రానున్న కాలంలో చంద్రునిపైకి అస్తికలు

Posted By:

మనిషి చనిపోయాక ఎక్కడికి వెళతారు .స్వర్గానికి వెళతారా..లేక నరకానికి వెళతారా..ఎన్నో ప్రశ్నలు మరెన్నో అంతుచిక్కని సమాధానాలు...మనిషి మరణం తరువాత ఆ జీవం ఎక్కడికి వెళుతుందనే దానిపై ఇప్పటికే ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.అయితే ఇప్పుడు వీటిలో మరో కొత్త ప్రయోగం చేరింది. అది మనిషి మరణం తరువాత చంద్రునిపైకి వెళ్లే ప్రయోగం. అంతరిక్షాన్ని జల్లెడపడుతున్న నాసా మాజీ ఇంజీనీర్ మనిషి చనిపోయాక ఆ మనిషి అస్తికలను చంద్రునిపైకి పంపే ప్రయోగానికి శ్రీకారం చుట్టారట...వింతగా ఉంది కదా...న్యూస్ చూస్తే ఇంకా వింతగా ఉంటుంది.

Read more:చందమామ ఆ పక్క రహస్యం చైనా చేతిలో...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చంద్రుడి మీదకు

చంద్రుడి మీదకు

మనిషి చనిపోయాక స్వర్గానికి వెళతాడో లేక నరకానికి వెళతాడో తెలియదు కాని చంద్రుడి మీదకు మాత్రం వెళ్లొచ్చని చెబుతున్నారు అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కోకు చెందిన ఎలీజియం స్పేస్ నిర్వాహకులు.

12000 వేల డాలర్లు

12000 వేల డాలర్లు

దాదాపు 12000 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో 8 లక్షలు చెల్లిస్తే మనం మరణించిన తర్వాత మన అస్థికలను వాళ్లు చందమామ మీదకు తీసుకెళ్తారట.

నాసా మాజీ ఇంజనీర్ థామస్ సివీటి

నాసా మాజీ ఇంజనీర్ థామస్ సివీటి

ఈ కంపెనీనీ నాసా మాజీ ఇంజనీర్ థామస్ సివీటి స్థాపించారు.

గత నెల నుంచే ఈ సర్వీసు

గత నెల నుంచే ఈ సర్వీసు

2013లో ఈ కంపెనీని స్థాపించినప్పటికీ గత నెల నుంచే ఈ సర్వీసును ప్రారంభించామని ఆయన చెబుతున్నారు.

అంతరిక్షంలోకి పంపాలని ప్లాన్

అంతరిక్షంలోకి పంపాలని ప్లాన్

వాస్తవానికి ఎలీజియం కంపెనీ అస్తికలను అంతరిక్షంలోకి పంపాలని ప్లాన్ చేసుకుంది.

ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ కంపెనీతో ఒప్పందం

ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ కంపెనీతో ఒప్పందం

అయితే ఓ వినియోగదారుడు తన తల్లి అస్తికలను చందమామ మీదకు పంపాలని కోరడంతో ఈ దిశగా ఆలోచించడం మొదలు పెట్టింది కంపెనీ ఇందుకోసం ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

తొలి దశలో 100 మంది అస్తికలను..

తొలి దశలో 100 మంది అస్తికలను..

అందులో ఈ అస్తికలను పంపుతారన్నమాట. ఇప్పటికే బుకింగ్ కూడా మొదలైంది. తొలి దశలో 100 మంది అస్తికలను పంపుతామని ఎలీజియం స్పేస్ కంపెనీ చెబుతోంది. ఇది 2017న చందమామ పైకి వెళ్లే అవకాశం ఉందని కంపెనీ యాజమాన్యం తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write In Case You Miss Heaven, You Can Rest In Peace On The Moon For $12,000
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting