Home
News

టెలిగ్రామ్‌లో చాటింగ్ డేటాను సురక్షితంగా ఉంచడం ఎలా?

త్వరిత మెసెజింగ్ యాప్ వాట్సాప్ గత నెలలో ప్రైవసీ విధానాన్ని తీసుకురావడంతో చాలా మంది వినియోగదారులు సిగ్నల్ మరియు టెలిగ్రామ్ వంటి చాటింగ్ మరియు టెక్స్టింగ్ యాప్ లకు మారారు. ఇందులో ముఖ్యంగా పాత టెక్స్టింగ్ యాప్ టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎక్కువ మంది చేరడం గొప్ప విషయం. ఎన్నడూ లేని విధంగా అధిక మంది వినియోగదారులను కలిగి ఉన్న యాప్ లలో మొదటి స్థానాన్ని కలిగి ఉంది.

టెలిగ్రామ్

టెలిగ్రామ్ యాప్ తన ప్లాట్‌ఫామ్‌లో టెక్స్టింగ్ కోసం కొన్ని గొప్ప ఇంటరాక్టివ్ ఫీచర్లను కలిగి ఉంది. ఇది వినియోగదారులు ఒకరితో ఒకరు సంభాషించుకునే విధానాన్ని మెరుగుపరుస్తుంది. టెలిగ్రామ్‌లో మీ యొక్క చాటింగ్ ను సురక్షితంగా ఉంచుకోవడానికి ఫింగర్ ప్రింట్ లేదా పాస్‌కోడ్‌తో గోప్యత మరియు భద్రతను మరింత మెరుగుపరచుకోవచ్చు. టెలిగ్రామ్‌లోని చాట్‌లను ఎలా సురక్షితంగా ఉంచాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టెలిగ్రామ్‌లో పాస్‌కోడ్‌ను సెట్ చేసే విధానం

టెలిగ్రామ్‌లో పాస్‌కోడ్‌ను సెట్ చేసే విధానం

** మొదట టెలిగ్రామ్‌ అప్లికేషన్ ను ఓపెన్ చేయండి.

** తరువాత ఎడమ వైపు ఎగువ భాగంలో గల మూడు-చుక్కల మెను మీద క్లిక్ చేయండి.

** ఆ తరువాత ‘సెట్టింగ్‌లు' మెనూను ఎంచుకుని అందులో ‘ప్రైవసీ మరియు సెక్యూరిటీ' ఎంపికను ఎంచుకోండి.

** ‘సెక్యూరిటీ' ఎంపికలో ‘పాస్‌కోడ్ లాక్' మీద నొక్కండి.

** తరువాత ఇందులో నాలుగు అంకెల పాస్‌కోడ్‌ను నమోదు చేయవలసి ఉంటుంది. పాస్‌కోడ్‌ను సేవ్ చేయడానికి రెండుసార్లు నమోదు చేయండి. తరువాత మీ టెలిగ్రామ్ పాస్‌కోడ్ యాక్టీవ్ చేయబడుతుంది.

 

టెలిగ్రామ్‌లో వేలిముద్ర లాక్‌ని సెట్ చేసే విధానం

టెలిగ్రామ్‌లో వేలిముద్ర లాక్‌ని సెట్ చేసే విధానం

మీరు పాస్‌కోడ్‌ను సెటప్ చేసిన తర్వాత మీరు యాప్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా మీ ఫింగర్ ప్రింట్ తో యాప్ ను అన్‌లాక్ చేసే ఎంపికను కూడా మీరు చూస్తారు. మీకు ఇది అవసరం లేకపోతే కనుక దీనిని నిలిపివేయవచ్చు. డివైస్ సెట్టింగుల ఎంపికలో ఫోన్ ను అన్‌లాక్ చేయడానికి మీరు ఫింగర్ ప్రింట్ డేటాను నమోదు చేస్తేనే ఫింగర్ ప్రింట్ ఎంపిక వస్తుందని గమనించండి. ఇది మీ ఫోన్ యొక్క సిస్టమ్‌లోకి ప్రవేశించిన అదే బయోమెట్రిక్ డేటాను మొదటి స్థానంలో ఉపయోగిస్తుంది.

టెలిగ్రామ్‌ ఆటో-లాక్ టైమర్‌

టెలిగ్రామ్‌ ఆటో-లాక్ టైమర్‌

టెలిగ్రామ్‌లో మీ చాట్ డేటా యొక్క మరింత భద్రత కోసం మీరు ‘ఆటో-లాక్' టైమర్‌ను కూడా సెట్ చేయవచ్చు. అప్రమేయంగా టెలిగ్రామ్ 1 గంట తర్వాత యాప్ ను ఆటోమ్యాటిక్ గా లాక్ చేస్తుంది. కానీ ఈ సమయాన్ని మార్చడానికి అప్లికేషన్ యొక్క సెట్టింగుల నుండి ‘ఆటో-లాక్' ఎంపికకు వెళ్లండి. తరువాత మీరు టైమర్‌ను 1 నిమిషం నుండి 1.45 గంటల మధ్య ఎంపికలలో దేనినైనా ఎంచుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ నుండే ఈ ఫీచర్ ను కూడా నిలిపివేయవచ్చు.

Best Mobiles in India

English summary
How to Enable Passcode and Fingerprint Lock on Telegram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X