దూసుకొస్తున్న హైపర్‌సోనిక్

Posted By:

ఎక్కడ ఆస్ట్రేలియా..ఎక్కడ యూరప్ ..దాదాపు వేల కిలోమీటర్ల దూరం..ఆ గమ్యాన్ని చేరాలంటే దాదాపు రెండు రోజులు...ఇంకా ఫాస్ట్ గా వెళితే ఒక రోజు పడుతుంది. కాని యూరప్ నుంచి ఆస్ట్రేలియాకు గంట లోపల ప్రయాణం చేయగలగడం సాధ్యమా...అసలు ఆ ఆలోచనే కష్టం కదా..అయితే అది సాధ్యమే అంటున్నారు జర్మనీ ఏరోస్పేస్ బృందం..కేవలం 90 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకునేలా హైపర్‌సోనిక్ స్పేస్ లైన్ తీసుకురానున్నారు. అయితే 2030 నాటికి పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉందని వారు తెలియజేస్తున్నారు. ఈ విమానం ఎలా ఉంటుంది..దాని స్థితిగతులు ఏంటో ఓ సారి చూసేద్దాం.

Read more at:పతనమైన బతుకులకు పునర్జన్మ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూరప్ టూ యుఎస్ 60 నిమిషాల్లో ప్రయాణం

2007లో జర్మనీ ఏరోస్పేస్ ఈ ప్రతిపాదన చేసింది. ఈ విమానంతో లండన్ నుంచి సిడ్నీకి 90 నిమిషాల్లో 20 సార్లు తిరగవచ్చు.అది 2030లో బయటకు వస్తోంది. అలాగే యూరప్ టూ యుఎస్ 60 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చు.

డిఎల్ ఆర్ స్పేస్ లాంచర్ సిస్టమ్స్ర్ చర్చలు

ఈ మేరకు డిఎల్ ఆర్ స్పేస్ లాంచర్ సిస్టమ్స్ అమెరికా ఇనిస్టిట్యూట్ ఏరోడైనమిక్స్ తో చర్చలు జరుపుతోంది. హైపర్ సోనిక్ విమానాలను వీలైనంత త్వరగా తీసుకురావాలని సంకల్పిస్తోంది.

ఫస్ట్ ఫేజ్ ఈ ఇయర్ పూర్తి

డెవలప్ మెంట్ ని మేము స్వాగతిస్తున్నాం.అలాగే మొదటి దశ పనులను ఈ సంవత్సరంలోనే పూర్తి చేస్తామని స్కాట్లాండ్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో డిఎల్ ఆర్ స్పేస్ లాంచర్ సిస్టమ్స్ అధిపతి మార్టిన్ తెలిపారు.

100 సీట్లతో 1 గంటలో గమ్యం

100 సీట్లతో 1 గంటలో గమ్యాన్ని చేరుకునే విధంగా ఈ విమానాలను రూపొందించనున్నారు. అయితే టికెట్ ధరలు కూడా చాలా భారీ స్థాయిలోనే ఉంటాయని ఆయన చెబుతున్నారు.

సౌండ్ లెస్ విమానం

అయితే ఇది రెండు స్టేజీల్లో ఉంటుంది.మొదటిది ఆర్బిటర్ స్టేజి రెండవది బూస్టర్ స్జేజీ.వాతావరణాన్ని తట్టుకునే విధంగా అలాగే ఎటువంటి కాలుష్యం లేకుండా తయారు చేయనున్నారు. ఇందుకోసం ఇంధనాన్ని లిక్విడ్ హైడ్రోజెన్ అలాగే ఆక్సిజన్ ను వాడనున్నారు.ఇంజిన్ కూడా సౌండ్ లెస్ లో తయారు చేయనున్నారు.

రాకెట్ కన్నా స్పీడు

రాకెట్ కన్నా స్పీడుగా కళ్లు మూసి తెరిచేలోపు వేల కిలోమీటర్లు దాటి గమ్యాన్ని చేరుతారని కంపెనీ ధీమాగా చెబుతోంది 

వెలుగులు తో కూల్

ఎంతగా వెలుగులు విరజిమ్మినా కాని కొంచెం కూడా వేడి అనిపించదు. చాలా కూల్ గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. 

ఇంధనం

ఇంధనం అంతా కాలుష్యాన్ని తట్టుకునే విధంగా ఉంటుంది. కాలుష్య రహిత ఇంధనం వాడనున్నారు 

యూరప్ టూ ఆస్ట్రేలియా

యూరప్ టూ ఆస్ట్రేలియా ఎలా చేరుకోవాలో తెలిపే మ్యాప్ ఇదే 

90 నిమిషాల్లో గమ్యానికి

వేల కిలోమీటర్లు,ఖండాంతరాలు కేవలం 60 నిమిషాలు ,ఇంకా దూరం 90 నిమిషాల్లో చేరుకునే విధంగా విమానం రూపొందిస్తున్నారు.

ప్రశాంతంగా ఆకాశంలోకి

ఇలా నిప్పులు చిమ్మకుండా ఎటువంటా సౌండ్ లేకుండా ఆకాశానికి ఎగిరే విధంగా రూపొందించనున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో సోర్స్ :DLR Space 

English summary
Hypersonic passenger planes could be a reality by 2030: Rocket-propelled SpaceLiner could carry 100 passengers and travel between Europe and Australia in under 90 minutes
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot