‘సెకండ్ హాఫ్’ దద్దరిల్లాల్సిందే!

Posted By:

అప్పుడే ఏడాదిలో సగం గడిచిపోయింది. 2015కుగాను టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకోవల్సిన అనేక ఆవిష్కరణలు ఇంకా మిగిలే ఉన్నాయి. యాపిల్, గూగుల్, సామ్‌సంగ్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ హాలీడే సీజన్‌ను పురస్కరించుకుని తమ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులను ప్రపంచానికి పరియం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటి పై భారీ అంచనాలే నెలకున్నాయి. రానున్న నెలల్లో మార్కెట్లో విడుదల  కాబోతోన్న 10 ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

Read More: సాఫ్ట్‌వేర్ అడ్డా బెంగళూరుకు మరో గుర్తింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరలో మార్కెట్లోకి

వన్ ప్లస్ 2 (విడుదల జూలై 27)

శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను అత్యంత చవక ధరల్లో అందిస్తోన్న బ్రాండ్‌లలో వన్‌ప్లస్ వన్ ఒకటి. ఈ బ్రాండ్ నుంచి జూలై 27న ప్రపంచానికి పరియం కాబోతున్న ఫోన్ వన్ ప్లస్ 2. ఈ ఫోన్ పై ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 

త్వరలో మార్కెట్లోకి

విండోస్ 10

విండోస్ 8కు సక్సెసర్ వర్షన్‌గా మైక్రోసాప్ట్ ప్రతిష్టాత్మకంగా అభివృద్థి చేసిన ఓఎస్ విండోస్ 10. ఈ యూజర్ ఫ్రెండ్లీ ఓఎస్ జూలై 29 నుంచి మార్కెట్లో లభ్యంకానుంది.

 

త్వరలో మార్కెట్లోకి

ఐఫోన్ 6ఎస్

ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు సక్సెసర్ వర్షన్‌గా యాపిల్ అభివృద్థి చేస్తోన్న ఐఫోన్ 6ఎస్ సెప్టెంబర్‌లో ప్రపంచానికి పరిచయం కాబోతోంది.

 

త్వరలో మార్కెట్లోకి

ఐఓఎస్ 9

ఐఓఎస్ 8 ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌కు సక్సెసర్ వర్షన్‌గా యాపిల్ అభివృద్థి చేస్తోన్న ఐఓఎస్ 9 ఓఎస్ ఈ ఏడాదిలోనే ప్రపంచానికి పరిచయం కానుంది.

 

త్వరలో మార్కెట్లోకి

గెలాక్సీ నోట్ 5, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్

సామ్‌సంగ్ తన గెలాక్సీ నోట్ 5, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను యాపిల్‌కు పోటీగా ఈ సెప్టెంబర్‌లోనే ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.

 

త్వరలో మార్కెట్లోకి

మోటో ఎక్స్ (జనరేషన్ 3)

మోటో ఎక్స్ సెకండ్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్సన్‌గా మోటరోలా అభివృద్థి చేస్తున్న తరువాతి వర్షన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఈ సెప్టెంబర్‌లోనే ప్రపంచానికి పరిచయమయ్యే అవకాశముంది.

 

త్వరలో మార్కెట్లోకి

రెండు సరికొత్త నెక్సుస్ స్మార్ట్‌ఫోన్‌లను గూగుల్ ఈ అక్టోబర్‌లో ఆవిష్కరించే అవకాశం.

త్వరలో మార్కెట్లోకి

ఆండ్రాయిడ్ ఎమ్

ఆండ్రాయిడ్ ఎమ్ (లేదా ఆండ్రాయిడ్ 6.0) పేరుతో గూగుల్ అభివృద్థి చేసిన కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను ఈ సీజన్‌లోనే అందుబాటులోకి రాబోతోంది.

 

త్వరలో మార్కెట్లోకి

యాపిల్ మొట్టమొదటి పెద్ద స్ర్కీన్ ఐప్యాడ్, అక్టోబర్‌లో ప్రపంచానికి పరిచయమయ్యే అవకాశం.

త్వరలో మార్కెట్లోకి

హెచ్‌టీసీ వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్ ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hottest Gadgets Set To Launch In 2015. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot