సముద్రాన్నిపోటెత్తించనున్న నెత్తుటి చంద్రుడు

|

ఖగోళంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడు భూమికి అతి సమీపానికి రావడంతో సోమవారం తెల్లవారు జామున సూపర్‌ మూన్‌ ఏర్పడింది. ఈ నెల 14న ఒకసారి చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చాడు. భూమికీ, సూర్యుడికి మధ్య దూరం 4,06,464 కిలోమీటర్లు. అయితే సూపర్‌ మూన్‌ రోజు ఈ వ్యత్యాసం 3,56,877 కిలోమీటర్లకు తగ్గుతుంది. ఇప్పటికే దీనిపై అంతర్జాతీయ స్థాయిలో ఖగోళ శాస్త్ర నిపుణులు అనేక అధ్యయనాలు నిర్వహించారు.అయితే ఇప్పుడు ఈ సూపర్ మూన్ అందర్నీ కనువిందు చేసినా కాని నెత్తుటి చంద్రుడు నుంచి పెను ఉపద్రవం ముంచుకొస్తోందని ఇన్ కాయిస్ చెబుతోంది. సముద్రాలు పోటెత్తుతాయని..5 అడుగుల మేర ఎగసి పడతాయని చెబుతోంది. మిగితా కథనం కింది స్లైడర్ లో చదవండి.

 

Read more:ఇండియాకు షాకిచ్చిన రుధిర చంద్రుడు

కల్లోలంగా సముద్రం

కల్లోలంగా సముద్రం

భూమికి చంద్రుడు అతి సమీపంగా రావడంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, అక్టోబర్‌ 2 వరకూ తీరప్రాంతాల్లోని ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌(ఇన్‌కాయిస్‌) హెచ్చరించింది. సోమవారం పౌర్ణమి కూడా కావడంతో సముద్రంలో తీవ్ర పోటు ఏర్పడనుందని తెలిపింది.

అనేకచోట్ల ఆటుపోట్లు

అనేకచోట్ల ఆటుపోట్లు

సూపర్‌మూన్‌ వల్ల భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో అనేకచోట్ల ఆటుపోట్లు సంభవించనున్నాయి. దీనివల్ల 28వ తేదీ నుంచి 30 వరకూ సుమారు ఐదడుగుల ఎత్తులో అలలు రావొచ్చని ఇన్‌కాయిస్‌ తెలిపింది.

లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి
 

లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి

దీంతో సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుందని, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని హెచ్చరించింది. తూర్పు తీరంలోని పశ్చిమబెంగాల్‌లో సుందరబన్స్‌ నుంచి విశాఖ వరకూ, అండమాన్‌ దీవుల్లో, కేరళలో దక్షిణ కొచ్చి, అలెప్పీ, కొల్లాం, కన్నూర్‌, తిరువనంతపురం, లక్షద్వీప్ లో ఈ ప్రభావం ఉంటుంది.

అలలు మీటరు నుంచి రెండుమీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయి

అలలు మీటరు నుంచి రెండుమీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయి

సముద్రంలో నదులు కలిసే నీటిప్రవాహాల వేగం పెరుగుతుందని ఆంధ్ర వర్సిటీలోని అధ్యయన కేంద్రం హెచ్చరించింది. అలల తాకిడి సాధారణం కన్నా 15 సెకన్లు అదనంగా ఉంటుందని, దీంతో అలలు మీటరు నుంచి రెండుమీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య పి.రామారావు తెలిపారు.

విశాఖపట్నం'కు మరో ముప్పు

విశాఖపట్నం'కు మరో ముప్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుందర నగరంగానే పేరుగాంచిన ‘విశాఖపట్నం'కు మరో ముప్పు పొంచి వున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ‘హుధుద్' తుఫాను ఈ నగరాన్ని నేలమట్టం చేసిన విషయం తెలిసిందే! అయితే నవ్యాంధ్ర బిజినెస్ కేపిటల్ గా ఎదుగుతున్న ఆ నగరానికి మరో ముప్పు పొంచి ఉందని చెబుతోంది సర్కారీ వాతావరణ సంస్థ ‘ఇన్ కాయిస్'. మరోసారి ప్రకృతి ప్రకోపానికి విశాక నగరం బలికాక తప్పదని ఆ సంస్థ వెల్లడిస్తోంది. ఇందుకు కారణం ‘సూపర్ మూన్' ప్రభావమని చెబుతున్నారు.

