త్వరలో అందుబాటులోకి రానున్న ఐడియా 4జీ సేవలు

Written By:

రిలయన్స్‌ జియో ప్రవేశంతో టెలికాం కంపెనీలు నాలుగో తరం (4జి) టెలికాం సేవలకు సిద్దమవుతున్నాయి. ఇందుకోసం ఐడియా సెల్యులార్‌ కంపెనీ సైతం తన రోడ్‌మ్యాప్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్‌ కల్లా ఎపి, తెలంగాణతో సహా 10 టెలికం సర్కిల్స్‌లోని 750 నగరాలు, పట్టణాల్లో తమ 4జి సేవలు ప్రారంభమవుతాయని తెలిపింది. గత రెండేళ్లలో జరిగిన స్పెక్ట్రమ్‌ వేలంలో ఇందుకు అవసరమైన 1800 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను కంపెనీ కొనుగోలు చేసింది.

Read more: లెనోవో రికార్డ్ సేల్ : ఏడాదిలో 30 లక్షల 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో అందుబాటులోకి రానున్న ఐడియా 4జీ సేవలు

భారతి ఎయిర్‌టెల్‌, ఎయిర్‌సెల్‌ కంపెనీలు రిలయన్స్‌ జియో కంటే ముందే దేశంలో 4జి సేవలు ప్రారంభించాయి. దేశంలో 4జీ సర్వీసులు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ డిప్యూటీ ఎండీ అంబరీష్ జైన్ ఇంతకుముందే చెప్పారు. ఇండియాలో 4జీ సర్వీస్ తప్పకుండా క్లిక్ అవుతుందని, ప్రజలు ఆదరిస్తారని జైన్ చెప్పారు.

Read more: షియోమి నుంచి సరికొత్త స్కూటర్

త్వరలో అందుబాటులోకి రానున్న ఐడియా 4జీ సేవలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.809.26 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు దేశంలో మూడో అతిపెద్ద టెలికం సర్వీసుల సంస్థ ఐడియా సెల్యులార్ ప్రకటించింది.ప్రస్తుతం సంస్థకు 4.13 కోట్ల మంది డేటా వినియోగదారులు ఉన్నారు. సర్వీసులను పెంచడానికి గడిచిన త్రైమాసికంలో 9,947 సైట్లను ఏర్పాటు చేసింది. దీనికోసం సంస్థ రూ.1,726.6 కోట్ల నిధులను వెచ్చించింది.

English summary
Here Write Idea-launch-4g-services-tn-750-towns-over-india
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot