Home
News

ఐడియా నుంచి మరో బంపరాఫర్

ఐడియా తమ కష్టమర్ల కోసం మరో బంపరాఫర్ ప్రకటించింది.

By Hazarath

ఐడియా తమ కష్టమర్ల కోసం మరో బంపరాఫర్ ప్రకటించింది. తన కొత్త, పాత కస్టమర్లకు 10జీబీ ఉచిత 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ప్యాన్-ఇండియా బేసిస్ లో 4జీ సేవలను ప్రారంభిస్తున్న క్రమంలో తన కస్టమర్లకు ఈ ఆఫర్ ప్రకటించింది.

ల్యాపీ కొంటున్నారా..? అయితే మీ కోసమే ఈ చిట్కాలు

మూడు నెలల కాలంలో

మూడు నెలల కాలంలో

ఈ డేటాను మూడు నెలల కాలంలో ఈ ఉచిత డేటాను వినియోగించుకోవచ్చట. ముంబై సర్కిల్ లో ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసు ప్రొవైడర్ 4జీ సర్వీసులను ప్రారంభించింది.

 20 సర్కిళ్లలో

20 సర్కిళ్లలో

తన 20 సర్కిళ్లలో ఈ సేవలందించడం కోసం 4జీ స్పెక్ట్రమ్ ను ఐడియా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 34ఎంబీపీఎస్ స్పీడుతో ఈ సేవలను కస్టమర్లు వినియోగించుకోవచ్చని తెలిపింది.

ఇన్విటేషన్ ఆఫర్' ను

ఇన్విటేషన్ ఆఫర్' ను

ఈ మైలురాయిని సాధించిన క్రమంలో ఐడియా 'ఇన్విటేషన్ ఆఫర్' ను తన కొత్త, పాత సబ్ స్క్రైబర్లకు పొడిగిస్తోందని కంపెనీ తెలిపింది.

10జీబీ ఉచిత 4జీ డేటా

10జీబీ ఉచిత 4జీ డేటా

ఈ పొడిగింపుతో 10జీబీ ఉచిత 4జీ డేటా మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ 2017 మే 25, 2017 ఆగస్టు 22 మధ్యలో ఐడియా కొత్త 4జీ కొనుగోలు చేసిన లేదా అప్ గ్రేడ్ అయిన కస్టమర్లకే అందుబాటులో ఉంటుంది.

ఐడియా సబ్ స్క్రైబర్లు 4జీలోకి అప్ గ్రేడ్ అయితే ..

ఐడియా సబ్ స్క్రైబర్లు 4జీలోకి అప్ గ్రేడ్ అయితే ..

ప్రస్తుత ఐడియా సబ్ స్క్రైబర్లు 4జీలోకి అప్ గ్రేడ్ అయితే అదనంగా మరో 4జీబీ 4జీ డేటాను 14 రోజుల పాటు అందించనుందని పేర్కొంది. ఈ సర్వీసులు కూడా కేవలం ముంబైలోని ఐడియా సబ్ స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.

 అపరిమిత స్థానిక, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యం

అపరిమిత స్థానిక, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యం

ఈ రీఛార్జ్ తో అపరిమిత స్థానిక, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యం, 1జీబీ 4జీ డేటా 84 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. ఇవే ప్రయోజనాలను రూ.192తోనూ 28 రోజుల పాటు పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Idea offers 10 GB free data to mark pan-India 4G rollout read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X