ఇండియాకు షాకిచ్చిన రుధిర చంద్రుడు

Posted By:

ఖగోళంలో జరిగే కంటికి కనిపించే మహాధ్బుతాల్లో ఒకటి మరో మూడు రోజుల్లో కనువిందు చేయనుంది.అదే రుధిర చంద్రుడు..క్లుప్తంగా చెప్పాలంటే బ్లడ్ మూన్..అంటే మీకు తెలుసుగా భూమికి,చంద్రుడికి మధ్య దూరం తగ్గినప్పుడు చంద్రుడు మరింత పెద్దగా కనిపిస్తాడని ఈ చంద్రుడిని సూపర్ మూన్ అని అంటారు. సూపర్ మూన్ ఉన్న సమయంలో గ్రహణం వస్తే దానిని బ్లడ్ మూన్ గా పిలుస్తారు. గత 33 ఏళ్లలో ఇలా ఎన్నడూ జరగలేదు. అలాగే మరో 18 ఏళ్లు ఈ అరుదైన సంఘటన కంటికి కనపడదు. ఈ నెల 28న ఆకాశంలో అ అరుదైన చంద్రగ్రహణం సంభవించనుంది. దీన్ని వీక్షించేందుకు శాస్ర్తజ్ఙులు, రీసెర్చర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మనకీ ఆ అదృష్టం లేదని నాసా చెబుతోంది అదెలాగో మీరే చూడండి.

Read more:30 ఏళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాతావరణం అనుకూలిస్తే..

స్కై అండ్ టెలిస్కోప్ కథనం ప్రకారం వాతావరణం అనుకూలిస్తే ఉత్తర అమెరికాలోని తూర్పు ప్రాంత ప్రజలు ఈ చంద్రగ్రహణం మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేదాకా అన్ని దశలను చూడగలుగుతారు.

సూపర్ మూన్

ఈ సమయంలో చంద్రుడు మాములు సమయంలో ఉండే సైజు కన్నా 14 శాతం పెద్దగా ఉంటాడని అందుకే దీన్ని సూపర్ మూన్ గా పిలుస్తారని ఆ పత్రిక తెలిపింది.

1982లో సూపర్ మూన్, చంద్రగ్రహణం ఒకేసారి

ఇక ప్రపంచ వ్యాప్తంగా 1982లో సూపర్ మూన్, చంద్రగ్రహణం ఒకేసారి ఏర్పడ్డాయి. తర్వాత మళ్లీ 2015 సెప్టెంబర్ 27న ఇలా కనిపించబోతోంది.

2033లో అరుదైన సంపూర్ణ గ్రహణం

2033లో అరుదైన సంపూర్ణ గ్రహణం ఏర్పడనుంది. ఇది ఖగోళంలో సంభవించే అరుదైన చంద్రగ్రహణాల్లో ఒకటి.చంద్రుడికి ,సూర్యుడికి మధ్యగా బూమి వచ్చినప్పుడు ఏర్పడేదే చంద్రగ్రహణమని అందరికీ తెలుసు.

భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేస్తుంది.

కానీ ఈ ఆదివారం సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేస్తుంది.

జాబిల్లి నారింజరంగులో మెరిసిపోతూ..

అయినా కొంత సూర్యకాంతి చంద్రుడిపై పడుతూ ఉండటంతో అప్పుడు జాబిల్లి నారింజరంగులో మెరిసిపోతూ అబ్బురంగా కనిపించనుంది. అందుకే శాస్ర్తజ్ఙులు దీన్ని రుధిర చంద్రుడు అంటున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం

ఉత్తర అమెరికాలోని తూర్పు ప్రాంత ప్రజలు ఈ చంద్రగ్రహణాన్ని పూర్తిగా చూడగలుగుతారు. ఉత్తర,దక్షిణ అమెరికాలు ఐరోపా,ఆఫ్రికా ఖండాలు పశ్చిమాసియా ,తూర్పు ఫసిఫిక్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని నాసా చెబుతోంది.

ఆసియా,ఆస్ట్రేలియా ఖండాల్లో ఇది కనిపించదని నాసా చెబుతోంది

అదే సమయంలో భారత ఉపఖండం సహా మిగతా ఆసియా,ఆస్ట్రేలియా ఖండాల్లో ఇది కనిపించదని నాసా చెబుతోంది. భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం ఈ గ్రహణం సంభవిస్తుంది ఆ టైంలో చంద్రుడు కూడా పెద్దగా కనిపిస్తాడు.

భారతదేశంలో సూర్యోదయం అయిపోతుంది

అయితే అప్పటికే భారతదేశంలో సూర్యోదయం అయిపోతుంది కాబట్టి చంద్రుడు కనిపించడు.ఈస్ట్రన్ డై లైట్ టైమ్ ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల సమయం కాబట్టి అప్పుడు పాశ్చాత్య దేశాల్లో చంద్రుడు కనిపిస్తాడు.

గంటా 12 నిమిషాలు

భారత కాలమానం ప్రకారం ఇది సోమవారం ఉదయం 7.40 నిమిషాలకు ప్రారంభమై గంటా 12 నిమిషాలు కొనసాగి 8.52 వరకూ ఉంటుంది. అంటే మనం బ్లడ్ మూన్ ను చూసే అవకాశాలు లేవన్నమాట.

దాని ప్రభావం ద్వాదశ రాశులపై

72 నిమిషాల పాటు జరిగి ఈ అధ్బుతం భారతదేశంలో కనపడకపోయినా దాని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఉత్తరాభాద్ర నక్షత్ర మీనరాశిలో కేతు గ్రహం సంచరిస్తున్న వేళ చంద్రగ్రహణం సంభవిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం కనిపించకపోయినా మేషం నుంచి మీనం వరకూ అన్ని రాశులపైనా గ్రహణ ప్రభావం ఉంటుందని వారు చెబుతున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Sunday's lunar eclipse will also feature a 'Supermoon'
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot