, పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పడడం నుంచే పొరుగు దేశంతో మన బంధం వివాదాలకు ఆలవాలమయింది. మూడు యుద్ధాలలో ఓడినా పాకిస్తాన్‌కు బుద్ధిరాలేదు. సిమ్లా, ఆగ్రా, లాహోర్‌లలో సమావేశాలేవీ సత్ఫలితాలనివ్వలేదు.

2001లో భారత పార్లమెంటుపై దాడి

2001లో భారత పార్లమెంటుపై దాడి

1989లో కాశ్మీరులో సమాంతర తీవ్రవాదం మొదలయింది. 2001లో భారత పార్లమెంటుపై దాడి జరిగింది. 2007లో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్ళు జరిగాయి. 2008లో ముంబై తాజ్ హోటల్‌పై దాడి జరిగింది. పరోక్ష యుద్ధం పరాకాష్ఠకు చేరింది.

భారత్-పాక్‌ల మధ్య పోరు

భారత్-పాక్‌ల మధ్య పోరు

దాయాదుల పోరు కురుక్షేత్రంతో ముగిసినట్లు భారత్-పాక్‌ల మధ్య పోరు ఎటు దారితీస్తుందో తెలియని పరిస్థితి వుంది. తాము పెంచి పోషించిన టెర్రర్ భూతం తమ దేశంలోనే అల్లకల్లోలం సృష్టిస్తున్నా పాకిస్తాన్ పాఠాలు నేర్వడం లేదు.

బీబీసీ సర్వే ప్రకారం

బీబీసీ సర్వే ప్రకారం

బీబీసీ సర్వే ప్రకారం 11% భారతీయులు పాకిస్తాన్ పట్ల సానుకూలంగా 45% మంది ప్రతి కూలంగా వున్నారు. 19% పాక్ ప్రజలు భారత్ పట్ల సానుకూలంగా, 54% మంది ప్రతికూలంగా వున్నారు.

ఇండియాకు సమాధానం చెప్పగల సత్తా

ఇండియాకు సమాధానం చెప్పగల సత్తా

పాకిస్తాన్ తో ఇండియాకు గనుక యుద్ధం వస్తే ఇండియాకు సమాధానం చెప్పగల సత్తా పాకిస్తాన్ కు ఉందని పాకిస్తాన్ సైంటిస్ట్ సమర్ ముబారక్ బల్లగుద్ది చెబుతున్నారు. నిజంగా అలా పాకిస్తాన్ తయారవుతుందా..అనే అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతున్నాయి.

ఇండియా తలుచుకుంటే 15 సెకన్లలో సర్వనాశనం

ఇండియా తలుచుకుంటే 15 సెకన్లలో సర్వనాశనం

దీనికి ధీటుగా ఇండియాటుడే కూడా తన కథనంతో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పింది. అణుక్షణం భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ను ఇండియా తలుచుకుంటే 15 సెకన్లలో సర్వనాశనం నామరూపాలు లేకుండా చేయగలదు. అయితే భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుంది..ఒక వేళ యుధ్ధం కనుక వస్తే దాదాపు కోటి మంది చనిపోతారని ఇండియా టుడే కథనం రాసింది.

భారత్ కూడా తన క్షిపణులతో సమాధానం చెప్పగలదని..

భారత్ కూడా తన క్షిపణులతో సమాధానం చెప్పగలదని..

పాకిస్తాన్ ప్రయోగించిన షహీన్ 1 మిస్సైల్ 900 కిలోమీటర్ల దూరాన్ని అలాగే షహీన్ 11 2000 కిలోమీటర్ల దూరాన్ని అలాగే 3000 కిలోమీటర్ల దూరాన్ని షమీన్ 111 చేధించగలదని ముబారక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి భారత్ కూడా తన క్షిపణులతో సమాధానం చెప్పగలదని ఆయనకు తెలియదు కాబోలు.

కోటి మంది చనిపోతారని ..

కోటి మంది చనిపోతారని ..

ఇక అణు పరీక్షల విషయానికి వస్తే ఒకదానితో ఒకటి పోటీపడుతూ ముందుకు పోతున్నాయి. 1998లో భారత్ అణు పరీక్షలు జరిపింది. పాకిస్తాన్ కూడా జరిపింది. అణ్వాయుధాలు కల్గి వుండడం వ్యూహాత్మకమైన రక్షణశాఖ విధానం. నిజంగా పాకిస్తాన్, భారత్‌ల మధ్య అణుయుద్ధం జరిగితే 15 సెకనుల్లో పాకిస్తాన్ కనుమరుగవుతుందని, కోటి మంది చనిపోతారని తెలిపింది.మరి అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.

రాడార్లకు సైతం కనిపించకుండా దాడి చేసే ఐఎన్ ఎస్ కొచ్చి

రాడార్లకు సైతం కనిపించకుండా దాడి చేసే ఐఎన్ ఎస్ కొచ్చి

1975లో మన దేశం ఆర్యభట్ట ఉపగ్రహాన్ని నింగికి పంపింది. 1990లో బిఎడిఆర్-1ని ఉపగ్రహాన్ని పాకిస్తాన్ ప్రయోగించింది. మనం 2008లో చంద్రయాన్ ప్రారంభిస్తే, 2011లో పాకిస్తాన్ పాక్‌శాట్-1ఆర్‌ను భూకక్ష్యలోకి పంపింది. ఈ మధ్య భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో యుద్ధ నౌక వచ్చి చేరింది. రాడార్లకు సైతం కనిపించకుండా దాడి చేసే శత్రు క్షిపణులను విధ్వంసం చేయగల ఐఎన్ ఎస్ కొచ్చి యుధ్ధనౌక భారత్ ఒడిలోకి చేరింది.

స్మైలింగ్ బుద్ధ’ పేరుతో అణ్వస్తప్రరీక్షలు

స్మైలింగ్ బుద్ధ’ పేరుతో అణ్వస్తప్రరీక్షలు

1971లో పాక్‌పై భారత్ విజయం తరువాత నాటి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1974 ‘స్మైలింగ్ బుద్ధ' పేరుతో అణ్వస్తప్రరీక్షలు జరిపింది. ఏ ప్రకటనలు చేయకుండా పాకిస్తాన్ 1983లో కిరాణా-1 పేరున అణ్వస్త్ర పరీక్షలు జరిపింది.1998లో ఇరు దేశాలు మళ్ళీ ఈ పరీక్షలు జరిపాయి.

అభివృద్ధిలో పోటీపడేందుకు ‘ఆటంకవాదం’ అడ్డంకిగా ..

అభివృద్ధిలో పోటీపడేందుకు ‘ఆటంకవాదం’ అడ్డంకిగా ..

బలసమీకరణలో పోటీపడ్తున్న ఇరుదేశాలు అభివృద్ధిలో పోటీపడేందుకు ‘ఆటంకవాదం' అడ్డంకిగా మారింది. కాశ్మీరు నడ్డంపెట్టుకొని పాకిస్తాన్ నెరపిన సీమాంతర ఉగ్రవాదంలో భారత్‌లో ఎందరో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

పాకిస్థాన్‌లోని అణ్వాయుధాలు ప్రమాదకర స్థితిలో..

పాకిస్థాన్‌లోని అణ్వాయుధాలు ప్రమాదకర స్థితిలో..

ఇక పాకిస్థాన్‌లోని అణ్వాయుధాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ కాలంలో జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన స్టీఫెన్ హెడ్లీ ఆనాడే చెప్పారు. ఒకవైపు పాకిస్థాన్‌లో పెరిగిపోతున్న తీవ్రవాదులు చొరబాట్లు.. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో జోరుగా సాగుతున్న యుద్ధం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.

అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు అనుమానాలు

అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు అనుమానాలు

పాకిస్థాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వెల్లడైన వార్తా కథనం ప్రకారం.. పాకిస్థాన్ కొత్త అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

పాకిస్థాన్ ప్రభుత్వం తమ వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునేందుకు ..

పాకిస్థాన్ ప్రభుత్వం తమ వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునేందుకు ..

తాజాగా వెలువడిన ఓ వార్తా కథనం ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది. పాక్ ప్రభుత్వం కొత్త అణు కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు తాజా కథనం వెల్లడించింది. పాకిస్థాన్ ప్రభుత్వం తమ వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు కొనసాగిస్తూనే ఉందనేందుకు అమెరికా అణు శాస్త్రవేత్తలు గ్రూపు ఒకటి కొత్త ఆధారాలు కనిపెట్టింది.

రెండు కొత్త ఫ్లూటోనియం ఉత్పత్తి కేంద్రాలను..

రెండు కొత్త ఫ్లూటోనియం ఉత్పత్తి కేంద్రాలను..

ఆయుధాల్లో ఉపయోగించేందుకు అవసరమైన అణు పదార్థాల నిల్వలను పాకిస్థాన్ పెంచుకుంటుందని, ఇందుకోసం రెండు కొత్త ఫ్లూటోనియం ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా అణు రసాయన విభజన కేంద్రాన్ని కూడా పాక్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ మిస్సైల్ (షహీన్- 2)ని కూడా సిద్ధం కావొచ్చినట్లు మీడియా కథనం వెల్లడించింది.

2020 నాటికి కనీసం 200 అణ్వాయుధాలను సముపార్జించుకునే అవకాశం

2020 నాటికి కనీసం 200 అణ్వాయుధాలను సముపార్జించుకునే అవకాశం

పొరుగుదేశం పాకిస్తాన్ 2020 నాటికి కనీసం 200 అణ్వాయుధాలను సముపార్జించుకునే అవకాశముందని అమెరికా హెచ్చరిస్తోంది. అంతేకాక పాక్ అణ్వాయుధాల తయారీకి చైనా కూడా ఇతోధికంగా చేయూతనిస్తోందని అమెరికా బల్లగుద్ది మరీ చెబుతోంది.

పాక్ చైనాల రూపంలో భారత్ కు ఇద్దరు ప్రమాదకరమైన శత్రువులు

పాక్ చైనాల రూపంలో భారత్ కు ఇద్దరు ప్రమాదకరమైన శత్రువులు

పాక్ చైనాల రూపంలో భారత్ కు ఇద్దరు ప్రమాదకరమైన శత్రువుల నుంచి పెను ముప్పు ఉందని అమెరికా రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరు దేశాల్లో ఏ ఒక్క దేశంతోనైనా భవిష్యత్ లో భారత్ యుధ్ధం జరపాల్సి వస్తే అణు యుధ్ధం తప్పకపోవచ్చని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాక్ అసంబద్ధ ప్రేలాపనలకు ఆధారాలేవీ..

పాక్ అసంబద్ధ ప్రేలాపనలకు ఆధారాలేవీ..

బలూచిస్తాన్‌లో భారత్ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న పాక్ అసంబద్ధ ప్రేలాపనలకు ఆధారాలేవీ స్పష్టంగా కానరాలేదు.అగ్ర దేశమైన అమెరికాలోనే మారణహోమం సృష్టించిన బిన్‌లాడెన్‌కు సైతం పాకిస్తాన్ ఆశ్రయమిచ్చింది.

బాంబుదాడులు, వైమానిక దాడులు..

బాంబుదాడులు, వైమానిక దాడులు..

అమెరికాలో ఉరిశిక్షలు లేకపోయినా శత్రుస్థావరాలపై, తీవ్రవాదులపై గురిచూసి బాంబుదాడులు, వైమానిక దాడులు చేయడం అమెరికా యుద్ధ నీతి. ఆ నీతిని అక్షరసత్యం చేస్తూ బిన్‌లాడెన్‌ను వారు మట్టుపెట్టగలిగారు.

చుట్టూ 24 అరబ్బు రాజ్యాలున్న ఇజ్రాయిల్ చూపిన సాహసం..

చుట్టూ 24 అరబ్బు రాజ్యాలున్న ఇజ్రాయిల్ చూపిన సాహసం..

మన దేశంలో మేధావులు, రాజకీయ నాయకులు కొందరు ఓట్ల కక్కుర్తితో మీనమేషాలు లెక్కపెడుతూ, ప్రజలకు పిరికి మందు నూరిపోస్తూ మీడియాలో కొంగ జపం చేస్తున్నారు. శత్రు శేషం, ఋణశేషం వుండకూడదన్న సూత్రం ప్రపంచ దేశాలు అమలుచేస్తున్నాయి. చుట్టూ 24 అరబ్బు రాజ్యాలున్న ఇజ్రాయిల్ చూపిన సాహసం మనం చూపలేకపోతున్నాం.

పాక్ ఆక్రమిత కాశ్మీరు భూభాగాన్ని సైతం మనం దక్కించుకోవాలని..

పాక్ ఆక్రమిత కాశ్మీరు భూభాగాన్ని సైతం మనం దక్కించుకోవాలని..

1948లో పాక్‌తో జరిగిన యుద్ధంలో మనం కోల్పోయిన పాక్ ఆక్రమిత కాశ్మీరు భూభాగాన్ని సైతం మనం దక్కించుకోవాలని భారత పార్లమెంటు చేసిన తీర్మానాన్ని అమలుపరచండి అని గట్టిగా ప్రభుత్వాన్ని కోరాల్సిన మేధావులు, నేతలు వొట్టిమాటలతో చేష్టలుడిగినట్లు ప్రవర్తిస్తున్నారు.

నిత్యమూ సరిహద్దులలో జీవన్మరణ సమస్యతో ..

నిత్యమూ సరిహద్దులలో జీవన్మరణ సమస్యతో ..

నిత్యమూ సరిహద్దులలో జీవన్మరణ సమస్యతో సతమతమవుతున్న తోటి ప్రజలను వారి ఖర్మకు వారిని వొదిలేస్తున్నారు. పాకిస్తాన్, భారత్‌పై ఉగ్రవాద దాడుల్ని మరింతగా పెంచేందుకు కావల్సిన శక్తి, విశ్వాసాన్ని పరోక్షంగా అందిస్తున్నారు. భారత్‌లో మనం ఏం చేసినా ఫరవాలేదు అన్న నమ్మకం శత్రువులో బలపడేందుకు సహకరిస్తున్నారు.

హురియత్ నేతలు పాకిస్తాన్ జెండాలు ఎగురవేస్తుంటే..

హురియత్ నేతలు పాకిస్తాన్ జెండాలు ఎగురవేస్తుంటే..

హురియత్ నేతలు పాకిస్తాన్ జెండాలు ఎగురవేస్తుంటే, శ్రీనగర్‌లో ఐయస్‌ఐయస్ జెండాలు రెపరెపలాడ్తుంటే ఈ సోకాల్డు మేధావులు ఖండించరెందుకని? లష్కరే తోయిబా, పాకిస్తాన్ జెండాలు ఎగురవేస్తూ ప్రతిఘటనకారులు అఫ్జల్‌గురు అవశేషాలిమ్మని గోలచేస్తుంటే కిమ్మనరేం?

డా.అబ్దుల్‌కలామ్‌కు శ్రద్ధాంజలి ఘటించారా..?

డా.అబ్దుల్‌కలామ్‌కు శ్రద్ధాంజలి ఘటించారా..?

తీవ్రవాదికి మతమేమిటి? కులమేమిటి? మనోభావాల మాటేమిటి? మతం రీత్యా ముస్లిం కనుక యాకూబ్‌ని ఉరితీస్తున్నారని గగ్గోలుపెడ్తున్న కొందరు ముస్లిం నేతలు భారత రాష్టప్రతి స్థాయికి ఎదిగి ఆఖరి క్షణం వరకు నిర్మాణ కార్యమే, కర్మయోగమే తన వ్రతంగా భావించి భరతమాత పాదాల చెంత తన్నుతాను అర్పించుకున్న భారతరత్న డా.అబ్దుల్‌కలామ్‌కు శ్రద్ధాంజలి ఘటించారా..?

ఈ దేశంలో చట్టాలు అందరికీ సమానమే

ఈ దేశంలో చట్టాలు అందరికీ సమానమే

స్వతంత్ర భారతదేశంలో యిప్పటికి 1800 మందికి ఉరిశిక్ష అమలయితే అందులో కేవలం 64 మంది మాత్రమే ముస్లింలు.ఈ దేశంలో చట్టాలు అందరికీ సమానమే. చట్టం చుట్టం చేసుకుని బ్రతికేవారికి కాలం చెల్లింది. భారతీయ ముస్లింలు ఐస్ ఐస్ బాణీలకు నాట్యం చేయరని, వారు దేశభక్తులని ప్రధాని మోదీ గత సంవత్సరమే రాయిటర్ ప్రతినిధితో అన్నారు.

భారతదేశంతో వెయ్యేళ్ళ జీహాద్‌కే తాము సంసిద్ధంగా వున్నామని ..

భారతదేశంతో వెయ్యేళ్ళ జీహాద్‌కే తాము సంసిద్ధంగా వున్నామని ..

ప్రధాని నమ్మకాన్ని నిలబెట్టాల్సిన గురుతర బాధ్యత అందరి మీద వుంది. భారతదేశంతో వెయ్యేళ్ళ జీహాద్‌కే తాము సంసిద్ధంగా వున్నామని ఆనాడు ఐక్యరాజ్యసమితిలో పాక్ విదేశాంగ మంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టో చేసిన హెచ్చరిక, ‘ఇండియన్ డాగ్స్'అని చేసిన పరిహాసం ఏ భారతీయుడు మరచిపోడు.

దాయాదులతో చర్చలు అంటూ కాలం జరపకుండా..

దాయాదులతో చర్చలు అంటూ కాలం జరపకుండా..

భారత్ ఇప్పటికైనా దాయాదులతో చర్చలు అంటూ కాలం జరపకుండా మన సత్తాను చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి రూట్లోనే వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఇంకా ఎంతో దూరంలో కూడా లేదు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు.  https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Pakistan can wipe out India in few seconds, says Dr Samar Mubarak
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot