ఈ చెత్త పాస్‌‌వర్డ్స్ పెట్టుకున్నారా..?

Written By:

చాలామంది పాస్ వర్డ్ లను చాలా ఈజీగా పెట్టేస్తుంటారు. తాము గుర్తించుకునేందుకు వీలుగా వరుస నంబర్స్ అలాగే వరుస నేమ్స్ తో పాటు రెగ్యులర్ గా వాడే పదాలను పెట్టుకుంటారు. 1234, 5678, abcd, ఇలా వరుసగా వచ్చే వాటిని పెట్టుకుంటారు. అయితే ఇవి చాలా డేంజరని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తక్కువ బడ్జెట్‌లో, బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐటీ సెక్యూరిటీ సంస్థ కీపర్ సెక్యూరిటీ

అలాంటి అకౌంట్లు హ్యాకింగ్‌కు గురవుతాయని, ఇలా సింపుల్‌గా ఉండే పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటే ఎప్పటికైనా ముప్పు తప్పదని, అయినప్పటికీ చాలా మంది యూజర్లు ఇంకా ఇలాంటి పాస్‌వర్డ్‌లనే పెట్టుకుంటున్నారని,. ఐటీ సెక్యూరిటీ సంస్థ కీపర్ సెక్యూరిటీ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది.

2017 సంవత్సరానికి గాను

ఈ మధ్య కాలంలో హ్యాకింగ్‌కు గురైన యూజర్ల అకౌంట్లు, లీకైన వారి పాస్‌వర్డ్‌లను కొన్ని లక్షల సంఖ్యలో విశ్లేషించింది కీపర్ సెక్యూరిటీ. దీంతో 2017 సంవత్సరానికి గాను యూజర్లు వాడుతున్న అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాను ఆ సంస్థ ప్రకటించింది.

123456

అందులో 123456 అనే పాస్‌వర్డ్ మొదటి స్థానంలో ఉంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది యూజర్లు పాస్‌వర్డ్‌గా వాడుతున్నారట.

దీని తరువాతి స్థానాల్లో

దీని తరువాతి స్థానాల్లో వరుసగా 123456789, qwerty, 12345678, 111111, 1234567890, 1234567, password, 123123, 987654321, qwertyuiop, mynoob, 123321, 666666, 18atcskd2w, 7777777, 1q2w3e4r, 654321, 555555, 3rjs1la7qe, google, 1q2w3e4r5t, 123qwe, zxcvbnm, 1q2w3e అనే పాస్‌వర్డ్‌లు నిలిచాయి. వీటిని చాలా మంది పాస్‌వర్డ్‌లుగా ఇప్పటికీ వాడుతున్నారట.

పైన చెప్పిన చెత్త పాస్‌వర్డ్‌లను

అయితే పైన చెప్పిన చెత్త పాస్‌వర్డ్‌లను మాత్రం అసలు వాడవద్దని చెబుతున్నారు ఐటీ సెక్యూరిటీ నిపుణులు. అవన్నీ హ్యాకర్లకు చాలా అనుకూలంగా ఉంటాయట. వాటిని వారు సులభంగా గెస్ చేయగలరట.

గుర్తుంచుకోవడానికి కొంచెం కష్టమైనా

గుర్తుంచుకోవడానికి కొంచెం కష్టమైనా చాలా క్లిష్టతరమైన పాస్‌వర్డ్‌లనే సెట్ చేసుకోవాలని వారు అంటున్నారు. అంకెలు, అక్షరాలు (క్యాపిటల్, స్మాల్), సింబల్స్, ప్రత్యేక గుర్తులు అన్నీ కలసి ఉండేలా పాస్‌వర్డ్ సెట్ చేసుకుంటే రక్షణ ఉంటుందని అంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The 25 passwords you should never use read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting