అపర కుబేరుడు...వాడేఫోన్ గురించి తెలిస్తే షాకే !

Written By:

ప్రపంచంలో అత్యంత ధనికుల్లో అతనిది రెండో స్థానం. అతను తలుచుకుంటే అన్ని అతని ముంగిట ఉంటాయి. ఏదీ కావాలన్నా క్షణాల్లో అతనికి అందుతాయి. అతనే వారెన్ బఫెట్. అతనికి ఐఫోన్లు వాడటం అసలు ఇప్టంలేదని అంటున్నారు. పాతత కాలం నోకియా ఫోన్లే చాలా ముద్దు అని చెబుతున్నారు. మరి ఎందుకలా చెబుతున్నారు. ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఈ చెత్త పాస్‌‌వర్డ్స్ పెట్టుకున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్‌ కంపెనీలో ఆయనకు చాలా వాటాలు

వారెన్ బఫెట్.... ప్రపంచంలో రెండో ధనవంతుడు. ఆపిల్‌ కంపెనీలో ఆయనకు చాలా వాటాలున్నాయి. ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ ఆయన ఐఫోన్‌ వాడరు.

పాతకాలం నాటి నోకియా ఫోన్‌నే..

ఆ మాటకొస్తే కనీసం స్మార్ట్‌ ఫోన్‌ కూడా వాడరు. పాతకాలం నాటి నోకియా ఫోన్‌నే వాడుతున్నారు. ‘ఏ వస్తువునైనా కనీసం ఓ పాతికేళ‍్లయినా వాడనిదే పారేయను' అని స్పష్టంగా చెప్తారు.

ఈ-మెయిల్‌ కూడా వాడరు

ఆయన ఈ-మెయిల్‌ కూడా వాడరు. ఇప్పటివరకూ ఒక్కసారి మాత్రమే ఈ-మెయిల్‌ పంపించారు. బఫెట్‌ తన జీవితాన్ని ఆరంభించినప్పుడు ఎలా బతికేవాడో ఇప్పుడూ దాదాపు అలాగే బతుకుతున్నారు.

సొంతంగా ఒక జెట్‌ విమానం

1958లో ఓమాహాలో 31,500 డాలర్లకు కొన్న మూడు పడక గదుల ఇంట్లోనే ఇప్పటికీ నివసిస్తున్నారు. ఆయనకు సొంతంగా ఒక జెట్‌ విమానం ఉంది. కానీ అత్యవసర సమావేశాలు ఉంటేనే అరుదుగా దానిని వాడతారు.

తన జీవిత సూత్రాల ప్రకారం

స్మార్ట్‌ ఫోన్లు, ఈ-మెయిళ్లు వాడరు కాబట్టి, బఫెట్‌కు కొత్త సాంకేతిక పరిజ్ఞానమంటే అనవసర భయమని చాలామంది అనుకుంటారు. అది వాస్తవం కాదు. బఫెట్‌ తన జీవితాన్ని తన జీవిత సూత్రాల ప్రకారం జీవించే ప్రాక్టికల్‌ మనిషి.

కంపెనీలో షేరు కొనాలంటే

ఏదైనా కంపెనీలో షేరు కొనాలంటే దానిని కనీసం పదేళ్లయినా అట్టిపెట్టుకునే ఆలోచన లేకపోతే కొనవద్దు అనే మార్కెట్‌ జ్ఞానం ఆధారంగా ఆయన వస్తువులను చాలాకాలం పాటు వాడుతుంటారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here’s why Warren Buffett, the world’s second-richest man, does not use associate iPhone read more t gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot