OLX, Quikrలలో మోసం చేయడానికి మోసగాళ్ళు చేసే ప్రయత్నాలు

|

మీరు మీ పాత రిఫ్రిజిరేటర్ లేదా ఎయిర్ కండీషనర్‌ను లేదా పాత వస్తువులను OLX లేదా Quikr లో విక్రయించాలని ఆలోచిస్తున్నారా?. అయితే మొదటగా డిజిటల్ లావాదేవీల యొక్క అన్ని రకాల వివరాలను మీరు అర్థం చేసుకున్న తరువాత తదుపరి కార్యాచరణను ప్రారంభించండి. ఎందుకంటే మోసగాళ్ళు తరచుగా ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వినియోగదారులను మోసం చేయడానికి లక్ష్యంగా పెట్టుకొని ఉన్నారు.

 
How to Fraudsters are Trying to Cheat on OLX and Quikr

ఈ రెండు యాప్ లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత లావాదేవీలు ఎలా పనిచేస్తాయో మీకు అర్థం చేసుకోలేకపోతే మీరు డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు OLX లేదా Quikr లో వస్తువులను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మోసగాళ్ళు మిమ్మలిని మోసం చేయడానికి మోసగాళ్ళు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోసగాళ్ల ప్రయత్నాలు:

మోసగాళ్ల ప్రయత్నాలు:

మీరు ఈ ప్లాట్‌ఫామ్‌లలో మీ ప్రకటనను పోస్ట్ చేసిన వెంటనే కస్టమర్‌లుగా నటిస్తు మోసగాళ్ల నుండి ఫోన్ కాల్స్ రావడం మొదలవుతాయి. వారు తరచుగా మీరు పోస్ట్ చేసిన వస్తువు కోసం మీరు నిర్ణయించిన ధరను చెల్లించడానికి సిద్ధంగా కనిపిస్తారు. కొన్నిసార్లు వారు మీరు మొదట కోట్ చేసిన దానికంటే ఎక్కువ చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉండవచ్చు. ఒప్పందం ఫిక్స్ అయిన తర్వాత మోసగాడు డబ్బు పంపుతాడు. వారు సాధారణంగా ఫోన్‌పే, గూగుల్ పే లేదా ఇతర యుపిఐ యాప్‌ల ద్వారా డబ్బు పంపుతామని తెలుపుతారు. మోసగాళ్ళు డబ్బును పంపడానికి రిక్వెస్ట్ చేయమని అడుగుతారు చాలా మంది ప్రజలు ఎక్కువగా ఇక్కడ మోసపోతారు. మోసగాడు డబ్బు బదిలీ చేయడానికి OTP ను పంపమని అడుగుతాడు ఒక వేళ మీరు దానిని పంచుకున్న లేదా SMS ను సరిగ్గా చదవకపోతే వారు మోసగాళ్ళకు బలైపోయే ప్రమాదం ఉంది.

OLX ఇండియా జనరల్ కౌన్సెల్:

OLX ఇండియా జనరల్ కౌన్సెల్:

ఎవరైనా తమకు డబ్బు పంపితే వారికి OTP రాదని ప్రజలు తరచుగా మరచిపోతారు. "మేము వందలాది సెల్‌ఫోన్ నంబర్‌లను గుర్తించాము. అవి మోసగాళ్లవని మేము అనుమానిస్తున్నాము మరియు వారిని నిరోధించాము" అని OLX ఇండియా జనరల్ కౌన్సెల్ లావణ్య చందన్ అన్నారు. OLX మొత్తం జాబితాలలో 25% కూడా తిరస్కరిస్తుంది మరియు ప్రతి నెలా 100,000 అనుమానాస్పద ఖాతాలను నిషేధిస్తుంది.

సైబర్‌ సెక్యూరిటీ వర్క్‌షాప్‌లు:
 

సైబర్‌ సెక్యూరిటీ వర్క్‌షాప్‌లు:

OLX సైబర్ పీస్ ఫౌండేషన్ అనేది ఒక పౌర సమాజ సంస్థ మరియు సైబర్ సెక్యూరిటీ యొక్క థింక్ ట్యాంక్ తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ భాగస్వామ్యంలో సైబర్ పీస్ ఫౌండేషన్ వినియోగదారులతో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. ఈ వర్క్‌షాప్‌లు C2C ప్లాట్‌ఫామ్‌లతో సహా ఇంటర్నెట్‌లో ఎలా సురక్షితంగా ఉండాలనే దానిపై దృష్టి పెడతాయి. మొదటి దశలో భాగంగా OLX మరియు సైబర్ పీస్ కర్ణాటక మరియు హర్యానా రాష్ట్రాల్లో వర్క్‌షాప్‌లను ప్రారంభించాయి. "సైబర్ పీస్ ఫౌండేషన్‌తో మా భాగస్వామ్యంతో ఇంటర్నెట్ యొక్క సురక్షిత వినియోగాన్ని ప్రోత్సహించడంలో మా ప్రయత్నాలను ముమ్మరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ భాగస్వామ్యం ప్రతి ఒక్కరికీ మెరుగైన ఇంటర్నెట్‌ను సృష్టించడంపై దృష్టి సారించి ఈ ప్రాంతంలో మా కార్యక్రమాలకు సహాయపడుతుంది"అని చందన్ అన్నారు.

మోసాల నివారన విషయాలు:

మోసాల నివారన విషయాలు:

OLX, Quikr లేదా మరే ఇతర UPI- సామర్థ్యం గల యాప్ వినియోగదారులు ఈ మొబైల్ అనువర్తనాల్లో చెల్లింపు వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే దాని గురించి పూర్తి అవగాహన తెలుసుకోవాలి. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో స్వీకరించే సందేశాల గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. దీనికి మించి ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత సమాచారాన్ని మరొకరికి ఎటువంటి పరిస్థితులలో ఇవ్వకుండా ఉండాలి.

Best Mobiles in India

English summary
How to Fraudsters are Trying to Cheat on OLX and Quikr

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X