గతంలో ఎన్నోసార్లు భూమికి చేరువగా చంద్రుడు

గతంలో ఎన్నోసార్లు భూమికి చేరువగా చంద్రుడు

గతంలో ఎన్నోసార్లు భూమికి చేరువగా చంద్రుడు వచ్చాడు. అలా వచ్చిన ప్రతీసారి ప్రకృతిలో మార్పులు ఏర్పడి, ఎక్కడో ఓ చోట విషాధ ఘటన చోటు చేసుకోవడం జరిగిందని శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు మరోసారి భూమికి చేరువగా చంద్రుడు వస్తున్నాడు. సూపర్ మూన్ గా పిలుస్తున్న ఈ ఉపద్రవం.. బంగాళాఖాతంలోనే కాక భూమండంలోని సముద్రాలపై పెను ప్రభావాన్నే సృష్టించనుందట.

వచ్చే నెల 2 వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

వచ్చే నెల 2 వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

సూపర్ మూన్ ప్రభావం కారణంగా సముద్రంలో అలలు ఐదు అడుగుల మేర ఎగసిపడతాయని ‘ఇన్ కాయిస్' సంస్థ చెబుతోంది. దీంతో సముద్రంలో అల్లకల్లోలం తప్పనిసరి అని హెచ్చరిస్తోంది. ఈ అలల కారణంగా తీర ప్రాంతాలకు ముప్పు ఉందని చెప్పిన ఆ సంస్థ... విశాఖతోపాటు అండమాన్, కేరళలకూ ప్రమాదం పొంచి ఉందని చెబుతోంది. వచ్చే నెల 2 వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నెల 14న భూమికి దగ్గరగా వచ్చిన చంద్రుడు మరోమారు దగ్గరగా..

ఈ నెల 14న భూమికి దగ్గరగా వచ్చిన చంద్రుడు మరోమారు దగ్గరగా..

భూమికి.. చంద్రుడికి మధ్యనున్న దూరం భారీగా తగ్గే సందర్భంగా భారీగా కనిపించే చంద్రుడ్ని.. సూపర్ మూన్ అని వ్యవహరిస్తుంటారు. అలాంటి అరుదైన విశేషం తాజాగా చోటు చేసుకుంది. ఈ నెల 14న భూమికి దగ్గరగా వచ్చిన చంద్రుడు మరోమారు దగ్గరగా వచ్చారు. సాధారణంగా భూమికి.. చంద్రుడికి మధ్యన ఉండే దూరం.. ఈ సూపర్ మూన్ సందర్భాల్లో దాదాపుగా 50వేల కిలోమీటర్లు తగ్గిపోతుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. 49587 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

ఈ నెల 28 నుంచి 30 వరకు సముద్రంలో మార్పులు

ఈ నెల 28 నుంచి 30 వరకు సముద్రంలో మార్పులు

ఇలా తగ్గిన సందర్భాల్లో చంద్రుడు మరింత పెద్దగా కనిపించటం జరుగుతుంది. దీంతో పాటు ఇంకే జరుగుతాయని చూసినప్పుడు.. చాలానే మార్పులు ఉంటాయి. భూమికి చంద్రుడు అతి సమీపంలోకి వచ్చిన సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం.. తీవ్ర పోటు ఏర్పడటం లాంటివి చోటు చేసుకుంటాయి. దీంతో.. ఈ నెల 28 నుంచి 30 వరకు సముద్రంలో మార్పులు ఎక్కువగా ఉంటాయి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write Incois Reports Says Supermoon May Effect On Coastal Area

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X