Home
News

సంచలనాల కన్నా విషాదాలే ఎక్కువ

By Hazarath

2015..మరో రెండు రోజుల్లో ముగియబోతోంది..సరికొత్త ఆశలను రేకెత్తించడానికి 2016 వస్తోంది. అయితే 2015 చెదిరిపోని విషాద గుర్తులను మాత్రమే ఇచ్చి వెళుతోంది. ఎప్పటికీ వెంటాడే విషాదాలను మనకు అందించి వెళుతోంది. అవి ఎన్నటికీ మనల్ని వదిలిపోనివి. మరచిపోదామన్నా మరచిపోనివి. ఆ విషాద జ్ఙాపకాలు ప్రపంచం మొత్తం వైరస్‌లా పాకాయంటే.. ప్రభుత్వాలు కదిలాయంటే అతిశయోక్తి కాదు. వాటిని ఓ సారి చూద్దాం.

Read more: ఏడాదికి 16 సినిమాలు: ఆస్కార్ అవార్డ్ వేటలో అమెజాన్

ది డ్రెస్ ద

ది డ్రెస్ ద

ది డ్రెస్ ద పేరిట ఫిబ్రవరిలో పోస్ట్ అయిన ఓ ఫోటో ఆన్ లైన్ ప్రపంచాన్ని ఊపేసింది. 21 ఏళ్ల గాయని కైట్లిన్ మెక్నిల్ టింబర్లో పోస్ట్ చేసిన పోస్టు పెద్ద దుమారాన్నే లేపింది. ఉతికిన డ్రెస్ ఫోటో తీసి దీని రంగేంటో చెప్పాలంటే ఆమె చేసిన పోస్ట్ తో మహిళల దుస్తులు, వారి డ్రెస్సింగ్ అంశాలపై విపరీతంగా పోస్టులు, ట్వీట్లు వెల్లువెత్తాయి.

కెమెరాను చూసి గన్ అనుకొని ..!

కెమెరాను చూసి గన్ అనుకొని ..!

అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియా దుస్థితికి నిదర్శనం ఈ ఫొటో. ఓ ఫొటోగ్రాఫర్ ఈ చిన్నారి ఫొటో తీస్తుండగా .. దానిని తుపాకీగా భ్రమించిన ఆ పాప కళ్లనీళ్లు పెట్టుకుంటూ చేతులు పైకి ఎత్తడం అక్కడి హృదయవిదారకమైన పరిస్థితిని కళ్లకు కట్టింది. ఈ ఫొటోను జర్నలిస్టు నదియా అబుషబాన్ మొదట ట్వీట్ చేశారు. ఈ ఫొటో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కదిలించింది.

పిల్లి మెట్లు ఎక్కుతుందా? దిగుతుందా?

పిల్లి మెట్లు ఎక్కుతుందా? దిగుతుందా?

ఈ ఫొటోను చూసిన ప్రతి ఒక్కరికీ కలిగిన అనుమానం ఇదే. ఫొటోను నిశితంగా పరిశీలించి చూసి కూడా చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానించారు. కొందరు పిల్లి మెట్లు వెనుకగా దిగుతుందని అంటే మరికొందరు కాదు పిల్లి మెట్లు ఎక్కుతుందని ఆన్ లైన్ లో చర్చోపచర్చలు చేశారు. దీంతో 'ద డ్రెస్' హ్యాష్ టాగ్ లాగే ఈ మార్జాలం చిత్రం కూడా హల్ చల్ చేసింది.

బ్రూస్ జెన్నర్ తాను ట్రాన్ జెండర్

బ్రూస్ జెన్నర్ తాను ట్రాన్ జెండర్

అమెరికా ఒలింపియన్ చాంపియన్ అయిన బ్రూస్ జెన్నర్ తాను ట్రాన్ జెండర్ అంటూ ప్రపంచానికి వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా తనను అందరూ కైట్లిన్ బ్రూస్ గా పిలవాలంటూ తన కొత్త పేరును తెలిపాడు. ట్విట్టర్లో అతి తక్కువకాలంలో మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న వ్యక్తిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రికార్డును తను అధిగమించింది.

కేఎఫ్‌సీ‌లో ఎలుక పడిందా ..?

కేఎఫ్‌సీ‌లో ఎలుక పడిందా ..?

ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ ఎలుక ఇది. ప్రముఖ కేఎఫ్‌సీ దుకాణంలో కొనుగోలు చేసిన ఆహారంలో ఈ ఎలుక వచ్చిందంటూ గత జూన్లో ఫేస్బుక్లో పోస్టయింది. పోస్టయిన వెంటనే వైరల్గా మారింది. ఇది బూటకపు ఫొటో అని కేఎఫ్సీ తర్వాత ప్రకటించినా .. అప్పటికే అది ప్రపంచమంతా చుట్టేసింది.

చీకటి వెలుగుల్లో చదువులు

చీకటి వెలుగుల్లో చదువులు

రాత్రి అయింది. చుట్టూ నిర్మానుష్యం. దూరంగా మెక్డొనాల్డ్ దుకాణానికి ఉన్న బోర్డు లైట్ స్వల్పంగా కాంతి వెదజల్లుతోంది. ఆ కాంతిలో ఇదిగో ఇలా ఫిలిప్పీన్స్కు చెందిన ఈ చిన్నారి చదుకుంటున్న ఫొటో ప్రపంచాన్ని కదిలించేలా చేసింది. గత జూలైలో ఈ ఫోట్ ఆన్లైన్లో వైరల్గా మారింది.

అణుక్షణం వెంటాడే విషాదం

అణుక్షణం వెంటాడే విషాదం

మూడేళ్ల పసిబాలుడు అయ్లార్ కుర్దీ విగతజీవుడై ఇదిగో ఇలా టర్కీ తీరానికి కొట్టుకొచ్చాడు. యుద్ధ కల్లోల సిరియా నుంచి శరణార్థిగా తండ్రి వెంట పశ్చిమ దేశాలకు వలసపోతూ .. మార్గమధ్యంలో తమ పడవ మునిగిపోవడంతో ఆ చిన్నారి ఇలా కెరటాలతోపాటు నిర్జీవంగా తీరానికి కొట్టుకొచ్చాడు. ఈ ఫొటో నెటిజన్ల గుండెల్ని పిండేసింది. 

లేడి కెమెరామెన్ అత్యుత్సాహం

లేడి కెమెరామెన్ అత్యుత్సాహం

శరణార్థులపట్ల ఓ హంగేరియన్ లేడీ కెమెరామెన్ చేసిన దుస్సాహసం ఇది. సెర్బియా సరిహద్దు గుండా హంగేరిలో అడుగుపెడుతున్న ఓ శరణార్థి పోలీసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తుండగా ఓ హంగేరి ఫొటో గ్రాఫర్ ఇలా కాలు అడ్డంపెట్టి అతడిని పడేసింది. దీనిపై పలువురు పెదవివిరిచారు. ఈ ఘటన ఆ లేడీ ఫొటోగ్రాఫర్ ఉద్యోగానికే ఎసరు పెట్టింది కూడా.

రాదేమాలో కనిపించని కోణాలు

రాదేమాలో కనిపించని కోణాలు

వివాదాస్పద ఆద్మాత్మిక గురువు రాదేమాలో రెండు కోణాలు ఉన్నాయని చెప్పేందుకు ఈ ఫొటో ఓ సజీవ సాక్ష్యం. ఇంటర్నెట్లో ఈ ఫొటో చేసిన సంచలనం అంతా ఇంతాకాదు. ఓపక్క నిండైన వస్త్రాలు, దైవమాలలు మెడలో ధరించి నలుగురిని దీవించే దైవమాతగా కనిపిస్తుండగా మరో ఫొటోలో అసభ్యకరంగా స్కర్ట్ వేసుకొని చక్కగా హిందీ పాటలకు అదిరిపోయే స్టెప్పులు కూడా వేసి వివాస్పదంగా నిలిచింది.

మోడీ ఫోటోకి మార్పులు

మోడీ ఫోటోకి మార్పులు

ఈ ఫొటో చెన్నై వరదల సమయంలోనిది. చెన్నై వరదల్లో చిక్కుకున్నప్పుడు భారత ప్రధాని నరేంద్రమోదీ అక్కడ ఏరియల్ సర్వే నిర్శహించారు. కానీ, ఆ సమయంలో నీట మునిగిన ప్రాంతాలు అతి సమీపం నుంచి మోదీ చూసినట్లుగా మభ్యపెడుతూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ ఫొటో మార్పింగ్ చేసి పబ్లిష్ చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగగా, పీఐబీ అందరికీ క్షమాపణలు తెలిపింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write Images that went viral in 2015
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X