అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

By Hazarath
|

మీ దగ్గర ఐ ఫోన్ ఉందా.. అయితే వెంటనే అప్‌డేట్ చేసుకోండి లేకుంటే ఐ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని కంపెనీ హెచ్చరించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ఐ ఫోన్ లోకి బగ్ లు చేరాయనే వార్తలు రావడంతో ఆపిల్ కంపెనీ అలర్ట్ అయ్యింది. సిస్టం అప్‌డేట్‌ను ప్రకటించింది.

రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

ఐ ఫోన్లలో ప్రమాదకరమైన భద్రతా లోపం పరిష్కరించుకోవాలని సూచిస్తూ ఈ లోపాలను సరిదిద్దుతూ ఆపిల్ కంపెనీ ఆగస్టు 25 న పాచ్ జారీ చేసింది. కొత్త వెర్షన్ ఐఓఎస్‌9.3.5ను విడుదల చేసింది

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

ఆపిల్ యూజర్లు తక్షణమే ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఈ వెర్షన్ ఐఫోన్‌ 4ఎస్‌, ఐఫ్యాడ్‌2, ఐపాడ్‌ టచ్‌(5వ జెనరేషన్‌)తోపాటు ఆ తర్వాతి మోడల్‌ డివైజ్‌లలో ఈ కొత్త వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకునే వీలుంది.

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

తమ ఆపరేటింగ్ సిస్టం లేటెస్ట్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుని అప్‌డేట్ చేసుకోవల్సిందిగా యూజర్లందరిని కోరినట్టు తెలిపింది. తద్వారా భద్రతను పెంచుకోవాల్సిందిగా అప్రమత్తం చేసినట్టు పేర్కొంది.

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

ఈ బగ్‌లను ప్రముఖ నెట్‌వర్కింగ్‌ సంస్థ సిస్కోకు చెందిన పరిశోధకులు ఇటీవల గుర్తించారు. ఆ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు మెసేజ్‌ల రూపంలో మాల్‌వేర్‌ లింకులను పంపి దాడులకు పాల్పడే ప్రమాదముందని హెచ్చరించారు.

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

ఈ గ్రూపు సైబర్ దాడి చేసి కాల్స్‌ ట్రాకింగ్‌.. లొకేషన్‌ ట్రాకింగ్‌కు పాల్పడడంతో పాటు.. ఫోన్‌లోని మెసేజ్‌లు.. కాంటాక్ట్స్‌.. రికార్డింగ్‌లు.. పాస్‌వర్డ్‌లను తస్కరించే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు. దీంతో ఆపిల్ కంపెనీ అలర్టయింది.

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

ఇజ్రాయిల్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఎన్ ఎస్ ఓ గ్రూపు దీనికి కారణంగా నిపుణులు పేర్కొన్నారు. రెడ్ క్రాస్, ఫేస్ బుక్, అల్ జజీరా, సీఎన్ ఎన్ , గూగుల్, పోకీమాన్ సంస్థ లను టార్గెట్ చేసిందనీ, దీనికి టూల్స్ రూపకల్పన చేసిందనీ కంపెనీ అధికారులు చెబుతున్నారు.

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

కాగా సెక్యూరిటీ సమస్యలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆపిల్‌ సంస్థ తొలిసారిగా బగ్‌బాంటీ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. బగ్ ను గుర్తించిన వారికి రెండు లక్షల డాలర్ల వరకు నగదు బహుమతి కూడా ఇవ్వనున్నట్లు ఆపిల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Best Mobiles in India

English summary
Here Write Here’s why you should update your iPhone immediately

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X