ట్రంప్ గెలుపుతో ఐటీ గుండెల్లో రైళ్లు, సిలికాన్‌వ్యాలీ అలజడి

Written By:

గత కొంత కాలం నుంచి అమెరికాలో ఆసక్తికర అంశంగా మారి అందర్నీ పరుగులు పెట్టించిన అంశం ఏదైనా ఉందంటే అది అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశమే.ఇక గెలిచేవారిపైన చాలామంది భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా ట్రంప్ గెలిస్తే ఐటీ పరిశ్రమ గడ్డు కాలం ఎదుర్కుటుందని చాలామంది ముందు నుంచి అనుకుంటూ వస్తున్నారు. వారి అనుకున్నదే నిజమైంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. మరి ఐటీకి దీనికి ఉన్న లింకేంటో మీరే చూడండి.

Rip రూ. 500, సోషల్ మీడియాని వణికిస్తున్న జోకులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు

భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లన్నీ ట్రంప్ గెలుస్తాడనీ అసలు ఊహించకపోవడంతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మార్కెట్లు కుదేలవుతున్నాయి. 

విదేశీ వాణిజ్య ఒప్పందాలను

ఎన్నికలకు ముందు నుంచి గత ప్రభుత్వాలు తీసుకున్న అన్ని విదేశీ వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షిస్తానని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తుడటంతో, భారత్‌తో ఉన్న ట్రేడ్ డీల్స్‌పై కూడా ఈ ప్రభావం పడనుందని తెలుస్తోంది.

నష్టాల్లో ఉన్న భారత ఐటీ ఇండస్ట్రి

ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో హెచ్ 1 బీ వీసా ప్రొగ్రామ్‌ను ట్రంప్ ఎక్కువగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. నేను అధికారంలోకి వస్తే ఈ ప్రొగ్రామ్‌ను నిలిపివేస్తానని అమెరికన్లకు హామీ ఇచ్చారు. ఇది నిలిచిపోతే ఇప్పటికే నష్టాల్లో ఉన్న భారత ఐటీ ఇండస్ట్రి ఇంకా భారీగా నష్టపోనుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు

టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ట్రంప్ పాలసీలకు మొదటి బాధితులుగా మిగలనున్నాయి. కోట్ల నష్టాలను మూటగట్టుకోనున్నాయి. 

అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు

ముఖ్యంగా చెప్పాలంటే ట్రంప్ ప్రచారం చాలావరకు అమెరికన్ ప్రజలు కోల్పోతున్న ఉద్యోగాల దిశగానే సాగింది. అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు, చైనీస్, సింగపూర్ వాసులు తన్నుకు పోతున్నారని, వాటిని అరికడతామని చేసిన హెచ్చరికలు టెక్ పై భారీ ప్రభావాన్నే చూపనున్నాయి. 

సిలికాన్ వ్యాలీలో అలజడి

ఇప్పటికే టెక్నాలజీ హబ్ గా పేరుగాంచిన సిలికాన్ వ్యాలీలో అలజడి మొదలైంది. వారంతా ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ట్విట్టర్ లో ట్వీట్లతో తమ బాధను పంచుకుంటున్నారు.

భారీగా ట్యాక్స్

దీంతో పాటు అమెరికా నుంచి స్వదేశాలకు క్యాష్ తీసుకుని వెళ్లాలనుకునే వారిపైన ఇకపై భారీగా ట్యాక్స్ పడే అవకాశం ఉంది. కార్పోరేట్ కంపెనీలకయితే ఈ ట్యాక్స్ మరింత భారం కానుంది. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న వారికి అలాగే అక్కడ నడుస్తున్న విదేశీకంపెనీలకు ఈ పన్నుల భారం భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఆపిల్, మైక్రోసాప్ట్, గూగుల్, సిస్కో లాంటి కంపెనీలు

ట్రంప్ గెలుపుతో ఆపిల్, మైక్రోసాప్ట్, గూగుల్, సిస్కో లాంటి కంపెనీలు ఇప్పటికే షాక్ తిన్నాయి. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో నాన్ ఫైనాన్సియల్ కంపెనీలు ఎటువంటి పన్నులు లేకుండా 1.77 trillion డాలర్ల వ్యాపారాన్ని నడుపుతున్నాయని మూడీ రిపోర్ట్ తెలిపింది.

గుండెల్లో రైళ్లు

ఇప్పుడు అంత డబ్బును అక్కడి నుంచి స్వదేశానికి తరలించాలంటే దాదాపు 39 శాతం పైనే పన్నులు కట్టాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ ఈ విషయంపై మీరు ఒకసారి తీసుకువెళితే 10 శాతం కట్టాల్సి ఉంటుందని చెప్పడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ట్రంప్ గెలుపు

మొత్తానికి ట్రంప్ గెలుపు అక్కడ సాప్ట్ వేర్ పరిశ్రమపై భారీ ప్రభావాన్నే చూపబోతుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది ముందు ముందు చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How a President Trump Would Disrupt Tech AAPL, MSFT read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot