ఐఎఫ్ఏ 2015.. కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

Posted By:

ఏటా సరికొత్త ఎలక్ట్రానిక్ గృహోపకరణాలతో పాటు టెక్నాలజీ డివైస్‌లను పరిచయం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఆదరణను సొంతం చేసుకున్న ప్రముఖ టెక్నాలజీ ట్రేడ్ షో ‘ఐఎఫ్ఏ' (ఇంటర్నేషనల్ రేడియో ఎగ్జిబిషన్, లేదా బెర్లిన్ రేడియో షో) ఈ 2015కు గాను మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది.

Read More : రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

ప్రతి ఏటా బెర్లిన్ వేదికగా సాగే ఈ ప్రదర్శనను జర్మనీలోనే అతిపురాతన ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా అభివర్ణిస్తారు. చరిత్రలోకి వెళితే...1924 నుంచి 1939 వరకు ఐఎఫ్ఏ షోను వార్షిక ఈవెంట్ (సంవత్సరానికి ఒకసారి) గా నిర్వహించే వారు. 1950 నుంచి 2005 వరకు ఈ షోను రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే వారు. 2006 నుంచి ఐఎఫ్ఏ షో మళ్లీ వార్షిక ఈవెంట్‌గా మారిపోయంది.

Read More : ముదిరిన ఉల్లి లొల్లి

ఈ ఏడాదికిగాను సెప్టంబర్ 4 నుంచి 9వ వరకు జరగబోయే ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ప్రదర్శనకు బెర్లిన్ నగరం ఇప్పటికే ముస్తాబయ్యింది. ఐఎఫ్ఏ 2015ను GizBot ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ ప్రదర్శనలో చోటుచేసుకునే అన్ని ఆవిష్కరణలను మినిట్ టు మినిట్ అప్‌డేట్‌ల రూపంలో మీకందించటం జరుగుతుంది.

Read More : గెలాక్సీ నోట్ 5, హిట్టా..ఫట్టా

ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ట్రేడ్ షో వేదికగా సామ్‌సంగ్, సోనీ, మైక్రోసాఫ్ట్, ఎల్‌జీ, ఆసుస్ వంటి ప్రముఖ కంపెనీలు తమ లేటెస్ట్ గాడ్జెట్‌లను ఆవిష్కరించే అవకాశముంది. ఐఎఫ్ఏ 2015లో ప్రముఖ కంపెనీలు ప్రదర్శించబోయే లేటెస్ట్ గాడ్జెట్‌లకు సంబంధించి ఆసక్తికర రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అవేంటో చూద్దామా మరి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఎఫ్ఏ 2015.. కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

సామ్‌సంగ్

దక్షిణ కొరియా కంపెనీ సామ్‌సంగ్ ఐఎఫ్ఏ 2015ను పురస్కరించుకుని సెప్టంబర్ 3వ తేదీని హైప్రొఫైల్ ప్రెస్ కాన్ఫిరెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలోనే సామ్‌సంగ్ తన ఆవిష్కరణల వివరాలను వెల్లడించే అవకాశముంది.

 

ఐఎఫ్ఏ 2015.. కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

ఎల్‌జీ

ఐఎఫ్ఏ 2015 వేదికగా ఎల్‌జీ ఓ సూపర్ ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ను  ఆవిష్కరిచే అవకాశముందని రూమర్స్ మిల్స్ చెబుతున్నాయి.

 

ఐఎఫ్ఏ 2015.. కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

సోనీ

ఐఎఫ్ఏ 2015 వేదికగా సోనీ నుంచి సరికొత్త ఆవిష్కరణలు ఉండొచ్చని టెక్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా జెడ్5 కాంపాక్ట్, ఎక్స్‌పీరియా జెడ్5 అల్ట్రా వంటి ఫోన్‌లను ఈ ప్రదర్శనలో భాగంగా సోనీ ఆవిష్కరించే అవకాశముంది.

 

ఐఎఫ్ఏ 2015.. కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

హెచ్‌టీసీ

హెచ్‌టీసీ ఓ2 ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ప్రదర్శనలో భాగంగా హెచ్‌టీసీ ‘ఓ2' పేరుతో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం.

 

ఐఎఫ్ఏ 2015.. కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

మోటరోలా

ఐఎఫ్ఏ 2015 వేదికగా మోటరోలా ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఓ స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించే అవకాశముంది.

 

ఐఎఫ్ఏ 2015.. కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

మైక్రోసాఫ్ట్

ఐఎఫ్ఏ 2015లో భాగంగా మైక్రోసాఫ్ట్ తన లుమియా సిరీస్ నుంచి సరికొత్త విండోస్ 10 ఫోన్‌లను ప్రదర్శించే అవకాశం.

 

ఐఎఫ్ఏ 2015.. కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

అసుస్

ఐఎఫ్ఏ 2015ను పురస్కరించుకుని అసుస్ సెప్టంబర్ 2వ తేదీని ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలోనే అసుస్ తన కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశముంది.

 

ఐఎఫ్ఏ 2015.. కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

హువావీ

ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ప్రదర్శనలో భాగంగా హువావీ తన ‘మేట్ ఎస్' స్మార్ట్ డివైస్‌ను విడుదల చేసే అవకాశముంది.

 

ఐఎఫ్ఏ 2015.. కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

లెనోవో

ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ప్రదర్శనలో భాగంగా లెనోవో తన వైబ్ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం.

 

ఐఎఫ్ఏ 2015.. కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

ఏసర్

ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ప్రదర్శనలో భాగంగా ఏసర్ 4 సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ప్రదర్శించే అవకాశం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
IFA 2015: Here Is What We Expect From Samsung, Sony, Microsoft And Huawei. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot