అప్పటి నుంచి ఇప్పటి వరకు మెసేజింగ్ ఏలా విస్తరించిందంటే..?

Posted By:

సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) దాదాపు 23 సంవత్సరాలు చరిత్రను సొంతం చేసుకుంది. కమ్యూనికేషన్ బంధాలను మరింత చేరవ చేసిన ఎస్ఎంఎస్‌1992, డిసెండర్ 3న ఆవిర్భవించింది. 22 ఏళ్ల బ్రిటీషు ఇంజనీర్ నీల్‌పాప్ వర్త్ మొట్టమొదటిసారిగా 'మేరీ కిస్మస్' అంటూ సంక్షిప్త సందేశం పంపారు. వోడాఫోన్ యూకే నెట్‌వర్క్ నుంచి ఆర్బిటెల్ 901 మొబైల్‌కు ఆయనీ ఎస్ఎంఎస్ చేశారు. అయితే ఇది జరగడానికి 8 ఏళ్ల ముందే జరిగిన టెలికమ్యూనికేషన్ కాన్పెరెన్స్‌లో ఫిన్‌లాండ్ ప్రభుత్వాధికారి మాటి మాకోనెన్ పొట్టి సందేశం గురించి ప్రస్తావించారు. వాణిజ్య ఎస్ఎంఎస్ సేవలను స్వీడన్ 1993లో ప్రారంభించింది.

(ఇంకా చదవండి: విండోస్ 10 గురించి మైక్రోసాఫ్ట్ చెప్పిన వాస్తవాలు)

సంక్షిప్త సందేశాలు పంపుకునేందుకు అనువైన సెల్‌ఫోన్లు మొదటగా నోకియా కంపెనీ తయారుచేసింది. 1994లో ఎస్సెమ్మెస్ ఎనబిల్డ్ నోకియా 2110 జీఎస్ఎమ్ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్ల వాడకం అనుహ్యంగా పెరగడంతో ఎస్ఎంఎస్‌ల హవా మొదలయింది. సామాజిక సంబంధాల వెబ్‌సైట్లు లాంటి ఇన్‌స్టంట్ సమాచార వేదికలు అందుబాటులోకి రావటంతో ఎస్ఎంఎస్‌లకు ఆదరణ కొరవడింది. నాటి కంప్యూటర్ల యుగం నుంచి నేటి స్మార్ట్‌ఫోన్‌ల కాలం వరకు మెసేజింగ్ విస్తరించిన తీరును క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి కంప్యూటర్ ఆధారిత మెసేజింగ్ సిస్టంను 1962లో ఎంఐటీ సంస్థ ప్రారంభించింది. 

మోటరోలాకు చెందని మార్టీన్ కూపర్ 1972లో సెల్‌ఫోన్ ద్వారా మొదటి కాల్ చేసారు. మెసేజింగ్ కమ్యూనికేషన్ విభాగంలో ఇదోక విప్లవాత్మక ఘట్టం 

మొదటి కంప్యూటర్ బులిటెన్ బోర్డ్ సిస్టం (1973)

వరల్డ్ వైడ్ వెబ్ 1990లో అందుబాటులోకి వచ్చింది. 

ఎస్ఎంఎస్‌ 1992, డిసెండర్ 3న ఆవిర్భవించింది.

 

యాహూ మెసెంజర్ 1998లో విడుదలయ్యింది.

ఎంఎస్ఎన్ మెసెంజర్ 1999లో అందుబాటులోకి వచ్చింది. 

ఎంఎంఎస్ ఫోటో షేరింగ్ 2002లో అందుబాటులోకి వచ్చింది. 

ఐచాట్‌ను ఆగష్ట్ 2002లో విడుదల చేసారు. 

2003లో స్కైప్ అందుబాటులోకి వచ్చింది.

2005లో బ్లాక్‌బెర్రీ మెసెంజర్ అందుబాటులోకి వచ్చింది. 

2005లో గూగుల్ చాట్ వెలుగులోకి వచ్చింది. 

2009లో వాట్సాప్ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అందుబాటులోకి వచ్చేసింది.

ఆగష్ట్ 2011లో ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్‌ను ఆవిష్కరించింది. 

2012లో స్నాప్‌చాట్ అరంగ్రేటం చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How Messaging Has Grown In The Computer Age.Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot