Home
News

రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ వాడిన సీక్రెట్ ఆయుధాలు

20వ శతాబ్ధంలో అత్యంత శక్తివంతమైన నియంత ఎవరు అంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం అడాల్ప్ హిట్లర్..

20వ శతాబ్ధంలో అత్యంత శక్తివంతమైన నియంత ఎవరు అంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం అడాల్ప్ హిట్లర్.. హిట్లర్ రాజ్యకాంక్షకు ఫలితమే రెండవ ప్రపంచ యుద్ధం. 1939 నుంచి 1945 వరకు జరిగిన రెండవ ప్రపంచ సంగ్రామంలో ఆరుకోట్ల మంది మరణించిన విషయం విదితమే. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇందులో చనిపోయిన వారిలో మూడింట రెండవ వంతు సాధారణ పౌరులే.ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ యుధ్ధం కలిగించిన నష్టం దాదాపు పది లక్షల కోట్ల డాలర్లు. అంతటి పెను విషాదాన్ని మిగిల్చిన ఈ యుద్ధంలో హిట్లర్ వాడిన ఆయుధాలు ఏంటీ.. అయన సీక్రెట్స్ ఏంటీ.. రెండవ ప్రపంచ యుద్ధం కోసమే హిట్లర్ ముందునుంచి ఆయుధాలను సిద్ధం చేశాడా.....మిగతా కధనం స్లైడర్ లో చదవండి.

Read more: త్రిముఖ పోరులో సిరియా రక్తపుటేరులు

హిట్లర్ నాజీ ఇంజనీర్స్ అప్పట్లోనే అత్యాధునిక ఆయుధాలను..

హిట్లర్ నాజీ ఇంజనీర్స్ అప్పట్లోనే అత్యాధునిక ఆయుధాలను..

హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధం వస్తుందని తెలిసి ముందుగానే ఆయుధాలను తయారు చేసుకున్నారు. హిట్లర్ నాజీ ఇంజనీర్స్ అప్పట్లోనే అత్యాధునిక ఆయుధాలను తయారుచేశారు. వాటిలో సోనిక్ గన్స్ ,ఎక్స్ రే గన్స్ ,లాండ్ క్రూజెర్స్ లాంటి విధ్వంసక ఆయుధాలు ఉన్నాయి.

వీపన్స్ మ్యాగజైన్ ఆస్తకికర కథనాన్ని..

వీపన్స్ మ్యాగజైన్ ఆస్తకికర కథనాన్ని..

దీనికి సంబంధించి వీపన్స్ మ్యాగజైన్ ఆస్తకికర కథనాన్ని ప్రచురించింది. హిట్లర్ నాజీల సీక్రెట్ వీపన్స్ ఇవే నంటూ కొన్ని ఫోటోలను ప్రచురించింది.వాటిలో అత్యాధునికమైన ఆయుధాలతో పాటు క్షణాల్లో విధ్వంసం సృష్టించి పరిసరాలను బూడిద చేసే బాంబులు కూడా ఉన్నాయి.

వీటిలో ప్రిట్జ్ ఎక్స్ ఒకటి

వీటిలో ప్రిట్జ్ ఎక్స్ ఒకటి

వీటిలో ప్రిట్జ్ ఎక్స్ ఒకటి..ఇది హిట్లర్ దగ్గరున్న అత్యంత మోస్ట్ సీక్రెట్ పవర్ పుల్ బాంబు. ఈ స్మార్ట్ బాంబుకు పితామహుడుగా హిట్లర్ నే అభివర్ణిస్తారు.ఇది 700lbsరేడియో గైడెడ్ ను మోసుకెళ్లగలదు. ఈ బాంబు ఎటువంటి రక్షణ వ్యవస్థనైనా క్షణాల్లో భస్మీపటలం చేయగలదు.

హర్టన్ హో 229 బాంబర్

హర్టన్ హో 229 బాంబర్

ఇదొక అత్యాధునిక హిట్లర్ అస్త్రం. ఇది ప్లయింగ్ వింగ్ బాంబు..ఇది గగనంలో 49వేల మీటర్ల ఎత్తులో ఎగురుతూ 2000 lbsరేడియో గైడెడ్ ని మోసుకెళ్లగలదు. భూమి మీద దీని వేగం సరాసరి 600 mph.ఈ బాంబర్ మొదటగా 1944లో ఎగిరింది. దీనికి రెండు టర్బోజెట్ ఇంజిన్లు,రెండు ఫిరంగులు అలాగే R4M రాకెట్లు అమర్చారు.

ప్రపంచంలోనే ప్రత్యేకమైన స్టీల్ విమానం

ప్రపంచంలోనే ప్రత్యేకమైన స్టీల్ విమానం

ప్రపంచంలోనే ప్రత్యేకమైన స్టీల్ విమానం ఇదే. ఈ విమానమే నాజీలు మిలియన్ రీచ్ మార్క్ స్టీల్ విమానాలకు స్ఫూర్తినిచ్చింది. ఇది ఎలక్ట్రానిక్ మోటార్ తో గ్యాస్ బర్నర్ సాయంతో శత్రు సేన మీదకు దూసుకెళుతుంది.

హిట్లర్ చేతిలో ఇదొక అత్యాధునిక ఆయుధం

హిట్లర్ చేతిలో ఇదొక అత్యాధునిక ఆయుధం

హిట్లర్ చేతిలో ఇదొక అత్యాధునిక ఆయుధం. ఇదొక సూక్ష్మ ట్యాంకు..దీని ద్వారా 133 పేలుడు పదార్ధాలు 220 220lbs వరకు తీసుకెళ్లవచ్చు. భారీ వాహనాలను అటాక్ చేయడానికి వాటిని పేల్చడానికి దీనిని ఉపయోగించారు. ఈ నాజీల ఆయుధమే ఇప్పుడు రేడియో కంట్రోల్ ఆయుధాల తయారీకి కేంద్రబిందువయింది.

20వశతాబ్దంలోని శక్తివంతమైన నియంత హిట్లర్

20వశతాబ్దంలోని శక్తివంతమైన నియంత హిట్లర్

20వశతాబ్దంలోని శక్తివంతమైన నియంత హిట్లర్. ఆరేళ్లల్లో యూరప్‌లోని 80% భూభాగాన్ని హిట్లర్ గెలుచుకున్నాడు. అతన్ని యుద్ధ మేధావిగా చరిత్ర కారులు చెప్తారు. హిట్లర్ కొన్ని ముఖ్యమైన సైనిక పొరపాట్లని చేసి ఉండకపోతే, నేడు యూరప్, ప్రపంచంలోని అధిక భాగం బహుశా నాజీ పరిపాలనలో ఉండి ఉండేది.

చలి కాలంలో ఆ దేశం మీదకి దాడి చేయడం

చలి కాలంలో ఆ దేశం మీదకి దాడి చేయడం

మొదటిసారిగా హిట్లర్, సోవియట్ యూనియన్‌ని గెలవలేకపోయాడు. ఇందుకు కారణం చలి కాలంలో ఆ దేశం మీదకి దాడి చేయడం; జర్మన్ సైనికులకి ప్రతికూలం, సోవియట్ సైన్యానికి అనుకూలం అని తెలిసి కూడా తన సలహాదారుల సలహాలని పట్టించుకోక ఆ దాడిని ఆజ్ఞాపించాడు.

తొలి అసాల్ట్ సబ్‌మెషీన్ గన్

తొలి అసాల్ట్ సబ్‌మెషీన్ గన్

మరో తప్పిదం సోవియట్ యూనియన్ మీదికి దాడి చేసే సైనికులకి ఇవ్వడానికి యంబికె 42 అనే ప్రపంచంలోని తొలి అసాల్ట్ సబ్‌మెషీన్ గన్ తయారీకి ముందు అంగీకరించినా తర్వాత వద్దని కోపావేశంలో నిర్ణయం తీసుకున్నాడు. జర్మన్ కమాండర్స్, హిట్లర్‌కి తెలియకుండా వాటిని తయా చేయించినా వాటిని రద్దు చేశాడు.

తప్పుని గ్రహించి హిట్లర్ 1943 మధ్యలో..

తప్పుని గ్రహించి హిట్లర్ 1943 మధ్యలో..

సోవియట్ సైనికులు లక్షల్లో ఉండడంతో ఒక్కో జర్మన్ సైనికుడు పదుల సంఖ్యలో సోవియట్ సైనికులని చంపడానికి ఈ రైఫిల్ ఎంతో అనుకూలంగా ఉండేది. తన తప్పుని గ్రహించి హిట్లర్ 1943 మధ్యలో దీన్ని పునరుద్ధరించాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.

యుద్ధ విమానాలు ప్రొపెల్లర్‌తో ..

యుద్ధ విమానాలు ప్రొపెల్లర్‌తో ..

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ విమానాలు ప్రొపెల్లర్‌తో ఎగురుతుండేవి. ఎమ్-ఇ 262 అనే కోడ్‌నేమ్‌తో జర్మన్ వైమానిక శాస్తజ్ఞ్రులు మొదటిసారిగా జట్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌ని కనిపెట్టారు. 1943 మధ్యకల్లా ఇవి తయారవ్వాల్సి ఉంది. వాటిని ఇంటర్‌సెప్టర్ (రక్షణ విమానాలు)గా ఉపయోగించేవారు. కానీ హిట్లర్ వీటిని ఇష్టపడక ఫైటర్ బాంబర్ విమానాలనే ఉపయోగించి శత్రువులమీద బాంబింగ్ చేయాలని నిర్ణయించాడు.

జెట్ పవర్డ్ ఏర్ క్రాఫ్ట్స్ తయారీ

జెట్ పవర్డ్ ఏర్ క్రాఫ్ట్స్ తయారీ

దాంతో జెట్ పవర్డ్ ఏర్ క్రాఫ్ట్స్ తయారీ నిలిచిపోయింది.చివరికి తన తప్పిదం తెలుసుకుని ఆగస్టు 1945 కల్లా వీటిని తయారుచేసారు. కానీ అప్పటికే మిత్రసైన్యాలు జెట్ యుద్ధ విమానాలను తయారుచేసుకుని, వేల సంఖ్యలో ఉపయోగించడంతో లుఫ్త్‌వాఫ్ (జర్మన్ వైమానిక దళం) వాటి ధాటికి తట్టుకోలేకపోయింది.

సైనికుడు జీవించి ఉన్నంత కాలం యుద్ధాన్ని కొనసాగించాలన్న ఆదర్శాన్ని ..

సైనికుడు జీవించి ఉన్నంత కాలం యుద్ధాన్ని కొనసాగించాలన్న ఆదర్శాన్ని ..

హిట్లర్ ఎన్నడూ తన సైనికులు వెనక్కి తగ్గడాన్ని ఇష్టపడలేదు. ఆఖరి సైనికుడు జీవించి ఉన్నంత కాలం యుద్ధాన్ని కొనసాగించాలన్న ఆదర్శాన్ని నమ్మాడు. కానీ సైనిక పథకాలలో ఓ భాగం అవసరం వస్తే వెనక్కి తగ్గి మళ్లీ ముందుకు వెళ్లడం. దాన్ని పాటిం చకపోవడంతో సోవియట్ యూనియన్‌లోకి వెళ్లిన సైనికులు వెనక్కి రావడానికి అనుమతించలేదు. దాంతో సిక్త్స్ పాంజన్ ఆర్మీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.

1945లో జర్మనీలోకి మిత్రసైన్యాలు

1945లో జర్మనీలోకి మిత్రసైన్యాలు

1945లో జర్మనీలోకి మిత్రసైన్యాలు ప్రవేశించాక తాము వెనక్కి వచ్చి రైన్ రివర్ మీది వంతెనని నాశనం చేస్తామని అనుమతి కోరితే అనుమతింలేదు. అందువల్ల రష్యన్స్ బెర్లిన్‌లో ప్రవేశించేసరికి కేవలం నలభై వేలమంది జర్మన్ సైనికులు మాత్రమే మిగిలి ఉన్నారు.

నాజీ శాస్తజ్ఞ్రులు వి1, వి2 అనే కోడ్ నేమ్‌తో రాకెట్లని..

నాజీ శాస్తజ్ఞ్రులు వి1, వి2 అనే కోడ్ నేమ్‌తో రాకెట్లని..

నాజీ శాస్తజ్ఞ్రులు వి1, వి2 అనే కోడ్ నేమ్‌తో రాకెట్లని తయారు చేసారు. కానీ హిట్లర్ వాటిని లండన్ మీదికి పౌరులు బాధితులుగా ఉండేలా ప్రయోగించాడు తప్ప జర్మనీ సరిహద్దుల్లోని రష్యన్, అమెరికన్ సైనికుల మీదకి మాత్రం ప్రయోగించలేదు.అవి ఇంటికప్పుల మీద కూలి పేలేవి. ఫైరింజన్స్‌కి కొంత పని కలిగేది తప్ప సైనిక నష్టాన్ని కలిగించలేదు. వాటిని శత్రు సైనికుల మీద ప్రయోగించి ఉంటే వారిని నిలువరించే వారు.

1941లో సోవియట్ యూనియన్ మీదకి యుద్ధం వద్దని

1941లో సోవియట్ యూనియన్ మీదకి యుద్ధం వద్దని

హిట్లర్ ఎన్నడూ తన మిలటరీ జనరల్స్ సలహాలని ఆచరించలేదు. తగిన సమాచారం, నైపుణ్యం, పథకాలు మొదలైన వాటితో వారు వస్తే తన మనసులో ఉన్నదే చేయాలని ఆజ్ఞాపించేవాడు. జూన్ 1941లో సోవియట్ యూనియన్ మీదకి యుద్ధం వద్దని, చలికాలం తర్వాత దాడి సబబని జనరల్స్ చెప్తే హిట్లర్ అంగీకరించలేదు.

చలి శత్రు సైనికులు భరించగలిగేది, జర్మన్ సైనికులు భరించలేనిది

చలి శత్రు సైనికులు భరించగలిగేది, జర్మన్ సైనికులు భరించలేనిది

ఆ చలి శత్రు సైనికులు భరించగలిగేది, జర్మన్ సైనికులు భరించలేనిది. ఆగస్టు 1942 కల్లా జర్మన్స్‌ని నిరోధించడమే కాక రష్యా జర్మనీ మీదకి యుద్ధానికి తయారైంది. ఒక్కసారే ఫీల్డ్ మార్షల్ రండ్ స్టెట్ మాటని హిట్లర్ విన్నాడు. దాంతో అతని పథకం ప్రకారం ఆర్డెన్స్ అడవిగుండా మేజినాట్ లైన్‌ని జర్మన్ సైనికులు చుట్టుముట్టడంతో పోరాడకుండా ఫ్రాన్స్ లొంగిపోయింది. ఈ రోజుకీ ఫ్రాన్స్ పిరికితనం మీద జోక్స్ చెప్పుకుంటారు.

హిట్లర్ చేసిన మరి కొన్ని తప్పులు

హిట్లర్ చేసిన మరి కొన్ని తప్పులు

హిట్లర్ చేసిన మరి కొన్ని తప్పులు, ఎఫ్త్‌వేప్‌ని గోరింగ్‌కి అప్పగించడం, ఒకేసారి రెండు చోట్ల యుద్ధానికి దిగడం, అమెరికా మీద యుద్ధాన్ని ప్రకటించడం, యూదులని బంధించి చంపడం ద్వారా యూదు పౌరుల సహాయాన్ని మద్దతుని కోల్పోవడం. ఇలాంటివి చేసి ఉండకపోతే నాజీ జర్మనీ ఓడిపోయి ఉండేది కాదు. హిట్లర్ కోరిక తీరి ప్రపంచం బహుశా మొత్తానికి నియంత అయ్యేవాడు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu

More from GizBot

Best Mobiles in India

English summary
Here Write Hitler secretly made the weapons of the future during the Second World War
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X