బిఎస్ఎన్ఎల్ బొనాంజా, హైదరాబాద్‌లో వైఫై సేవలు ఉచితం

తెలంగాణా రాజధాని ఇకపై దేశంలోనే తొలి పూర్తిస్థాయి వైఫై మహానగరం

By Hazarath
|

జియోని సవాల్ చేస్తూ బిఎస్ఎన్ఎల్ తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉచిత వైఫై సేవలకు శ్రీకారం చుట్టింది. ఇకపై హైదరాబాద్ మహానగరం పూర్తి స్థాయి వైఫై నగరంగా రూపుదిద్దుకోనుంది. మీ మొబైల్ లో డేటా ఆగిపోయి ఆటోమేటిగ్గా వైఫై ఆన్ అయ్యేలా ప్రణాళికలు బిఎసఎన్ఎల్ రచించనుంది. ఆసక్తిగొలుపుతున్న కథనంపై ఓ లుక్కేయండి.

డబ్బులు లేవా..వొడాఫోన్ స్టోర్‌కెళ్లి డ్రా చేసుకోండి

 దేశంలోనే తొలి పూర్తిస్థాయి వైఫై మహానగరం

దేశంలోనే తొలి పూర్తిస్థాయి వైఫై మహానగరం

తెలంగాణా రాజధాని ఇక దేశంలోనే తొలి పూర్తిస్థాయి వైఫై మహానగరంగా రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్ వ్యాప్తంగా వైఫై సేవల విస్తరణకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ ఎల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఫ్రీ వైఫై సేవలు

ఫ్రీ వైఫై సేవలు

హాట్స్పాట్లు ఏర్పాటు చేసి ఫ్రీ వైఫై సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నగరంలో 150 వైఫై హాట్స్పాట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం క్వాడ్జన్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరింత విస్తరించి

మరింత విస్తరించి

ఇప్పటికే 49 హాట్స్పాట్లు ఏర్పాటు చేసి వైఫై సేవలు అందిస్తోంది. దీనిని మరింత విస్తరించి స్మాల్, మీడియం, లార్జ్ హాట్స్పాట్లు ఏర్పాటు చేసి నగరమంతా ఉచిత వైఫై సేవలు అందించనుంది.

2 నుంచి 10 ఎంబీల వరకు డేటా

2 నుంచి 10 ఎంబీల వరకు డేటా

ఒక్కో హాట్స్‌స్పాట్‌కు ఐదు వైఫై టవర్లు, ఒక్కో టవర్ ఐదు నుంచి పది కిలోమీటర్ల పరిధిలో సేవలు అందించేలా తీర్చిదిద్దనున్నారు. హాట్స్‌స్పాట్‌ వినియోగదారులు 2 నుంచి 10 ఎంబీల వరకు డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు

ఇక బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు వైఫై మరింత ప్రయోజనకరంగా మారనుంది. బీఎస్ఎన్ఎల్ 3 జీ వినియోగదారులు వైఫై జోన్లో ప్రవేశించగానే మొబైల్ డేటా దానంతట అదే ఆగిపోయి వైఫై యాక్టివేట్ అవుతుంది.

డేటాను ఉచితంగా డౌన్లోడ్

డేటాను ఉచితంగా డౌన్లోడ్

మొబైల్ డేటా ప్లాన్ ప్రకారం డేటాను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర నెట్వర్క్ల వినియోగదారులు తొలి 15 నిమిషాల పాటు వైఫై సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

 క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి

క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి

ఆ తర్వాత వోచర్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి సేవలు పొందవచ్చు. నగరంలో ఉచిత వైఫై సేవలు వచ్చే ఏడాది మార్చి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాంచంద్ తెలిపారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Hyderabad gets 150 new Wi-Fi spots in Digital India push read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X