జియో హవా ముగిసినట్లే, భారీగా షాకిస్తున్న కష్టమర్లు !

Written By:

ఉచితంగా డేటా, కాల్ ఆఫర్లను ఇచ్చినంత కాలం రిలయన్స్ జియో వైపు మొగ్గుచూపిన కస్టమర్లు, గడచిన ఏప్రిల్ నుంచి టారిఫ్ వసూలును ప్రారంభించే సరికి, ఇక జియో వద్దంటూ తమ పాత సర్వీస్ ప్రొవైడర్ల నంబర్లనే వాడటం మొదలు పెడుతుండటంతో జియోకు భారీ షాకే తగులుతోంది. కష్టమర్లు పాత నంబర్లకే జై కొట్టడంతో జియో కష్టమర్లు భారీగా తగ్గిపోతున్నట్లుగా తెలుస్తోంది.

రూ. 5,790 కే శాంసంగ్ కొత్త ఫోన్ , ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మిగతా టెలికం సంస్థల డేటా రేట్లు

జియో పుణ్యమాని మిగతా టెలికం సంస్థల డేటా రేట్లు కూడా దిగిరావడంతో కస్టమర్లు జియోను వీడుతున్నట్టు తెలుస్తోంది.

జియోకు వెళ్లిన ఖాతాదారుల్లో

ఇక తమ నుంచి జియోకు వెళ్లిన ఖాతాదారుల్లో చాలా మంది తిరిగి వెనక్కు వచ్చారని, దీని ప్రభావంతో కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాల నుంచి గట్టెక్కుతామన్న నమ్మకం ఉందని ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా అంచనా వేశారు.

వసూళ్లు ప్రారంభించిన తరువాత

చార్జీల వసూళ్లు ప్రారంభించిన తరువాత డేటా కస్టమర్లు జియో నెట్ వర్క్ ను వీడుతున్నారని ఆయన అన్నారు.

సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు

మార్కెట్లోకి సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు 75 మిలియన్ కస్టమర్లు చేరడం, మూడు టాప్ టెలికాం దిగ్గజాలకు నష్టాలు చేకూర్చడం స్వల్పమేనని, తాము సబ్ స్క్రైబర్లు జోడించుకుంటూనే ఉన్నామని కపానియా చెప్పారు.

వాయిస్ వాడక వృద్ధి

వాయిస్ వాడక వృద్ధి రెండంకెలు నమోదవుతుందని అంచనావేస్తున్నట్టు తెలిపారు. డేటా వృద్ధిలో రెండంకెలు, వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లో మూడింతలు వృద్ధిని నమోదుచేసే దిశగా ఇండస్ట్రీ పయనిస్తుందని పేర్కొన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huge chunk of data customers have returned from Jio: Himanshu Kapania of Idea Cellular Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot