21వ శతాబ్దాన్ని నడిపించే ఆవిష్కరణలు

Written By:

రోజు రోజుకు టెక్నాలజీ ముందుకు దూసుకుపోతోంది. 21వ శతాబ్దం కూడా దూసుకొస్తోంది. అయితే టెక్నాలజీ మరింతగా ముందుకు సాగుతుందంటే దానికి కారణం కాలానుగుణంగా ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు కనిపెట్టడమే..ఒకవేళ ఈ ఆవిష్కరణలు కనిపెట్టకపోతే 21 శతాబ్దం ఎలా ఉండేది తలుచుకుంటేనే ఊహకు అందనిది. వీటిని చూస్తే మీరే చెబుతారు..అవును నిజమే ఇవి లేకుంటే 21వ శతాబ్దం ఎలా ఉండేదోనని..మరి 21వ శతాబ్దానికి నాంది పలికిన ఆ ఆవిష్కరణలేంటో చూద్దాం.

Read more : ప్రపంచాన్ని షాక్‌‌లో ముంచిన వైపరీత్యాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐపాడ్ 2001

ఆపిల్ ఐ పాడ్ రాకముందే చాలానే ఎంపీ 3 ప్లేయర్లు ఉన్నాయి. కాని ఎప్పుడయితే ఐ ప్యాడ్ రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి టెక్నాలజీయే మారిపోయింది. ఇంటర్నెల్ స్టోరేజి చాలా ఎక్కువ ఇవ్వడం అలాగే అన్ని సదుపాయాలు ఇందులో ఉండటంతో మిగతావన్ని ఆపిల్ ఐ పాడ్ దెబ్బకు కుదేలయ్యాయి.

మొజిల్లా ఫైర్ పోక్స్ 0220

మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోర్ తర్వాత వచ్చిన మొట్టమొదటి బ్రౌజర్ మొజిల్లా ఫైర్ పోక్స్.ఇది వచ్చిన తరువాత నెట్ స్కేప్ నావిగేటర్ మొత్తానికే తుడిచిపెట్టుకుపోయింది.ఇది చాలా త్వరగానూ అలాగే ఫ్రీగానూ ఓపెన్ అవుతోంది. అయితే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వచ్చిన తరువాత దీని ప్రాధాన్యత తగ్గిపోయింది. కాని ఎప్పటికే ఇదే రారాజు

స్కైప్ 2003

వివిధ దేశాలలో ఉన్నవారితో డైరెక్ట్ గా మాట్లాడగలిగే ఛాన్స్ స్కైప్ సొంతం. నెట్ ఉంటే చాలు వారు మన దగ్గరున్నట్లే మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈ స్కైప్ డెస్క్ టాప్ లకు మాత్రమే లభ్యమవుతుండటం కొంచెం విచారించదగ్గదే.ఎంతో మంది ఈ స్కైప్ ద్వారానే తమ రాయాబారాలు పంపుతుంటారు.

ఫేస్ బుక్ 2004

ఫేస్ బుక్ మొట్ట మొదటి సోషల్ నెట్ వర్క్ కానే కాదు.అయితే ఇది ప్రారంభించిన కొద్ది కాలంలోనే సోషల్ మీడియాలో దూసుకుపోయింది. ఇప్పుడు దాదాపు 1.3 బిలియన్ల మంది యూజర్స్ ఉన్నారు. ఇంతకు ముందు ఆర్కుట్ వచ్చినా అది అంతగా దూసుకుపోలేదు.

యూ ట్యూబ్ 2005

మాజీ పే పాల్ ఉద్యోగులు దీన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ వీడియో షేరింగ్ వెబ్ సైట్ గా నిలిచింది. ఎందరో ఈ యూ ట్యూబ్ ద్వారా తమ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందులో అన్ని రకాలకు సంబధించిన వీడియోస్ అప్ లోడ్ చేయవచ్చు. అలాగే ఆదాయం పొందవచ్చు.

నిటెండో వి 2006

ఈ గేమ్ రాక ముందు సోని ప్లే స్టేషన్ కి మైక్రోసాప్ట్ బాక్స్ కు మధ్య వార్ నడించింది. ఈ గేమ్ రాకతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అన్ని రకాల గేమ్స్ ఒకే సారి సోషల్ మీడియాలోకి దూసుకువచ్చాయి. ఈ గేమ్ రాకతో గేమ్ ని మనం రియల్ గానే ఆడుతున్నామన్న ఫీలింగ్ కలిగింది చాలా మందికి.

ఆపిల్ ఐ ఫోన్ 2005

స్మార్ట్ ఫోన్ రంగంలో ఫస్ట్ టచ్ స్క్రీన్ ఫోన్ ఏదంటే అది ఆపిల్ ఐ పోన్ అనే చెప్పాలి. ఐ ఫోన్ ఒక్కసారిగా మార్కెట్ ను షేక్ చేసింది.ఆ తరువాత అనేక రకాల ఫోన్లు టచ్ స్క్రీన్లతో అలరించాయి. కాని ఆపిల్ స్థానం ఎప్పటికీ మారలేదు.

బిబిసి ప్లేయర్ 2007

బిబిసి ప్లేయర్ రాకతో ఒక్కసారిగా ఇంటర్నెట్ టీవీ సీరిస్ లో ట్రెండ్ మొదలైంది. ఇది విడుదలయిన అనతి కాలంలోనే ప్రజలకు చాలా దగ్గరయింది.

అమెజాన్ కిండెల్ 2007

మార్కెట్లో ఫస్ట్ రీడర్ ఏది అంటే ఎవరైనా అమెజాన్ కిండెల్ నే చెబుతారు.ఇది 2007లో మార్కెట్లోకి ఎంటర్ అయింది. ఆన్ లైన్ బుక్ స్టోర్ లో ఓ ప్రభంజనం దీని ద్వారానే మొదలైంది అని చెప్పాలి

గూగుల్ ఆండ్రాయిడ్ 2008

ఆపిల్ ఫోన్ సంచలనంతో దూసుకువచ్చినా కాని అది ఐవోఎస్ కే పరిమితం కావడంతో ఎక్కడో ఏదో తెలియని వెలితి ఉండేది. ఆ వెలితిని ఈ గూగుల్ ఆండ్రాయిడ్ తీర్చిందనే చెప్పాలి. అయితే ఆండ్రాయిడ్ ని క్రియేట్ చేసిందో ఎందుకో తెలుసా ఓఎస్ కెమెరా కోసం దాన్ని గూగుల్ 2005లో కొనుగోలు చేసింది. అదే విధంగా 2008లో మొబైల్ ని లాంచ్ చేసింది.కాని ఇప్పుడు అన్ని కంపెనీలు ఈ ఆండ్రాయిడ్ ఫ్లాట్ పాం మీదనే తమ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి.

స్పాటిఫై 2008

మ్యూజిక్ మీద దూసుకొచ్చిన ఈ స్పాటిఫై ెంత వేగంగా వచ్చిందో అంత వేగంగా పాపులర్ అయింది. ఎటువంటి పైరసీ సమస్యలు లేకుండా నచ్చిన మ్యూజిక్ ను ఎంజాయ్ చేయవచ్చు.ప్రస్తుతం దీనికి 75 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.అలాగే 20 మిలియన్ల మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు.

4జీ 2008

అంతా రామమయం జగమంతా 4జీ మయం ఇది నేటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ చూసినా 4జీ మీదనే నడుస్తోంది. అది పూర్తి స్థాయిలో వస్తే ఇక ప్రపంచమే మారిపోతుంది మరి.

ఆపిల్ ఐ పాడ్ 2010

ట్యాబ్లెట్ పీసీ ఆపిల్ 2010లో లాంచ్ చేసింది. స్మార్ట్ ల్యాప్ టాప్ లాగా దీన్ని వాడుకోవచ్చని ఆపిల్ నిరూపించింది. పబ్లిక్ కు ఏం కావాలో పసిగట్టే ఆపిల్ తన మాయతో ఈ బుల్లి తెర ట్యాబ్లెట్ ను సృష్టించింది. దీని రాకతో మిగతా కంపెనీలు కూడా దీనిపై పడ్డాయి. అవి ఆండ్రాయిడ్ యాప్ తో అనేక రకాల ట్యాబ్లెట్లను రూపొందించాయి. అయినప్పటికీ ఆపిల్ స్టానం చెక్కు చెదరలేదు.

నిస్సాన్ లీప్ 2010

ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఇది. దీని గ్లోబల్ సేల్స్ ప్రపంచ దేశాల్లో దాదాపు 1,70,000 యూనిట్లు. మొత్తం 35 దేశాల్లో ఈ కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ కారుతో పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని వారు చెబుతున్నారు.

ఐబిఎమ్ వాట్సన్ 2011

ఇది ఒక సాధారణమైన ఇంటిలిజెంట్ కంప్యూటరింగ్ సిస్టం. దీనిలో ప్రశ్నలు దానికి సంబంధించిన జవాబులు అన్ని లాంగ్వేజ్ లో ఉంటాయి.దీన్ని 2011లో కనుగొన్నారు. కృత్రిమ మేధస్సును పెంపొందించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మెక్రోసాప్ట్ కినెక్ట్ అలాగే ఆపిల్ సిరి లాగే అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది.

గూగుల్ డ్రైవ్ లెస్ కారు 2014

డ్రైవర్ లేకుండా కారు తోలడమా అని ఆశ్చర్యపోకండి. గూగుల్ ఈ పని గతేడాది చేసింది. డ్రైవర్ లేకుండా మిమ్మల్ని ఇంటికి చేర్చే పనికి గూగుల్ శ్రీకారం చుట్టింది. ఇది 2017 కల్లా రోడ్ల మీద పరుగులు పెట్టేందేకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన అన్ని రకాల టెస్ట్ లు కూడా ఇది పూర్తి చేసింది.

 

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Most important inventions of the 21st Century in pictures
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot