స్మార్ట్‌సిటీలకు ఇండియా చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

By Hazarath
|

ఓ పక్క కేంద్రం స్మార్ట్ సిటీలను దేశమంతా ఏర్పాటు చేయాలంటూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇండియా స్మార్ట్ సిటీలకు చాలా దూరంలో ఉందని బాంబు పేల్చారు. దీనికి అనేక కారణాలను చూపుతున్నారు. అవేంటో మీరే చూడండి.

రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

ప్రతిష్టాత్మక స్మార్ట్ సిటీలను కలిగి ఉండే స్థితికి మనం (దేశం) చాలా, చాలా దూరంలో ఉన్నామని దీనికి ప్రధాన కారణం ఐటీ ఇంజనీర్లు టైర్ 1 పట్టణాలకే ప్రాధాన్యమిస్తున్నారని పట్టణీకరణపై జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా నారాయణ మూర్తి వెల్లడించారు. అయితే దీనిపై తాను మాట్లాడబోనన్నారు.

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

ఇంజనీర్లు పెద్ద పట్టణాల్లోనే పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఇన్ఫోసిస్ మైసూరు, భువనేశ్వర్, తిరువనంతపురంలో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినా అక్కడ కనీసం 50 శాతం సీట్లు కూడా నిండలేదని వెల్లడించారు.

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు
 
ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

అక్కడికి వెళ్లాలని ఎవరూ అనుకోవడం లేదని ప్రతి ఒక్కరూ ముంబై, పుణె, బెంగళూరు హైదరాబాద్, నోయిడాల్లోనే ఉండాలనుకుంటున్నారు' అని మూర్తి వివరించారు. జీవిత భాగస్వామికి ఉద్యోగం, పిల్లల విద్య, నాణ్యమైన వైద్య సౌకర్యాలు ఈ పరిస్థితికి కారణాలుగా పేర్కొన్నారు.

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

దేశంలోని ప్రధాన నగరాల్లో మౌలిక వసతులు అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. వసతుల లేమి కారణంగా ఇన్వెస్టర్లు పట్టించుకోకపోవడంతో ఆసియా ఫైనాన్షియల్‌ హబ్‌గా ఎదగాల్సిన ముంబై ఇండియా ఫైనాన్షియల్‌ హబ్‌గానే మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు.

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

అమెరికా, యూర్‌పలతో పోల్చుకోకుండా సమకాలీన బ్రెజిల్‌, ఇండోనేషియా, మలేసియా నగరాలతో పోల్చుకొని నగరాల అభివృద్ధిపై భారత దృష్టిపెట్టాలని అన్నారు.

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

రానున్న రోజుల్లో కూడా అర్బన్‌ మైగ్రేషన్‌ తీవ్రంగా ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకొనే ప్లానింగ్‌ జరగాలని సూచించారు. సంపన్న రాజ్యాలన్నీ అర్బనైజేషన్‌ ద్వారానే పురోగిమించాయని, ప్రభుత్వం పట్టణీకరణపై దృష్టి సారించి సేవలు, తయారీ రంగాల్లో ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందన్నారు.

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

స్మార్ట్‌సిటీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మైసూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను ఒకసారి సందర్శించాలని సభికులకు నారాయణమూర్తి సూచించారు.

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

ఇండియా స్మార్ట్‌సిటీలకు చాలా దూరం: షాక్ పుట్టిస్తున్న వ్యాఖ్యలు

ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు దేశంలోని మారుమూల పట్టణాలకు విస్తరించడం ద్వారా ఉద్యోగావకాశాలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండగా ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ అయిన నారాయణమూర్తి ఇలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Best Mobiles in India

English summary
Here Write India far away from having smart cities infosys co founder Narayana Murthy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X