Home
News

అద్భుతమైన ఆఫర్లతో మొదలైన రెడ్‌మి నోట్ 7 ప్రో 6GB +64GB సేల్స్

రెడ్‌మి నోట్ 7 ప్రో ఈరోజు నుంచి భారతదేశంలో విక్రయించబడుతోంది.ఈ ఫోన్ యొక్క అమ్మకాలు Mi.com మరియు ఫ్లిప్‌కార్ట్ లో మధ్యాహ్నం 12 గంటల IST నుండి ప్రారంభం కానుంది. రెడ్‌మి నోట్ 7 ప్రో భారతదేశంలో బకెట్‌లోడ్ ద్వారా అమ్ముడవుతోంది. కాబట్టి మీరు అమ్మకం ప్రారంభమైన వెంటనే ఫ్లిప్‌కార్ట్ మరియు Mi.com నుండి ఒకదాన్ని స్నాగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

redmi note 7 pro sale 6gb 64gb flipkart mi com price in india specifications

రెడ్‌మి నోట్ 7 ప్రో యొక్క కీ సెల్లింగ్ పాయింట్ ఫోన్ యొక్క 48 మెగాపిక్సెల్ వెనుక కెమెరా సామర్థ్యం గల స్నాప్‌డ్రాగన్ 675 SoC. షియోమి మళ్ళీ రెడ్‌మి నోట్ 7 యొక్క కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.అది 6GB ర్యామ్ మరియు 64GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో 15,999రూపాయల ధర వద్ద విడుదల చేసింది. భారతదేశంలో ఈ మొబైల్ యొక్క ధర, అమ్మకపు సమయం, అమ్మకపు ఆఫర్లు మరియు లక్షణాలు వంటి మరిన్ని వివరాల కోసం కింద చదవండి.

రెడ్‌మి నోట్ 7 ప్రో ధర:

రెడ్‌మి నోట్ 7 ప్రో ధర:

వినియోగదారులు ఇప్పుడు షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రోను 4GB + 64GB, 6GB+ 64GB మరియు 6GB + 128GB వంటి మూడు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. 4 GB+ 64 GBమోడల్ ధర 13,999రూపాయలు, 6 GB+ 64 GBవేరియంట్ ధర15,999రూపాయలు, మరియు ప్రీమియం 6 GB+ 128 GB వేరియంట్ ఆప్షన్ ధర 16,999రూపాయలు. ఇప్పుడు రెడ్‌మి నోట్ 7 ప్రో యొక్క లో-ఎండ్ మరియు హై-ఎండ్ మోడల్స్ దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్,Mi.com,Mi హోమ్,Mi ప్రిఫరెడ్ పార్టనర్ మరియు Mi స్టూడియో స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. కొత్తగా లాంచ్ చేసిన 6GB + 64GB వేరియంట్ ఆన్‌లైన్ పోర్టల్స్- Mi.com మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది.

ఆఫర్స్:

ఆఫర్స్:

రెడ్‌మి నోట్ 7 ప్రోలో అమ్మకపు ఆఫర్‌లలో జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. ఇది 198రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ విలువైన అన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై డబుల్ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.ఇదే కాకుండా ఎయిర్‌టెల్ డబుల్ డేటా ఆఫర్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు 1,120GB డేటా వరకు ఎయిర్‌టెల్ కస్టమర్లు అందుకుంటారు.Mi ఎక్స్ఛేంజ్ ప్లాన్ మరియు 3 నెలల నో-కాస్ట్ EMI తో Zest money కూడా Mi.com స్టోర్ లో అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

* స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 6.3-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డాట్ నాచ్ ఎల్‌టిపిఎస్ ఇన్-సెల్ డిస్ప్లే ఉంది. రెడ్‌మి నోట్ 7 ప్రో క్వాల్‌కామ్ నుండి సరికొత్త స్నాప్‌డ్రాగన్ 675 SoC చేత రన్ అవుతుంది.

* ఆప్టిక్స్ విభాగంలో ఫోన్ వెనుక భాగంలో 48 MP సోనీ IMX586 సెన్సార్ మరియు 5 MP సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.

* 3.5mm హెడ్‌ఫోన్ జాక్, టైప్-C పోర్ట్, IR బ్లాస్టర్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ముందు మరియు వెనుక భాగంలో ఉన్నాయి. అలాగే మొదటిసారి రెడ్‌మి సిరీస్ నుండి వచ్చిన యుఎస్‌బి-సి పోర్ట్ కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఉంది.

* ఫోన్ 4,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది మునుపటి కంటే 20 శాతం ఎక్కువ స్టాండ్బై సమయాన్ని అందిస్తుంది మరియు ఇది క్వాల్కమ్ యొక్క క్విక్ ఛార్జ్ 4 కి మద్దతు ఇస్తుంది.

 

More from GizBot

Best Mobiles in India

English summary
redmi note 7 pro sale 6gb 64gb flipkart mi com price in india specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X