గొప్ప ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ లో హానర్ ప్యాడ్ 5
హానర్ గత నెలలో ఇండియాలో హానర్ ప్యాడ్ 5 (8-అంగుళాల) మరియు హానర్ ప్యాడ్ 5 (10.1-అంగుళాల) కొత్త టాబ్లెట్లను విడుదల చేసింది. రెండు టాబ్లెట్‌లు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్స్ జరుగుతున్నాయి. హానర్ ప్యాడ్ 5 యొక్క 8-అంగుళాల మరియు 10.1-అంగుళాల వేరియంట్లు రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో 32 జిబి మరియు 64 జిబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ను కలిగి ఉంటాయి.

అంతే కాకుండా ఇవి వరుసగా 3 జిబి మరియు 4 జిబి ర్యామ్‌తో వస్తాయి. రెండు టాబ్లెట్లు 5,100 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటాయి.ఇది అంతర్గత హైసిలికాన్ కిరిన్ ప్రాసెసర్ల ద్వారా శక్తిని పొందుతాయి. హానర్ ప్యాడ్ 5 యొక్క 8-అంగుళాల మరియు 10.1-అంగుళాల వేరియంట్లను ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ నుండి కొన్ని ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు.

హానర్ ప్యాడ్ 5 టాబ్లెట్ ధరలు:
హానర్ ప్యాడ్ 5 టాబ్లెట్లు 8-అంగుళాలు మరియు 10.1-అంగుళాలు డిస్ప్లే లలో లభిస్తాయి.ఇవి 3GB + 32GB మరియు 4GB + 64GB వంటి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. హానర్ ప్యాడ్ 5 యొక్క 8-అంగుళాల మోడల్ యొక్క 3 జిబి ర్యామ్ మరియు 4 జిబి ర్యామ్ కాన్ఫిగరేషన్‌లు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో రూ.15,499 మరియు రూ.17,499 ధర వద్ద లభిస్తాయి. మరోవైపు 10.1 అంగుళాల హానర్ ప్యాడ్ 5 యొక్క 3 జిబి ర్యామ్ మరియు 4 జిబి ర్యామ్ మోడల్స్ ధరలు వరుసగా రూ.16,999 మరియు రూ.18,999.

ఆఫర్స్:
ఆఫర్స్ విషయంలో ఫ్లిప్‌కార్ట్ హానర్ ప్యాడ్ 5 మీద 3 నుండి 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ప్లాన్‌లను అందిస్తోంది. అదనంగా సాధారణ ఎక్స్చేంజ్ కింద 500రూపాయల వరకు తగ్గింపు ఉంటుంది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసినచో 10 శాతం తగ్గింపునకు అర్హులు. చివరగా అన్ని ప్రీపెయిడ్ లావాదేవీల కొనుగోలుదారులకు 500రూపాయల వరకు హానర్ ప్యాడ్ 5 యొక్క 8-అంగుళాల లేదా 10.1-అంగుళాల వేరియంట్ మీద తగ్గింపు లభిస్తుంది.

హానర్ ప్యాడ్ 5 (8-అంగుళాల) స్పెసిఫికేషన్స్:
హానర్ ప్యాడ్ 5 (8-అంగుళాల) ఆండ్రాయిడ్ పై ఆధారంగా మ్యాజిక్ UI 2.0 ను బూట్ చేస్తుంది.ఇది 8-అంగుళాల ఫుల్-హెచ్‌డి (1920x1200 పిక్సెల్స్) డిస్ప్లేతో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఇది అంతర్గత కిరిన్ 710 SoC టికింగ్‌తో పాటు 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.మెమొరీని మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు మరింత విస్తరించవచ్చు.
హానర్ ప్యాడ్ 5 యొక్క 8-అంగుళాల వేరియంట్ ముందు మరియు వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇది డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది మరియు మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం అంతర్నిర్మిత స్మార్ట్ PAను కలిగి ఉంది.

హానర్ ప్యాడ్ 5 (10.1-అంగుళాల) స్పెసిఫికేషన్స్:
హానర్ ప్యాడ్ 5 యొక్క 10-1-అంగుళాల మోడల్ ఆండ్రాయిడ్ ఓరియో ఆధారంగా EMUI 8.0తో రన్ అవుతుంది.ఈ టాబ్లెట్ 10.1-అంగుళాల ఫుల్-హెచ్‌డి (1920x1200 పిక్సెల్స్) డిస్ప్లేతో జత చేయబడి ఉంటుంది మరియు కిరిన్ 659 SoC నుండి శక్తిని తీసుకుంటుంది.ఇది 4GB ర్యామ్ తో ప్యాక్ చేయబడి ఉంటుంది.
కెమెరాల విషయానికొస్తే హానర్ ప్యాడ్ 5 యొక్క 10.1-అంగుళాల వెర్షన్ వెనుక వైపు 8-మెగాపిక్సెల్ ఆటో-ఫోకస్ కెమెరా మరియు ముందు వైపు 2-మెగాపిక్సెల్ ఫిక్స్‌డ్-ఫోకస్ సెల్ఫీ స్నాపర్ కెమెరాను కలిగి ఉంది. హానర్ ప్యాడ్ 5 యొక్క పెద్ద స్క్రీన్ వేరియంట్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది.మెమరీని మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరింపచేయవచ్చు. ఇది హర్మాన్ కార్డాన్ ట్యూన్ చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది మరియు వేలిముద్ర సెన్సార్‌తో కూడా వస్తుంది.


Click it and Unblock the Notifications








