రూ. 7 వేలకే ప్రపంచంలోని అత్యంత చిన్న ప్రింటర్

By Hazarath
|

ఇప్పటివరకూ మీరు చూడనటువంటి ప్రింటర్ మార్కెట్లోకి విడుదలయింది. టెక్నాలజీ దిగ్గజం అలాగే ప్రింటర్ల తయారీలో పేరుమోసిన హెచ్‌పి ఈ రకమైన ప్రింటర్ ను మార్కెట్లోకి వదిలింది. అయితే ఈ ప్రింటర్ ను ఆల్ ఇన్ వన్ గా ఉపయోగించుకోవచ్చని అదే దీని స్పెషాలిటీ అని కంపెనీ చెబుతోంది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే మీ ఫోన్ ద్వారానే ప్రింట్ తీసుకోవచ్చు.

 

దిగ్గజాలే ఖంగుతిన్న వేళ : ఆండ్రాయిడ్ ఫోన్లలోనే టాప్ Xiaomi Mi 5s..

డెస్క్ జెట్ ఇంక్ అడ్వాంటేజ్ 3700

డెస్క్ జెట్ ఇంక్ అడ్వాంటేజ్ 3700

హెచ్‌పి నుంచి వచ్చిన ఈ ప్రింటర్‌‌కు డెస్క్ జెట్ ఇంక్ అడ్వాంటేజ్ 3700' పేరుని పెట్టారు. ఈ బుల్లి ప్రింటర్ ధరను రూ 7, 176గా కంపెనీ ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుంచి

స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుంచి

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం దీని ద్వారా స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుంచి స్కాన్ చేసుకొని, సులువుగా ప్రింట్ కాపీ తీసుకోవచ్చు.

480 పేజీలను

480 పేజీలను

రూ .550 విలువ చేసే కాట్రిడ్జ్ తో సుమారు 480 పేజీలను ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే ఒక మోనోక్రోమ్ ముద్రణ కయ్యే ఖర్చుఒక రూపాయి.

బరువు 2.33 కిలోలు
 

బరువు 2.33 కిలోలు

403x177x141ఎంఎం డైమన్షన్స్ తో ఉన్న ఈ ప్రింటర్ బరువు 2.33 కిలోలు. అంతేకాదు వైర్ లెస్ ప్రింటింగ్ కోసం వైఫై కి సపోర్టు చేస్తుంది.

గ్రీన్, బ్లూ రంగుల్లో

గ్రీన్, బ్లూ రంగుల్లో

ఆన్ లైన్ , ఆఫ్ లైన్, రీటైల్ స్టోర్లలో రెడ్, గ్రీన్, బ్లూ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. వినియోగదారులు అంచనాలకనుగుణంగా ఈ ప్రింటర్ రూపొందించామని సంస్థ ప్రకటించింది.

Best Mobiles in India

English summary
HP launches world's smallest All in One Printer Read more telugu gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X