25 ఏళ్ల ఇంటర్నెట్‌కు ఎన్నో రంగులు..

Written By:

ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. నిద్రలేవగానే ముందు ఇంటర్నెట్ ముందు కూర్చోవడం ఫేస్‌బుక్ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పడం వీలయితే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అంటూ ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేయడం మాములైపోయింది కదా. అయితే జనాల మదిలో ఇంతలా అల్లుకుపోయిన ఈ ఇంటర్నెట్ ఎప్పుడు మొదలైంది. అసలు దాని చరిత్ర ఏంటీ..ఎప్పుడు కనుగొన్నారు. మరెప్పుడు అమల్లోకి వచ్చింది ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నసెల్ఫీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అక్షరాల 25 సంవత్సరాల కిందట. డిసెంబర్ 20, 1990 న

ఇప్పుడు ఇంటర్నెట్ అంటే అందరికీ సుపరిచితమే. అందులో వెబ్‌సైట్ అంటే ప్రపంచవ్యాప్త సమాచారాన్ని క్షణాల్లో మన చేతుల్లో పెట్టే సాధనం. మరి తొలి వెబ్‌సైట్ ఎప్పుడు ప్రారంభమైందంటే .. అక్షరాల 25 సంవత్సరాల కిందట. డిసెంబర్ 20, 1990 న ప్రపంచంలోని మొట్టమొదటి వెబ్‌సైట్ ప్రారంభమైంది.

టిమ్బెర్నర్స్ లీ వరల్డ్ వైడ్ వెబ్ (టిమ్ బెర్నర్స్-లీ వరల్డ్ వైడ్‌వెబ్) పేరిట

టిమ్బెర్నర్స్ లీ వరల్డ్ వైడ్ వెబ్ (టిమ్ బెర్నర్స్-లీ వరల్డ్ వైడ్‌వెబ్) పేరిట యూరప్ అణు పరిశోధన కేంద్రం సెర్న్ లో ఇది మొదట ఆన్‌లైన్లోకి వెళ్లింది. అయితే ఈ వెబ్‌సైట్ అదేరోజున ప్రజల్లోకి వెళ్లలేదు.

కొన్ని నెలల అనంతరం ఆగస్టు 6.20, 1990 సమాచార నెట్ వర్క్ చరిత్రలో

కొన్ని నెలల అనంతరం ఆగస్టు 6.20, 1990 సమాచార నెట్ వర్క్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. అత్యంత ప్రాథమిక దశలో బెసిక్ ఫీచర్స్ తో ఉన్న ఈ వెబ్‌సైట్ 1992 వెర్షన్ ఇప్పటికీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

నిజానికి అత్యంత ప్రాథమిక దశలో ఉన్న వెబ్‌సైట్

నిజానికి అత్యంత ప్రాథమిక దశలో ఉన్న వెబ్‌సైట్ ఇతరుల పత్రాల యాక్సెస్ పొందడానికి, సొంత సర్వర్ ను ఏర్పాటుచేసుకోవడానికి వీలుగా రూపొందింది. బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన బెర్నర్స్ లీ 1989 లో తొలిసారి ఈ వెబ్‌సైట్ ను రూపొందించారు.

నిజానికి వరల్డ్ వైడ్ వెబ్ (WWW) కి ఇంటర్నెట్ కు

నిజానికి వరల్డ్ వైడ్ వెబ్ (WWW) కి ఇంటర్నెట్ కు సన్నిహిత సంబంధమున్నా .. చాలామంది పొరపడుతున్నట్టు ఇవి రెండు ఒకటి కావు.

బీబీసీ వివరణ ప్రకారం ఒకదానికొకటి అనుసంధానమై

బీబీసీ వివరణ ప్రకారం ఒకదానికొకటి అనుసంధానమై ఉన్న భారీ పెద్దసంఖ్యలోని కంప్యూటర్ల భారీ నెట్‌వర్క్ ఇంటర్నెట్. ఈ కంప్యూటర్ నెట్ వర్క్ లో లభించే వెబ్ పేజీల కలెక్షన్ వరల్డ్ వైడ్ వెబ్.

1991, ఆగస్టు 6న మొట్టమొదటి వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో

1991, ఆగస్టు 6న మొట్టమొదటి వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. వరల్డ్‌వైడ్ వెబ్‌ను కనుగొన్న టిమ్ బర్నర్స్ లీ తన ప్రాజెక్టు గురించి తొలి వెబ్ సైట్ www.w3.org.లో వివరించాడు.

ఈ వెబ్‌సైట్ ఇపుడు info.cern.ch. గా కనిపిస్తుంది.

ఈ వెబ్‌సైట్ ఇపుడు info.cern.ch. గా కనిపిస్తుంది. మొట్టమొదటి వెబ్‌సర్వర్ అదే. అయితే 1992 నాటికల్లా 50 వెబ్‌సర్వర్లు పుట్టాయి. ఇపుడు వీటి సంఖ్య కోట్లలో ఉంటుంది.

2011 ఆగస్టు 5 నాటికే వెబ్‌లో 1968కోట్ల పేజీలున్నాయి.

వరల్డ్‌వైడ్ వెబ్‌సైజ్ డాట్‌కామ్ లెక్క ప్రకారం 2011 ఆగస్టు 5 నాటికే వెబ్‌లో 1968కోట్ల పేజీలున్నాయి. అప్పట్లో ప్రపంచజనాభా కన్నా ఇది మూడు రెట్లు ఎక్కువ.

2014 నాటికి ఇంటర్నెట్ ప్రపంచంలో వెబ్ సైట్ ల సంఖ్య వంద కోట్లకు

ఇక 2014 నాటికి ఇంటర్నెట్ ప్రపంచంలో వెబ్ సైట్ ల సంఖ్య వంద కోట్లకు చేరిందట.ఒకప్పుడు డెస్క్ టాప్ లకే పరిమితమైన వ్యవహారం స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి విస్తరించాయి. దీంతో ఇంటర్నెట్ వినియోగం చేతిలో అమరిపోతోంది. దీంతో వెబ్ సైట్ ల సంఖ్య కూడా రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతోంది.

ఊరు, పేరు, సంస్థ ఇలా ప్రతిదానికో వెబ్ సైట్

ఊరు, పేరు , సంస్థ ఇలా ప్రతిదానికో వెబ్ సైట్ రూపుదిద్దుకుంటోంది. వెబ్ సైట్ల సంఖ్య నేటికి 100 కోట్లు దాటిందని 'ఆన్ లైన్ ట్రాకర్ ఇంటర్నెట్ లైవ్ స్టాట్స్' తెలిపింది. రానున్న కాలంలో వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ స్పష్టం చేసింది.

సెర్న్ ఫిజిక్స్ లేబొరేటరీకి చెందిన భౌతికశాస్త్రవేత్తలు

తొలుత సెర్న్ ఫిజిక్స్ లేబొరేటరీకి చెందిన భౌతికశాస్త్రవేత్తలు తమ డేటాను ఒకరినొకరు పంచుకోవడం కోసమే వెబ్‌ను ఉపయోగించేవారు. 1991 ఆగస్టు 6న సాధారణ జనానికి కూడా వెబ్ అందుబాటులోకి వచ్చింది.

1992లో మొట్టమొదటగా ఓ ఫోటోను నెట్‌లో అప్‌లోడ్

అయితే వెబ్ ప్రారంభమైన తర్వాత తొలి రెండేళ్లూ రకరకాల బ్రౌజర్ అప్లికేషన్లను అభివృద్ధి చేశారు. 1992లో మొట్టమొదటగా ఓ ఫోటోను నెట్‌లో అప్‌లోడ్ చేశారు. 93 చివర్లో విండోస్, మ్యాక్ ఓఎస్‌లకు ఆ అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. తొలి వెబ్ బ్రౌజర్ నెట్‌స్కేప్ నావిగేటర్.

అమెరికా తన రక్షణ రంగం అవసరాల కోసం

అమెరికా తన రక్షణ రంగం అవసరాల కోసం లో నెట్ వ్యవస్థను రూపొందించుకుంది 1960. ఆ తరువాత అదే ఇంటర్నెట్ గా రూపాంతరం చెందింది. ప్రఖ్యాత బ్రిటీష్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ ప్రపంచవ్యాప్తంగా 1989 మార్చి 12 న వెబ్ ను పరిచయం చేశారు. అది 1990నాటికి ఓ రూపుకొచ్చింది. 1991లో ఆన్ లైన్ లోకి ఎంటరయింది.

బెర్నర్స్ లీ ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని సెర్న్ ప్రయోగశాలలో

బెర్నర్స్ లీ ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని సెర్న్ ప్రయోగశాలలో పరిశోధకుడిగా కొనసాగుతున్నారు.వరల్డ్ వైడ్ వెబ్ వచ్చినతర్వాత వెబ్ సైట్లు ఏర్పాటయ్యాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write The worlds first website went online 25 years ago
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot