భారత్ దెబ్బ..చైనా అబ్బ:15 ఏళ్ల నుంచి ఏడుస్తూనే ఉంది

Written By:

అవును మీరు విన్నది నిజమే..చైనా ఒక్క విషయంలో ఇంకా విజయం సాధించలేక ఏడుస్తూనే ఉంది.. అయితే ఆ విషయంలో ఇండియా రెండేళ్ల క్రితమే విజయం సాధించింది. ఇంతకీ ఆ విషయం ఏమిటి అనుకుంటున్నారా..అదేనండి ఓఎస్. సొంతంగా ఆపరేటింగ్ సిస్టంను తయారుచేసుకోవడం. ఇందులో భారత్ సొంతంగా ఇండస్ పేరుతో ఓఎస్ ను అభివృద్ధి చేసుకుంటే చైనా మాత్రం ఇప్పటికీ సొంతంగా ఓఎస్ ను రూపొందించుకోలేక ఏడుస్తూనే ఉంది. చైనా ఫెయిల్యూర్ ఇండియా విన్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

షాకింగ్ న్యూస్..శాంసంగ్ గెలాక్సీ నోట్ ఫోన్లు పేలిపోతున్నాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

గత 15 ఏళ్ల నుంచి సొంతంగా తనకంటూ ఆపరేటింగ్ సిస్టంను రూపొందించుకోలేక చైనా ఇప్పటికీ నానా తంటాలు పడుతూనే ఉంది. ఈ విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా చైనా విజయం సాధించనే లేదు.

#2

ఓఎస్ టెక్నాలజీ విషయంలో ఇతర దేశాల మీధ ఆధారపడకుండా తనకు తానుగా సొంతంగా ఓ ఫ్లాట్ పాంను తయారు చేసుకునేందుకు ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు ఏవీ విజయం సాధించలేదు..

#3

అయితే ఈ విషయంలో ఇండియా రెండేళ్ల క్రితమే విజయం సాధించింది. తనకంటూ ఓ సొంత ఓఎస్ ని రూపొందించుకుంది. దాని పేరే ఇండస్..ఇది రెండేళ్ల క్రితమే ఇండియా అమ్ములపొదినుంచి ఊపిరిపోసుకుంది.

#4

ఇప్పుడు భారత్లో మొబైల్ ఫోన్లు అత్యధికంగా వాడుకుంటున్న మొబైల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్లలో ఇండస్ ఓఎస్ రెండోస్థానంలో ఉంది. ఆల్ఫాబెట్ అండ్రాయిడ్ తర్వాత 6.3 శాతం మార్కెట్ వాటాతో రెండోస్థానంలో ఉంది.

#5

స్థానిక భారతీయ భాషలలో రూపొందిన ఈ ఓఎస్ 2015 సంవత్సరం ముగిసేనాటికి రెండోస్థానాన్ని ఆక్రమించి ఈ సంవత్సరం కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ వారమే విడుదలైన కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.

#6

ఇంకా ఆసక్తకిర అంశం ఏంటంటే షియోమి, ఎంఐయూఐ, సియానోజెన్ వంటి ఆండ్రాయిడ్ వెరియంట్లు కూడా ఇండస్ ఓఎస్ ను వాడుతున్నాయి.

#7

చైనా సొంతంగా ఓఎస్ రూపొందించుకునే క్రమంలో చైనా ఓఎస్ (సీఓఎస్), కిలిన్, రెడ్ ఫ్లాగ్, యున్ఓఎస్ వంటి ప్రయోగాలు చేసినప్పటికీ అవి అంతగా విజయవంతం కాలేదు. చైనా ప్రభుత్వం, పలు ప్రైవేటు కంపెనీలు ఈ విషయంలో ప్రోత్సాహం అందించినా అనుకున్న లక్ష్యాన్ని అది సాధించలేదు.

#8

2015లో వచ్చిన ఇండస్ ఓఎస్‌ను తొలిసారిగా వాడుకునేందుకు దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ ముందుకు వచ్చింది. దీంతో ఈ ఓఎస్ కు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగిపోయింది. టైపింగ్ సౌలభ్యకరంగా ఉండటం, టైపింగ్లో ప్రాంతీయ భాషల పదాల ప్రిడిక్షన్ సరిగ్గా ఉండటం ఈ ఓఎస్ కు బాగా కలిసివచ్చే అంశమయింది.

#9

ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే ఓఎస్ విషయంలో ఐఫోన్ ఆపరేటింట్ సిస్టమ్ అయిన ఐఓఎస్ ను ఈ ఇండస్ ఓఎస్ దేశీయంగా అధిగమించింది.

#10

ఇప్పుడు యాప్ బజార్ వంటి యాప్లతో మరిన్ని ఆర్థిక సేవలు అందించేందుకు ఈ ఓఎస్ సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన 'మేకిన్ ఇండియా'కు ఈ ఓఎస్ రూపకల్పన పెద్ద ఊతమిచ్చే అంశమని నిపుణులు చెప్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write India achieved in two years what China didn’t in decade
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot