ఫ్లిప్‌కార్ట్‌కు రూ.20 లక్షల బురిడి, సూత్రదారి హైదరాబాద్ వ్యక్తే!

Posted By:

తమ ఐటమ్ రిటర్న్ పాలసీని ఉల్లంఘించి రూ.20 లక్షల ఘరానా మోసానికి పాల్పడిన హైదరాబాద్ వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ సిద్ధమైంది. ఈ ఘటనకు సంబంధించి బెంగళూర్ మిర్రర్ ప్రచురించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

Read More : ఆంధ్రప్రదేశ్‌లో ‘Asus' స్మార్ట్‌ఫోన్‌ల తయారీ

హైదరాబాద్ లోని వనస్థలిపురానికి చెందిన వీరాస్వామి (32) ఫ్లిప్‌కార్ట్‌ను మోసగిచ్చినట్లు ఆరోపణలను ఎదర్కొంటున్నారు. ఈయన రకరకాల పేర్ల మీద విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్‌ చేసే వారట. అవి డెలివరీ అయిన తరువాత వాటిలో క్వాలిటీ ఏ మాత్రం బాలేదని కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసి వాటిని రిటర్న్ తీసుకోవల్సిందిగా కోరేవారు. మరిన్ని వివరాలను క్రింది స్లైడ్‌షోలో...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేసిన హైదరాబాద్ వ్యక్తి!

ఇతడి ఫిర్యాదు మేరకు వస్తువలను కలెక్ట్ చేసుకునేందుకు కంపెనీ ఇతని వద్దకు తమ ప్రతినిధులను పంపేది.

ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేసిన హైదరాబాద్ వ్యక్తి!

ఈ క్రమంలో వీరాస్వామి ఫ్లిప్‌కార్ట్ పంపిన ఒరిజినల్ వస్తువులను డెలివరీ బాక్సుల్లోంచి తొలగించి వాటి స్థానంలో నకిలీ ఐటమ్ లను పెట్టేసి మోడల్ నెంబర్ అలానే ఐటమ్ కోడ్‌ను ఏ మాత్రం అనుమానం రాకుండా అంటించేసే వాడు.

 

ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేసిన హైదరాబాద్ వ్యక్తి!

ఈ రిటర్న్ చేయబడని వస్తువు డీలర్ వద్దకు చేరుకోగానే వీరాస్వామి ఇచ్చిన రకరకాల బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు జమయ్యేవి.

ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేసిన హైదరాబాద్ వ్యక్తి!

ఈ ఘరానా మోసంలో భాగంగా ఇతగాడు రకరకాల పేర్లమీద నకిలీ ఈమెయిల్ అకౌంట్‌లను సృష్టించి రకరకాల బ్యాంక్ అకౌంట్‌ల ద్వారా డబ్బు చెల్లించి వస్తువులను బుక్ చేసేవాడు.

ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేసిన హైదరాబాద్ వ్యక్తి!

ఇతడు గడిచిన 20 నెలలుగా రకరరకాల పేర్ల మీద 200కు పైగా వస్తువులను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేసిన హైదరాబాద్ వ్యక్తి!

వీరాస్వామి మోసపూరిత చర్యల వల్ల కంపెనీకి రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు ఫ్లిప్‌కార్ట్ వనస్థలిపురం ఠానాలో ఫిర్యాదు చేసింది.

ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేసిన హైదరాబాద్ వ్యక్తి!

కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటన పై లోతైన విచారణ చేపడుతున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేసిన హైదరాబాద్ వ్యక్తి!

ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. Easy Moneyకి అలవాటు పడుతోన్న యువత తమ విలువైన తెలివేటలను వక్రమార్గాలకు ఉపయోగించటం శోచనీయం. 

ఫ్లిప్‌కార్ట్ రెండవ ఎడిషన్ ‘Big Billion Sale'

ఫ్లిప్‌కార్ట్ తన రెండవ ఎడిషన్ ‘Big Billion Sale'ను సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా మాత్రమే జరగనున్న ఈ బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా భారీ ఆఫర్లు, రాయితీలతో కూడిన 70కి పైగా ఉత్పత్తుల విభాగాలను అందుబాటులో ఉంచుతామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ రెండవ ఎడిషన్ ‘Big Billion Sale'

ఈ సేల్ నాటికి భారత్‌లో పండుగల సీజన్ ప్రారంభమవటంతో అమ్మకాలు భారీగా ఉండే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఐదు రోజుల షాపింగ్ ఫెస్టివల్‌లో భాగంగా ఆన్‌లైన్ షాపర్లకు ప్రత్యేకమైన ఆఫర్లను ఇవ్వడానికి ప్రముఖ బ్యాంకులతో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hyderabad Man Duped Flipkart Of Rs 20 Lakh. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot