Home
News

Tata Sky Binge+ కొనుగోలుదారులు Rs.2,000 ఆదా చేసే గొప్ప అవకాశం....

ఇండియాలోని డిటిహెచ్ రంగంలోని ఆపరేటర్లు తమ వినియోగదారుల యొక్క బేస్ ను పెంచుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటికి పరిమితం కావడంతో ముందు కంటే ఇప్పుడు టీవీ యొక్క వినియోగం పెరిగింది.

టాటా స్కై బింగే + STB

టాటా స్కై బింగే + STB

డిటిహెచ్ ఆపరేటర్లలో అధిక మంది వినియోగదారులను కలిగి ఉన్న టాటా స్కై ఇప్పుడు తన సెట్-టాప్-బాక్స్ లలో ఒకటైన బింగే + STB ను ఆఫర్‌ ధరలో అందిస్తున్నది. అంటే దీనిని ఇప్పుడు కొనుగోలు చేసిన వినియోగదారులు సుమారు రూ.2101 వరకు ఆదా చేయవచ్చు. ఆండ్రాయిడ్ డివైస్ టాటా స్కై బింగే +STB 2020 ప్రారంభంలో రూ.5,999 లాంచ్ ధరతో ప్రవేశపెట్టింది. అయితే మే రెండవ వారంలో బింగే + ఎస్‌టిబి ధరను రూ.3,999 కు తగ్గించింది. లైవ్ టీవీ మరియు OTT కంటెంట్ ను సజావుగా అందించడానికి Binge + STB చందాదారులను అనుమతిస్తుంది. ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బింగే + STB ఆఫర్

టాటా స్కై బింగే + STB ఆఫర్

టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ తన బింగే + STBని వినియోగదారులు ఎంచుకోవడానికి ఆరు వేర్వేరు ప్యాకేజీలతో అందిస్తున్నది. అలాగే యూజర్లు కొత్త కనెక్షన్ ను పొందడంతో ఇప్పుడు రూ.2,101 ఆదా చేయవచ్చు. ఈ ఆరు వేర్వేరు ప్యాకేజీలలో టాటా స్కై యొక్క ఆరు కస్టమ్ ప్యాక్‌లలో హిందీ లైట్, హిందీ బేసిక్, ఫ్యామిలీ కిడ్స్, ఫ్యామిలీ స్పోర్ట్స్, ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ మరియు ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ వంటివి ఉన్నాయి. Also Read:D2h HD STBను కొనాలనుకుంటున్నారా!!! అయితే ఈ ఆఫర్ చూడండి...

టాటా స్కై ప్యాకేజీ ధరలు & ఆఫర్స్

టాటా స్కై ప్యాకేజీ ధరలు & ఆఫర్స్

సాధారణంగా హిందీ లైట్ ప్యాకేజీని రూ .6492 ధర వద్ద అందిస్తుంది. కాకపోతే టాటా స్కై బింగే + ఎస్‌టిబితో పాటు నెలవారీ హిందీ లైట్ ప్యాక్‌ను కేవలం 4391 రూపాయల ధర వద్ద పొందవచ్చు. అదేవిధంగా టాటా స్కై యొక్క హిందీ బేసిక్, ఫ్యామిలీ కిడ్స్, ఫ్యామిలీ స్పోర్ట్స్ ప్యాకేజీల తగ్గింపు ధరలు వరుసగా రూ.4,462, రూ .4,496 మరియు రూ .4,601. ఎయిర్‌టెల్, జియో,వొడాఫోన్ ఐడియా నుంచి షాకింగ్ న్యూస్....

టాటా స్కై బింగే అగ్రశ్రేణి ప్యాకేజీలు

టాటా స్కై బింగే అగ్రశ్రేణి ప్యాకేజీలు

టాటా స్కై బింగే + STB ఆఫర్ కింద అగ్రశ్రేణి ప్యాకేజీలు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ మరియు ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ యొక్క ధరలు వరుసగా రూ.4609 మరియు 4659 రూపాయలు. కొత్త వినియోగదారులు క్యాష్ ఆన్ డెలివరీ ఎంపికను ఎంచుకోవచ్చు లేదా ప్యాకేజీ ధరలను ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి కూడా పొందవచ్చు.

టాటా స్కై లాంగ్ టర్మ్ ప్యాక్ ఆఫర్స్

టాటా స్కై లాంగ్ టర్మ్ ప్యాక్ ఆఫర్స్

టాటా స్కై యొక్క బింగే+ సర్వీసు యొక్క ఆరు నెలల లాంగ్ టర్మ్ రీఛార్జ్ మరియు పైన తెలిపిన ఆరు ప్యాకేజీలలో దేనినైనా సరే ఎంచుకున్న వారికి కొన్ని ఉచిత యాక్సిస్ లను కూడా అందిస్తుంది. ఇందులో భాగంగా టాటా స్కై బింగే సర్వీస్ డిస్నీ+ హాట్‌స్టార్, SUN NEXT, హంగమా ప్లే, ఈరోస్ నౌ మరియు షెమరూమీ యొక్క కంటెంట్‌కి ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. అదనంగా కొత్త బింగే + వినియోగదారులు మూడు నెలలపాటు అమెజాన్ ప్రైమ్ వీడియోకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను ఉచితంగా అందిస్తుంది.

టాటా స్కై బింగే +STB తగ్గింపు ఆఫర్

టాటా స్కై బింగే +STB తగ్గింపు ఆఫర్

టాటా స్కై బింగే + ను ఇప్పుడు వినియోగదారులు రూ.3999 ధర వద్ద స్వతంత్ర ప్రాతిపదికన తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే దీనితో పాటు ఆరు నెలల చందా ప్యాక్ ను ఎంచుకున్న వారికి అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క మూడు నెలల కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను ఉచితంగా అందిస్తుంది. అయితే డిటిహెచ్ ఆపరేటర్ ఇన్‌స్టాలేషన్ ఫీజుగా రూ.350 మరియు కొత్త వినియోగదారుల నుండి యాక్టివేషన్ ఫీజుగా రూ.100 వసూలు చేయబడతాయి.

టాటా స్కై బింగే + ప్యాకేజీ ప్యాక్‌ల ధరలు

టాటా స్కై బింగే + ప్యాకేజీ ప్యాక్‌ల ధరలు

టాటా స్కై బింగే + ప్యాకేజీలో భాగమైన ఆరు వేర్వేరు ప్యాక్‌ల యొక్క ధరలు నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు మరియు టాక్స్‌తో కలుపుకొని వరుసగా బేస్ హిందీ లైట్ ప్యాక్ ధర రూ.298.73, హిందీ బేసిక్ ప్యాక్ ధర నెలకు రూ.343.97, ఫ్యామిలీ కిడ్స్ ప్యాక్ ధర రూ.369.93, ఫ్యామిలీ స్పోర్ట్స్ ప్యాక్ ధర రూ .452.29 మరియు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ ప్యాక్‌ ధర రూ.460.72. అలాగే టాప్-టైర్ ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ ప్యాక్ ధర నెలకు రూ.490.52.

More from GizBot

Best Mobiles in India

English summary
Tata Sky Binge+ STB Now Available Rs.2101 Discount Offer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X