Home
News

Jio యొక్క ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఆఫర్‌ను పొందడం ఎలా?

ఇండియాలో జియో సంస్థ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. టెలికామ్ రంగంలో అభివృద్ధిని సాధించిన తరువాత బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి జియోఫైబర్ పేరుతో అడుగుపెట్టిన జియో సంస్థ ప్రజలను ఊహించిన దానికంటే ఎక్కువగా ఆకట్టుకోలేకపోయింది.

జియోఫైబర్ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం

జియోఫైబర్ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం

ఇప్పుడు తన కస్టమర్ యొక్క బేస్ ను పెంచుకోవడానికి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా జియోఫైబర్ తన కస్టమర్లకు ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంను ఉచితంగా అందిస్తున్నట్లు రిలయన్స్ జియో అధికారికంగా ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని సాధారణంగా ఒక సంవత్సర కాలానికి కొనుగోలు చేయడానికి 999 రూపాయలు ఖర్చుచేయవలసి ఉంటుంది. అయితే జియో ఈ ప్రయోజనాన్ని జియోఫైబర్ యొక్క గోల్డ్ ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్ లను వాడుతున్న వినియోగదారులందరికీ అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:Tata Sky Binge+ కొనుగోలుదారులు Rs.2,000 ఆదా చేసే గొప్ప అవకాశం....

అమెజాన్ ప్రైమ్ ఆఫర్‌ను జియో యూజర్లు ఉచితంగా పొందడం ఎలా?

అమెజాన్ ప్రైమ్ ఆఫర్‌ను జియో యూజర్లు ఉచితంగా పొందడం ఎలా?

రిలయన్స్ జియో నుండి వచ్చిన అధికారిక కమ్యూనికేషన్ ప్రకారం గోల్డ్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసే జియోఫైబర్ వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ ఉచిత ఆఫర్‌కు అర్హులు అవుతారు. సిల్వర్ మరియు బ్రోన్జ్ ప్లాన్ లోని వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందడానికి జియోఫైబర్ గోల్డ్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్ ఆఫర్‌ను యాక్టీవ్ చేసే పద్ధతులు

అమెజాన్ ప్రైమ్ ఆఫర్‌ను యాక్టీవ్ చేసే పద్ధతులు

1. వినియోగదారులు జియోఫైబర్ యొక్క గోల్డ్ లేదా అంతకు పైన గల ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవాలి.

2. తరువాత MyJio యాప్ లేదా Jio.com ని ఓపెన్ చేసి మీ యొక్క జియోఫైబర్ అకౌంటుతో లాగిన్ అవ్వండి.

3. లాగిన్ అయిన తరువాత 1-సంవత్సరం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ బ్యానర్‌పై క్లిక్ చేసి తరువాత మీ అమెజాన్ ప్రైమ్ అకౌంటుకు సైన్-ఇన్ చేయండి.


జియోఫైబర్ యొక్క అమెజాన్ ప్రైమ్ ఆఫర్ ను పొందిన వారు ఇప్పుడు ఉచిత ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్, ఉచిత ఫాస్ట్ డెలివరీలతో పాటుగా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం యొక్క అన్ని రకాల ప్రయోజనాలను పూర్తిగా ఆస్వాదించగలుగుతారు.

 

జియో - డిస్నీ + హాట్స్టార్ VIP ఆఫర్

జియో - డిస్నీ + హాట్స్టార్ VIP ఆఫర్

ఇటీవల జియో టెల్కో తన వినియోగదారులకు డిస్నీ + హాట్స్టార్ VIP ఒక సంవత్సరం కాంప్లిమెంటరీ చందాను ప్రకటించింది. ఈ ఆఫర్ ఇప్పుడు జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను పొందడానికి వినియోగదారులు నెలవారీ లేదా వార్షిక డేటా యాడ్-ఆన్ వోచర్‌లను ఎంచుకోవచ్చు. జియో రూ.401, రూ .2,599 విలువైన డేటా యాడ్-ఆన్‌ రీఛార్జ్‌లతో ఈ ప్రత్యేక ఆఫర్ ను అందిస్తున్నది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Get Jio’s Free Amazon Prime Membership Offer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X