మార్స్ పైకి లేఖ: రూ. 12 లక్షలు ఖర్చు

Written By:

మీరు భవిష్యత్ లో వ్యోమగామి కావాలని కలలు కంటున్నారా. ఇందుకోసం మీరు అరుణగ్రహానికి లేఖ రాయాలనుకుంటున్నారా..అయితే దానికి చాలా ఖర్చు అవుతుంది .ఆ ఖర్చుతో మీరు డైరెక్ట్ గా అరుణగ్రహం మీదకి వెళ్లిరావచ్చు. పాపం ఓ బాలుడు ఇలా అరుణ గ్రహం మీదకు వెళ్లాలని రాయల్ మెయిల్ కు లేఖ రాస్తే ఆ బాలుడుకి దిమ్మతిరిగినంత పనయింది. నాసా చెప్పిన వివరాలతో ఆ బాలుడు అరుణగ్రహం మీదకు వెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న పనంటూ చమత్కారాలతో లేఖ రాశాడు. ఆ కథేంటో చూద్ధాం ఓ సారి.

Read more: గూగుల్ మ్యాప్‌‌కు చిక్కని రహస్య ప్రదేశాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భవిష్యత్తులో వ్యోమగామి కావాలనుకుంటున్న ఈ చిన్నారి

ఐదేళ్ల చిన్నారి అలివర్ గిడ్డింగ్స్ కి ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. భవిష్యత్తులో వ్యోమగామి కావాలనుకుంటున్న ఈ చిన్నారి అరుణగ్రహానికి ఓ లేఖ రాయాలని నిర్ణయించుకున్నాడు.

అరుణుడికి లేఖ రాయాలంటే ఎలా?

కానీ అక్కడెక్కడో భూమికి ఆమడ దూరంలో ఉన్న అరుణుడికి లేఖ రాయాలంటే ఎలా? లేఖను అక్కడికి పంపేందుకు ఎంత ఖర్చు అవుతుంది? ఇదే విషయాన్ని తెలుసుకోవాలని ఆ బాలుడు బ్రిటన్‌కు చెందిన 'రాయల్‌ మెయిల్‌'కు లేఖ రాశాడు.

అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' సహాయం

కానీ ఆ సంస్థకు కూడా ఈ విషయం తెలియదు. అందుకే వారు అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' సహాయం కోరారు. మొత్తానికి అరుణ గ్రహానికి లేఖను పంపాలంటే అక్షరాలా 23,860ల డాలర్లు (రూ. 15.90 లక్షలు) ఖర్చు అవుతుందని తేల్చారు.

ఇంత భారీ వ్యయమా?

ఇంత భారీ వ్యయమా? అని ఆశ్చర్యపోకండి. ఈ ఖర్చు ఎలా అవుతుందో కూడా 'రాయల్‌ మెయిల్‌' వివరించింది. 'ప్రస్తుతం ఇంధన ధరలు బాగా పెరిగిపోయాయి. ఆ ప్రభావం ఇతర గ్రహాలకు పంపే లేఖలపై కూడా పడుతుంది.

కూరియాసిటీ రోవర్‌ కోసం దాదాపు రూ. 700 మిలియన్ అమెరికన్ డాలర్లు

నాసా గతంలో అరుణ గ్రహానికి పంపిన కూరియాసిటీ రోవర్‌ కోసం దాదాపు రూ. 700 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసింది. ఈ వ్యోమనౌక చాలా చిన్నది. కాబట్టి ఇందులోని ప్రదేశం చాలా విలువైందని చెప్పవచ్చు.

వ్యోమనౌక బరువును బట్టి..

వ్యోమనౌక బరువును బట్టి.. అరుణగ్రహానికి అది చేరుకోవడానికి అయ్యే ఖర్చును లెక్కిస్తారు. వంద గ్రాములకు పైగా బరువున్న వస్తువును ఆ గ్రహానికి పంపాలంటే దాదాపు 18వేల డాలర్ల ఖర్చు అవుతుంది' అని రాయల్‌ మెయిల్‌ చిన్నారి అలివర్‌కు రాసిన ప్రత్యుత్తరంలో వివరించింది.

ఫస్ట్‌ క్లాస్‌ రాయల్ స్టాంపులు అన్ని కలుపుకొని

ఫస్ట్‌ క్లాస్‌ రాయల్ స్టాంపులు అన్ని కలుపుకొని ఈ లేఖ కోసం దాదాపు 24 వేల డాలర్ల ఖర్చు అవుతుందని తెలిపింది.

రాయల్‌ మెయిల్‌' తనకు సమాధానం తెలిపినందుకు

వాయవ్య ఇంగ్లండ్‌లోని లిథమ్‌ సెయింట్ అన్నెస్‌లో ఉండే అలివర్‌ ఈ లేఖతో నిరాశ చెంది ఉంటాడు. అయినప్పటీ 'రాయల్‌ మెయిల్‌' తనకు సమాధానం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో లేఖ రాశాడు.

లేఖ రాయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని

అరుణ గ్రహానికి లేఖ రాయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి చాలా స్టాంపులు అవసరమవుతాయి' అంటూ చమత్కరించాడు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write How much does it cost to send a letter to Mars? Wannabe astronaut, five, told it would be nearly £12,000 to send his note with Royal Mail
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot