Home
News

RRR మూవీ బడ్జెట్ కు సమానంగా ఫాస్‌ట్యాగ్ ఒక రోజు‌ కలెక్షన్...

NHAI మీద ప్రయాణం చేసే నాలుగు చక్రాల పైన ఉన్న వాహనం వినియోగదారులు టోల్ గేట్ వద్ద యూజర్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ ఫీజును ఎలక్ట్రానిక్ పద్దతిలో చెల్లించడానికి ఈ సంవత్సరం ఫాస్‌ట్యాగ్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫాస్‌ట్యాగ్‌ అనేది ఒక రకమైన ప్రీపెయిడ్ ట్యాగ్. ఇది నాలుగు చక్రాలు లేదా ఆపైన గల మోటారు వాహనాలు టోల్ గేట్ వద్ద లావాదేవీల కోసం ఆపాల్సిన అవసరం లేకుండా టోల్లను జిప్ చేయడానికి అనుమతిస్తుంది.

ఫాస్‌ట్యాగ్ అమలు

ప్రీపెయిడ్ స్టిక్కర్ ట్యాగ్‌లను కలిగిన ఈ ఫాస్‌ట్యాగ్ RFID- ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండి వాహనం యొక్క సమాచారాన్ని బార్‌కోడ్‌లో స్టోర్ చేస్తుంది. అలాగే దీనిని మీ అకౌంట్ లేదా ప్రీపెయిడ్ వాలెట్‌తో అనుసంధానించబడుతుంది. ఫాస్‌ట్యాగ్ అమలులోకి వచ్చిన తరువాత దేశం మొత్తం మీద ఎలక్ట్రానిక్ హైవే యూజర్ ఫీజు డబ్బుల వసూలు వ్యవస్థ ద్వారా 50 లక్షల లావాదేవీలు జరగా 'ఫాస్ట్ ట్యాగ్' పద్ధతి ద్వారా ఒక రోజుకు టోల్ వసూలు 'RRR' సినిమా బడ్జెట్ వలె రూ.80 కోట్లు దాటింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న NHAI ప్రకారం డిసెంబర్ 24న ఒక్క రోజులోనే టోల్ వసూలు రూ.80 కోట్లకు దాటింది అని ప్రభుత్వం ప్రకటించింది.

NHAI

దేశం మొత్తం మీద ఇప్పటి వరకు 2.20 కోట్లకు పైగా 'ఫాస్ట్ ట్యాగ్' జారీ చేయబడినందున హైవేలలో ప్రయాణం చేసే వినియోగదారులు 'ఫాస్ట్ ట్యాగ్' ను కొనుగోలు చేసి టోల్ గేట్ వద్ద అధిక సమయం వేచి ఉండకుండా అపూర్వమైన వృద్ధిని కొనసాగిస్తున్నాయి. 2021 జనవరి 1 నుండి వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి కావడంతో NHAI దీనికి అనుగుణంగా మెరుగైన సేవలను అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది అని ఒక ప్రకటనను విడుదల చేసింది.

RFID

"ఫాస్ట్ ట్యాగ్" ను స్వీకరించడం ద్వారా టోల్ ప్లాజాలలో సమయం మరియు ఇంధనాన్ని ఆదా చేయడానికి హైవే వినియోగదారులకు సహాయపడింది. 'సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్' లో ఇటీవలి సవరణ ద్వారా డిజిటల్ లావాదేవీకి అవసరమైన పుష్ వచ్చింది. వినియోగదారు ఫీజు సేకరణ వ్యవస్థ 'రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్' (RFID) సాంకేతికతను ఉపయోగిస్తుంది. బ్యాంక్ వాలెట్తో అనుసంధానించబడిన ఈ ఫాస్ట్ ట్యాగ్ యొక్క అన్ని రకాల పేమెంట్స్ పూర్తిగా డిజిటల్గా చేయబడుతుంది అని ప్రకటన తెలిపింది.

టోల్ పేమెంట్

ప్రస్తుతం సామాజిక దూరం కొత్త ప్రమాణంగా మారినందున ప్రయాణికులు ఎక్కువ మంది ఫాస్ట్‌టాగ్‌ ద్వారా తమ యొక్క టోల్ పేమెంట్లను చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇది డ్రైవర్లు మరియు టోల్ ఆపరేటర్లకు చాలా ఉపయోగకరంగా ఉంది అని కూడా చెప్పవచ్చు. ఫాస్‌ట్యాగ్‌ను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా రకరకాల పద్దతులలో అందిస్తోంది.

జాతీయ రహదారి టోల్ ప్లాజాలు

వాహన యజమానులు ఫాస్‌ట్యాగ్‌ను ఉచితంగా పొందడానికి జాతీయ రహదారి టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, సాధారణ సేవా కేంద్రాలు, రవాణా కేంద్రాలు, పెట్రోల్ బంకులు మరియు ఇతర అధికారిక భౌతిక పాయింట్-ఆఫ్-సేల్ ప్రదేశాలలో మీ వద్ద గల చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) తో సందర్శించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Highway Toll Collection Crosses Rs.80 Crore Per Day Through FASTag
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X