ఏడాదికి 16 సినిమాలు: ఆస్కార్ అవార్డ్ వేటలో అమెజాన్

Written By:

ఆన్‌లైన్ మార్కెట్‌లో దూసుకుపోతున్న అమెజాన్ ఇప్పుడు సినిమా ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఆన్‌లైన్ వ్యాపార రంగంలోనే ఆరవస్థానాన్ని ఆక్రమించిన ఈ దిగ్గజం ఇప్పుడు సినిమా ప్రపంచంలోకి అడుగుపెడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కామెడీ టీవీ సీరీస్ రంగంలో గట్టి పోటీనిస్తున్న అమెజాన్ ఇప్పుడు సినిమా ప్రపంచంలో అడుగుపెడితే అనేక సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read more: ఆన్‌లైన్ డేటింగ్‌‌లో అంతా మోసమేనట

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీస్తామని

ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీస్తామని

కొత్తగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నామని, ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీస్తామని, ఆస్కార్ అవార్డును సాధించడం తమ లక్ష్యమని ఆన్లైన్ వ్యాపారంలో దూసుకుపోతున్న ప్రపంచ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ జర్మనీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అమెజాన్ ఈ ఏడాది ఐదు ఎమ్మీ అవార్డులు

అమెజాన్ ఈ ఏడాది ఐదు ఎమ్మీ అవార్డులు

కామెడీ టీవీ సిరిస్ ద్వారా అమెజాన్ ఈ ఏడాది ఐదు ఎమ్మీ అవార్డులు దక్కించుకున్న విషయం తెల్సిందే.

ఆస్కార్ అవార్డుల విషయంలో తన పోటీదారు 'నెట్‌ఫిక్స్ 'కన్నా

ఆస్కార్ అవార్డుల విషయంలో తన పోటీదారు 'నెట్‌ఫిక్స్ 'కన్నా

ఇక ఆస్కార్ అవార్డుల విషయంలో తన పోటీదారు 'నెట్‌ఫిక్స్ 'కన్నా ముందుంటారా, లేదా? అన్నది కాలమే చెప్పాలి. ఎందుకంటే, నెట్‌ఫిక్స్ తీసిన 'బీస్ట్స్ ఆఫ్ నో నేషన్' ఇప్పటికీ ఆస్కార్ బరిలో పోటీ పడుతున్నది.

తాము తీసిన సినిమాలను వెంటనే ఆన్‌లైన్ లో పెడతామని

తాము తీసిన సినిమాలను వెంటనే ఆన్‌లైన్ లో పెడతామని

సినిమా డీవీడీల కోసం, ఆన్లైన్ రిలీజ్ కోసం మూడు నెలలపాటు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా తాము తీసిన సినిమాలను వెంటనే ఆన్‌లైన్ లో పెడతామని జర్మనీ పత్రిక 'డై వెల్ట్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెఫ్ వెల్లడించారు.

గతేడాది నెట్‌ఫిక్స్ కు ఎమ్మీ అవార్డుల్లో 31 నామినేషన్లు

గతేడాది నెట్‌ఫిక్స్ కు ఎమ్మీ అవార్డుల్లో 31 నామినేషన్లు

గతేడాది నెట్‌ఫిక్స్ కు ఎమ్మీ అవార్డుల్లో 31 నామినేషన్లు లభించగా, అమెజాన్ కు ఒక్క నామినేషన్ కూడా లభించలేదు.

ఈ ఏడాది అలాకాకుండా 12 నామినేషన్లు సాధించి

ఈ ఏడాది అలాకాకుండా 12 నామినేషన్లు సాధించి

అయితే ఈ ఏడాది అలాకాకుండా 12 నామినేషన్లు సాధించి ఐదు అవార్డులు గెలుచుకొంది. నెట్ఫిక్స్ 34 నామినేషన్లు సాధించినప్పటికీ నాలుగు అవార్డులు మాత్రమే దక్కించుకొంది.

1994 లో స్థాపించిన అమెజాన్ తొలుత

1994 లో స్థాపించిన అమెజాన్ తొలుత

1994 లో స్థాపించిన అమెజాన్ తొలుత ఆన్ లైన్ పుస్తకాల విక్రయం ద్వారా వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. అనతికాలంలోనే ఈ-పుస్తకాల ద్వారా తన పాపులారిటీని పెంచుకొంది.

వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా

వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా

వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కొద్దికాలంలోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొంది. ప్రాపర్టీలో పెట్టుబడులు పెట్టిన అమెజాన్ 'వాషింఘ్టన్ పోస్ట్' మీడియా సంస్థలో కూడా పెట్టుబడులు పెట్టింది.

ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ బ్రాడ్ క్యాస్టింగ్ హక్కులను

ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ బ్రాడ్ క్యాస్టింగ్ హక్కులను

ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ బ్రాడ్ క్యాస్టింగ్ హక్కులను కొనే అంశాన్ని కూడా పరిశీస్తోంది. డ్రోన్ల ద్వారా ప్యాకేజీలను డెలివరీ చేయాలని నిర్ణయించినట్టుగా ఇదివరకే ప్రకటించిన విషయం తెల్సిందే.

డ్రోన్ల కోసం శాటిలైట్ నావిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ను

డ్రోన్ల కోసం శాటిలైట్ నావిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ను

డ్రోన్ల కోసం శాటిలైట్ నావిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ను కూడా ఉపయేగిస్తామని కూడా జెఫ్ తెలిపారు. అయితే ఏవియేషన్ అథారిటీ అనుమతి ఇంకా లభించాల్సి ఉంది. 

ముందు ముందు అమెజాన్ లో రిలీజయిన కొత్త సినిమాలను

ముందు ముందు అమెజాన్ లో రిలీజయిన కొత్త సినిమాలను

సో ముందు ముందు అమెజాన్ లో రిలీజయిన కొత్త సినిమాలను వెంటనే కొనుక్కోవచ్చు.. మరి ఎంత త్వరగా అడుగుపెడిత అంత త్వరగా అందరూ కొత్త సినిమాలను ధియేటర్లలో కన్నా ఇక్కడే చూడొచ్చన్నమాట.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Jeff Bezos I want Amazon to win an Oscar
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot