రూ. 5 వేల కోసం అడుక్కున్నా, నేను చేసిన పెద్ద తప్పు అక్కడ అడుగుపెట్టడమే : ఎయిర్‌టెల్ అధినేత

దేశీయ టెలికాం రంగంలో అందనత్తు ఎత్తులో దూసుకుపోతున్న భారతి ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్ తన జీవితంలో జరిగిన అనేక అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

By Hazarath
|

దేశీయ టెలికాం రంగంలో అందనత్తు ఎత్తులో దూసుకుపోతున్న భారతి ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్ తన జీవితంలో జరిగిన అనేక అనుభవాలను అందరితో షేర్ చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన టైకాన్‌ సదస్సులో మాట్లాడుతూ ఆయన తన వ్యాపార ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను, ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. జీవితం ఎన్నో కష్టాలు ఉంటాయని వాటిని ఎదుర్కుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఆయన మాటల్లోని ముఖ్యమైన విషయాలు పరిశీలిస్తే..

 

ఫేస్‌బుక్‌లోకి కొత్త ఫీచర్, అన్‌ఫ్రెండ్ చేయలేని వారికి ఉపశమనంఫేస్‌బుక్‌లోకి కొత్త ఫీచర్, అన్‌ఫ్రెండ్ చేయలేని వారికి ఉపశమనం

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు..

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు..

ఒకానొక సమయంలో తన వద్ద డబ్బే ఉండేది కాదంటూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ఒకానొక సమయంలో రూ.5000 కోసం అభ్యర్థించే దీన స్థితిలోకి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.

రూ.5000 కోసం

రూ.5000 కోసం

రూ.5000 కోసం బ్రిజ్‌మోహన్‌ లాల్‌ ముంజల్‌ ను ఆశ్రయించానని, అంకుల్‌ నాకు రూ.5000 కావాలి'' అని కోరానని, ఆయన తన ఇన్‌వాయిస్‌లు తీసుకుని, అవసరమైన మొత్తాన్ని ఇచ్చారని ఈ సంధర్భంగా పేర్కొన్నారు.

ఇదే అలవాటుగా మార్చుకోకు..
 

ఇదే అలవాటుగా మార్చుకోకు..

ఆ డబ్బులు ఇస్తూ ఆయన అన్న మాటలు ఇప్పుటికి నా చెవుల్లో రింగవుతున్నాయని తెలిపారు. వెళ్లి పోయే సమయంలో తనని ఆపిన బ్రిజ్‌మోహన్‌...ఇదే అలవాటుగా మార్చుకోకు అంటూ గట్టి సలహా ఇచ్చారని, ఈ మాటలు తన హృదయాన్ని తాకాయని తెలిపారు.

ఆఫ్రికాలో అడుగుపెట్టి..

ఆఫ్రికాలో అడుగుపెట్టి..

తన వ్యాపార ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కుని ఇలా మీ ముందు ఉన్నానని చెబుతూ ఆఫ్రికాలో అడుగుపెట్టి పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

వ్యాపారాన్ని దారిలో పెట్టేందుకు కొన్ని..

వ్యాపారాన్ని దారిలో పెట్టేందుకు కొన్ని..

ఆఫ్రికాలో అడుగుపెట్టాలన్నది కొంత తొందరపాటు నిర్ణయమేననీ, దీనివల్ల వ్యాపారాన్ని దారిలో పెట్టేందుకు కొన్ని సంవత్సరాల పాటు తాను భారీ స్థాయిలో నిధులను తన వ్యక్తిగత సమయాన్నీ ఖర్చుచేయాల్సి వచ్చిందని సునిల్‌ మిట్టల్‌ చెప్పారు.

తప్పు చేయడం మానవ సహజం

తప్పు చేయడం మానవ సహజం

తప్పు చేయడం మానవ సహజం. అందరూ చేస్తూనే ఉంటారు. వెనుదిరిగి చూసుకుంటే, అప్పుడలా చేసి ఉండాల్సి కాదు.. మరింత ఆలోచించి ఉంటే బాగుండేది.. అనిపించే సందర్భాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి'' అని మిట్టల్‌ చెప్పారు.

రూ.7000 కోట్లను విరాళంగా ..

రూ.7000 కోట్లను విరాళంగా ..

కాగా సునీల్ మిట్టల్ ఇటీవలే రూ.7000 కోట్లను విరాళంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. సైకిల్‌ విడిభాగాల వ్యాపారాలకు ఓనర్‌గా ఉండే సునిల్‌ మిట్టల్‌, ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌తో టెలికమ్యూనికేషన్‌ ప్రపంచాన్నే మార్చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఉచిత విద్య కోసం Airtel రూ. 7 వేల కోట్లు విరాళం

ఉచిత విద్య కోసం Airtel రూ. 7 వేల కోట్లు విరాళం

ఉచిత విద్య కోసం Airtel రూ. 7 వేల కోట్లు విరాళం మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..

Best Mobiles in India

English summary
How Bharti Airtel's Sunil Mittal was once in financial crisis for the want of Rs 5000 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X