రెండుగా చీలిపోతున్న శాంసంగ్

Written By:

టెక్ రంగంలో దూసుకుపోతున్న దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. తమ కంపెనీని రెండుగా విడగొట్టాలని ఆలోచనలో ఉన్నట్లు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. అయితే ఈ ఆశ్చర్యకర నిర్ణయానికి కారణం తన తండ్రి నుంచి పగ్గాలు చేపట్టబోతున్న వారసుడు లీ జే యాంగ్ అని తెలుస్తోంది. అతని కోసమే కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్విస్టంటే ఇది, నోట్లరద్దుతో ఐఫోన్లు చిక్కడం లేదు

రెండుగా చీలిపోతున్న శాంసంగ్

శాంసంగ్ కు విదేశీ పెట్టుబడిదారుల నుంచి తీవ్రంగా ఒత్తిడి ఉంది. ప్రధానంగా అమెరికాకు చెందిన హెడ్జ్ ఫండ్ ఎలియట్ మేనేజ్మెంట్ ఈ విషయంలో ముందుంది. తన కార్పొరేట్ పాలనను మెరుగుపరుచుకోడానికి ఒక హోల్డింగ్ కంపెనీ పెట్టి షేర్ హోల్డర్లకు డివిడెండ్లు పెంచాలని శాంసంగ్ ను డిమాండ్ చేస్తున్నారు.

రూ. 15 వేలకే 16 ఎంపీ సెల్ఫీ, 3జీబి ర్యామ్‌తో ఒప్పో ఫోన్

రెండుగా చీలిపోతున్న శాంసంగ్

దీంతో పాటు బ్యాటరీలు పేలిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా గెలాక్సీ నోట్ 7 ఫోన్‌ను రీకాల్ చేయాల్సి రావడంతో పెను పతనం నుంచి తప్పించుకోడానికి ఈ టెక్ దిగ్గజం నానా తిప్పలు పడుతోంది. తమ కంపెనీని హోల్డింగ్ కంపెనీ, ఉత్పాదక మరియు ఆపరేటింగ్ కంపెనీలుగా విడగొట్టడానికి ముందుగా కనీసం ఆరు నెలల పాటు అన్నీ పరిశీలించాల్సి ఉంటుందని శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది.

కొత్తగా 35 లక్షల ఐటీ ఉద్యోగాలు

రెండుగా చీలిపోతున్న శాంసంగ్

అలా చేస్తే .. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ చైర్మన్ గా ఉన్న లీ జే యాంగ్ కు హోల్డింగ్ కంపెనీ ద్వారా మంచి పట్టు వస్తుందని అంటున్నారు. ఈ ఏడాది ఒక్కోషేరుకు డివిడెండును 36 శాతం పెంచనున్నట్లు శాంసంగ్ ప్రకటించిన విషయం విదితమే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Samsung considers splitting into two read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot