షియోమి నుంచి సరికొత్త స్కూటర్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ షియోమి (Xiaomi) సరికొత్త సెల్ఫీ బ్యాలెన్సింగ్ స్కూటర్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. నైన్‌బోట్ మినీ పేరుతో వచ్చిన ఈ స్కూటర్‌ను షియోమి సంస్థ నైన్‌బోట్ ఇంకా సెగ్‌వేల భాగస్వామ్యంతో విడుదల చేసింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఈ హోవర్‌బోర్డ్ ప్రయాణిస్తుంది.
Read More : ఆ వీడియోలు చూడాలంటే 1800 సంవత్సరాల పట్టుద్ది!

సింగిల్ చార్జ్ పై 22 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్‌ను బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఈ హోవర్ బోర్డ్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ హోవర్‌బోర్డ్ ధర చైనా కరెన్సీ ప్రకారం రూ.20,500. ఈ చిన్ని స్కూటర్‌ను ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియమ్‌తో తయారు చేసినట్లు సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications








