విండోస్ 10 ముఖ్యమైన అప్‌డేట్స్

Posted By:

విండోస్ 10 అధికారికంగా విడుదలైంది. ఇప్పటివరకు విడుదలైన విండోస్ ఆపరేటింగ్ వర్షన్‌లలో విండోస్ 10 మైక్రోసాఫ్ట్ ప్రీమియర్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌గా నిలిచింది. విండోస్ 8, విండోస్ 8.1 వర్షన్‌లకు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విడుదలైన విండోస్ 10 సరికొత్త అప్‌డేట్స్‌తో అలరిస్తోంది. విండోస్ 10లోని 9 ముఖ్యమైన అప్‌డేట్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More: విండోస్ 10ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవటం ఏలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిఫ్రెష్ చేయబడిన యూజర్ ఇంటర్‌ఫేస్

విండోస్ 10 సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ తో లభ్యమవుతోంది. ఈ ఇంటర్‌ఫేస్  టచ్‌స్ర్కీన్ డివైస్‌లతో పాటు కంప్యూటర్లను సౌకర్యవంతంగా మేనేజ్ చేస్తుంది.

 

సరికొత్త స్మార్ట్ మెనూ

విండోస్ 8లో కనుమరుగైన స్టార్ట్ మెనూ ఇప్పుడు విండోస్ 10లో మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.

కార్టోనా

విండోస్ 10లో స్టార్ట్ మెనూతో పాటు పర్సనల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కార్టోనాను మైక్రోసాఫ్ట్ పొందుపరిచింది. గూగుల్ నౌ, సిరి తరహాలోనే కార్టోనా పనిచేస్తుంది.

 

సరికొత్త యాప్స్

సరికొత్త మెయిల్, క్యాలెండర్స్, ఫోటో, మ్యాప్స్

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్

మైక్రోసాఫ్ట్ తన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో ‘ఎడ్జ్' పేరుతో సరికొత్త వెబ్ బ్రౌజర్‌ను తీసుకువచ్చింది. ఈ బ్రౌజర్ మరింత వేగంగా పనిచేస్తుంది.

 

కాంటినమ్

విండోస్ 10, కాంటినమ్ పేరుతో విండోస్ 10 కాంటినమ్ పేరుతో సరికొత్త ఫీచర్ ను మైక్రోసాఫ్ట్ ప్రదర్శించింది. ఈ ఫీచర్ ద్వారా విండోస్ ఫోన్ ను విండోస్ 10 పీసీలా వాడుకోవచ్చు.

యాక్షన్ సెంటర్

యాక్షన్ సెంటర్

విండోస్ 10లో సరికొత్త యాక్షన్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. టాస్క్ బార్ పై ఐకాన్‌ను క్లిక్ చేయటం ద్వారా యాక్షన్ సెంటర్‌లోకి వెళ్లొచ్చు. ఈ యాక్షన్ సెంటర్ అప్లికేషన్‌లను ఆర్గనైజ్ చేస్తూ క్విక్ యాక్సెస్‌ను మీకు అందిస్తుంది.

 

ఎక్స్‌బాక్స్ స్ట్రీమింగ్ టు పీసీ

ఎక్స్‌బాక్స్ స్ట్రీమింగ్ టు పీసీ

విండోస్ 10 సరికొత్త ఎక్స్‌బాక్స్ యాప్‌తో లభ్యమవుతోంది. ఈ యాప్ ద్వారా గేమ్స్ ను ఎక్స్‌బాక్స్ కన్సోల్ నుంచి మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి స్ట్రీమ్ చేసుకోవచ్చు.

 

హల్లో, క్లీనర్ లాక్ స్ర్కీన్

హల్లో, క్లీనర్ లాక్ స్ర్కీన్

విండోస్ 10లో హల్లో పేరుతో సరికొత్త్ క్లీనర్ లాక్ స్ర్కీన్‌ను పొందుపరిచారు. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ రికగ్నిషన్ ఫీచర్ ద్వారా పాస్‌వర్డ్ టైప్ చేయకుండానే డివైస్‌లోకి లాగిన్ కావొచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Important Updates in Windows 10. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting