ఐఫోన్ 7 ఉచితం..అయితే చిన్న కండీషన్ !

Written By:

ఐఫోన్ ..ఈ పేరు ఓ సంచలనం. ఈ ఫోన్ సొంతం చేసుకోవడానికి వినియోగదారులు పడరాని పాట్లు పడిన సంధర్భాలు కూడా ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా వచ్చిన ఐఫోన్ 7 కోసం అయితే చాలామంది క్యూలో ఎదురుచూస్తున్నారు కూడా. అయితే అధిక ధర కావడంతో ఏం చేయలేకపోతున్నారు. అయితే ఐఫోన్ 7 కావాలనుకునేవారి కోసం ఉక్రెయిన్ లోని అతి పెద్ద మొబైల్ రీటైల్ వెబ్‌సైట్ ఓ బంఫరాఫర్ ఇచ్చింది. అదేంటో మీరే చూడండి.

రిలీజ్‌కు ముందే దుమ్ము రేపుతున్న షియోమి మి నోట్ 2 ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అల్లో.యూఏ

ఐఫోన్ 7 కోసం వేచిచూస్తున్న వినియోగదారులకు ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద మొబైల్‌ రిటైల్‌ వెబ్‌సైట్‌లో ఒకటైన ‘అల్లో.యూఏ' ఓ శుభవార్త అందించింది.

కొన్ని కండీషన్లు

వేలల్లో డబ్బులు పెట్టి కొనే అవ‌స‌రం లేకుండా ఐఫోన్‌-7ని ఉచితంగా సొంతం చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. అయితే, అలా సొంతం చేసుకోవాలంటే కొన్ని కండీషన్లు పెట్టింది. ఆ కండీషన్లలో మీరు పాసయితే ఐఫోన్7 ఉచితంగా ఇస్తారు.


లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తమ పేరుని ఐఫోన్‌-7గా

ఐఫోన్‌-7 త‌మ క‌స్ట‌మ‌ర్లు ఉచితంగా సొంతం చేసుకోవాలంటే వారు తమ పేరుని ఐఫోన్‌-7గా మార్చుకోవాల‌ని ఓ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిది. ఈ ష‌ర‌తు ప్రకారం వినియోగ‌దారుడు త‌న‌ పేరుకు బదులుగా మొదటి పేరుని ఐఫోన్‌ అని, రెండో పేరుని 7 అని మార్చుకోవాలి.

ధ్రువీకరణ పత్రంతో సెల్ఫీ

ఇందుకోసం పేరు మార్చుకున్న వ్య‌క్తి త‌న‌కు సర్కారు ఆమోదముద్రతో ఇచ్చిన ధ్రువీకరణ పత్రంతో సెల్ఫీ దిగి దాన్ని ‘అల్లో.యూఏ' సంస్థకు పంపాల‌ని పేర్కొంది.

మొదట పంపిన‌ ఐదుగురిని

త‌మ‌కు అలా పేరు మార్చుకొని పంపిన ద‌ర‌ఖాస్తుల్లో మొదట పంపిన‌ ఐదుగురిని విజేతలుగా వెబ్‌సైట్లో ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పింది. వారికి 32 జీబీ మెమరీ ఉండే ఐఫోన్‌-7 ఉచితంగా ఇస్తామ‌ని పేర్కొంది.

అక్టోబర్‌ 17 నుంచి వ‌చ్చే ఏడాది మార్చి 1 వరకు

ఈ ఆఫర్ ను 2016 అక్టోబర్‌ 17 నుంచి వ‌చ్చే ఏడాది మార్చి 1 వరకు అందుబాటులో ఉంచుతున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది.

ఫ్రీగా ఈ ఐఫోన్ 7

అయితే ఫ్రీగా ఈ ఐఫోన్ 7ని పొందాలనుకున్నవారు ముందుగా ఉక్రెయిన్‌లోని స్థానిక రిజిస్ట్రారు కార్యాలయంలో త‌మ‌ పేరుని మార్చుకోవాలని సూచించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Get a Free iPhone 7: Change Your Name to iPhone Seven Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot