ఏపీ, తెలంగాణాల్లో ఐడియా 4జీ విస్తరణ

Written By:

భారతదేశపు ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్, తన 4జీ ఎల్టీఈ సర్వీసులను ఏపీ, తెలంగాణాల్లో మరింతంగా విస్తరించింది. తాజగా, ఈ రెండు రాష్ట్రాల్లోని 37 పట్టణాలకు తన 4జీ సేవలను పెంచింది. 4జీ సేవలను ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలోనే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, కాకినాడ, నల్గొండ, కడప, తిరుపతి వంటి ప్రముఖ పట్టణాలతో సహా 20 జిల్లాల్లో 4జీ సేవలను అందిస్తున్నట్లు ఐడియా తెలిపింది. తమ ఏపీ, తెలంగాణ సర్కిల్లోని 18శాతం జనాభాను 4జీ సేవలు కవర్ చేస్తున్నాయని ఐడియా పేర్కొంది.

ఏపీ, తెలంగాణాల్లో ఐడియా 4జీ విస్తరణ

మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఐడియా తమ హై-స్పీడ్ 4జీ ఎల్టీఈ సర్వీసులను హైదరాబాద్‌తో పాటు కోడూరు, అనకాపల్లి, కొత్తకోట, జడ్చర్ల, ఆర్మూర్, నరసంపేట్, రేణుగుంట, రుద్రామ్, పలమనేరు, నర్శిపట్నం, టెక్కలి, యలమంచలి, గజ్వేల్, ఘటకేసర్, పీలేరు, మెట్‌పల్లి, అనంతపురం వంటి పట్టణాల్లో లాంఛానంగా ప్రారంభించింది.

రూ.500కే స్మార్ట్‌ఫోన్, నేడే విడుదల

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నిజామాబాద్, కరీంనగర్, నెల్లూరు, కర్నూల్, ఖమ్మం, శ్రీకాకుళం సహా మరో 78 పట్టణాలకు 4జీ సేవలను విస్తరిస్తామని ఐడియా వెల్లడించింది. ఏపీ, తెలంగాణ సర్కిల్ లో ఐడియా సెల్యులూర్ కు 15.38 మిలియన్ల చందదారులు ఉన్నారు. ఐడియా తన 2జీ, 3జీ సేవలను 900Mhz బ్యాండ్‌విడ్త్‌లో, 4జీ సేవలను 1,800 MHz బ్యాండ్‌విడ్త్‌లో ఆఫర్ చేస్తోంది. దేశవ్యాప్తంగా 8 టెలికాం సర్కిళ్లలో ఐడియా తన 4జీ సేవలను ప్రారంభించింది. జూన్ నాటికి ఈ సేవలను 10 సర్కిళ్లకు విస్తరించాలని ఐడియా భావిస్తోంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్

తమ 2జీ, 3జీ చందదారులు 4జీకి అప్ గ్రేడ్ అయ్యే విధంగా కాంప్లిమెంటరీ 4జీ సిమ్‌ను ఐడియా అందిస్తోంది. ఈ సిమ్‌ను ఐడియా రిటైల్ అవుట్‌లెట్‌ల నుంచి పొందవచ్చు. 4జీ సేవలు అందుబాటులోని ఐడియా యూజర్లు ఈ సేవలు అందుబాటులో ఉన్న పట్టణాల్లో పర్యటించినపుడు 4జీ ఎల్టీఈ సర్వీసులను వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఐడియా తెలిపింది.

భవిష్యత్ 'వర్చువల్ రియాల్టీదే'

3జీ ప్లాన్‌ల రేట్లకే 4జీ సేవలను అందిస్తామని, తన చందాదారులు రూ.25నుంచే 4జీ ప్యాక్‌ను పొందవచ్చని ఐడియా వెల్లడించింది. మర్చి 31లోపు 4జీ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే తమ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్లమర్‌లకు డబల్ డేటా బెనిఫిట్ లను కల్పిస్తామని ఐడియా తెలిపింది.

English summary
Idea expands high-speed 4G LTE services in Andhra Pradesh and Telangana. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot