Home
News

ఇలా ప్రయత్నం చేస్తే AC వినియోగిస్తున్నా విద్యుత్ ఛార్జీలు తక్కువగానే వస్తాయి..!

గత కొన్ని సంవత్సరాలుగా ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ, నగర ప్రాంతాల్లో వేసవి సమయాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అందువల్ల అనేక మంది ప్రజలు ఎయిర్‌ కండిషనర్‌లు వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఫలితంగా విద్యుత్ ఛార్జీలు గతం కంటే అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పూర్తి అవగాహన లేకుండా AC లు వినియోగిస్తే విద్యుత్‌ ఛార్జీల మోత మోగిపోయే అవకాశం ఉంది.

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించుకొనేదెలా :
ఎయిర్‌ కండిషనర్‌ల (AC) వినియోగం సమయంలో కొన్ని జాగ్రతలు, చిట్కాలు పాటిస్తే.. విద్యుత్‌ ఛార్జీలను ఆదా చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో AC ల వినియోగంపై యూజర్లు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏసీ వినియోగిస్తున్నా.. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించుకొనేందుకు అనేక మార్గాలున్నాయి.

how to control power consumption of an Air Conditioner

సర్వీసింగ్ :
వేసవి కాలం ప్రారంభానికి ముందే ఎయిర్‌ కండిషనర్‌లను (Air Conditioner) సర్వీసింగ్ చేయించుకోవాలి. కొనుగోలు చేసే సమయంలో సర్వీస్‌ సపోర్టు కలిగిన బ్రాండ్‌లను ఎంచుకొనే అవకాశం కూడా ఉంటుంది. లేకుంటే నిపుణుల ద్వారా సర్వీసింగ్ చేయించి, వినియోగించుకోవడం ఉత్తమం. ఫలితంగా తక్కువ విద్యుత్‌తో మెరుగైన పనితీరును అందిస్తుంది.

ఏసీ ఫిల్టర్‌ :
ఎయిర్‌ కండిషనర్‌ల ఫిల్టర్‌లో ఏమైనా సమస్యలు ఉంటే సక్రమంగా పనిచేసేందుకు ఎక్కువ విద్యుత్‌ అవసరం కానుంది. అందువల్ల క్రమం తప్పకుండా ఏసీ ఫిల్టర్‌లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. లేకుండా ఆయా ప్రాంతాల్లో దుమ్ము చేరి ఏసీ పనితీరుపై ప్రభావం చూపుతుంది.

స్టార్‌ రేటింగ్‌ :
ఎయిర్‌ కండిషనర్‌లు కొనుగోలు చేసే సమయంలోనే తక్కువ విద్యుత్‌తో మెరుగైన పనితీరు కనబరిచే బ్రాండ్‌లను ఎంచుకోవాలి. ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటే, AC లో ఏమైనా సమస్యలు ఉంటే రిపేర్ చేయించాల్సి ఉంటుంది. సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం కొత్త AC కొనుగోలు చేయడం ఉత్తమం.

పూర్తిగా మూసివేయాలి :
ఇళ్లు లేదా కార్యాలయాల్లో ఏసీ వినియోగిస్తున్న సమయంలో అన్ని కిటీకీలు, తలుపులు మూసివేయాలి. ఫలితంగా గది ఉష్ణోగ్రత వేగంగా తగ్గేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు గది నుంచి గాలి బయటకు వెళ్లేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను పూర్తిగా మూసివేయాలి. గదిలోని చల్లని గాలి బయటకు వెళ్తుంటే.. గదిని చల్లగా ఉంచేందుకు AC కి ఎక్కువ విద్యుత్‌ అవసరం అవుతుంది.

ఈ అలవాటు ఉంటే కష్టం :
కొంత మందికి AC ను రోజంతా వినియోగించే అలవాటు ఉంటుంది. అలా చేయడం కారణంగా ఎయిర్ కండిషనర్‌ వేగంగా మరమ్మతులకు గురయ్యే అవకాశం ఉంది. మరియు అధికంగా విద్యుత్ ఛార్జీలు వస్తాయి. గది చల్లగా అయ్యాక ఏసీని ఆఫ్‌ చేయడం ఉత్తమం. లేకుంటే టైమర్‌ ఏర్పాటు చేసి ఆఫ్‌ అయ్యేలా చూడాలి.

ఫ్యాన్ :
గదిలో AC ఒకే ప్రదేశానికి పరిమితం కాకుండా గది మొత్తం వ్యాపించేలా చిన్న ఫ్యాన్‌ను ఉపయోగించవచ్చు. దీని వల్ల చల్లని గాలి గది మొత్తం త్వరగా వ్యాపిస్తుంది. గది చల్లగా మారిన తర్వాత AC ను ఆఫ్‌ చేసుకోవాలి. ఫలితంగా విద్యుత్‌ ఆదా కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
how to control power consumption of an Air Conditioner here is the guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X