రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

By Hazarath
|

ఐటీ రంగమనే చారిత్రాత్మక పుస్తకాన్ని తిరగేస్తే అందులో మొట్టమొదటగా మనకు కనిపించేది ఇన్ఫోసిస్. దేశీయ ఐటీ చరిత్రలో అంతులేని శ్రమతో అఖండ విషయాన్ని సాధించిన దిగ్గజం నారాయణ మూర్తి. భార్య దగ్గర 10వేల అప్పు తీసుకుని ప్రారంభించిన కంపెనీ నేడు కోట్లతో ఐటీ రంగాన్ని శాసిస్తోంది. దేశీయ ఐటీ రంగానికి ఓ రోల్ మోడల్ గా నిలిచిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గురించి కొన్ని ఆసక్తికర నిజాలు మీకోసం.

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

 రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

భార్య సుధామూర్తి దగ్గర రూ. 10 వేలు అప్పు తీసుకుని ఇన్పోసిస్ అనే మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆమె తన నగలను కుదువ పెట్టి భర్తకు తన డబ్బును అప్పుగా ఇచ్చింది. రూ. 10 వేల పెట్టుబడితో ప్రారంభించిన కంపెనీ నేడు లక్షల కోట్లతో దేశీయ ఐటీ రంగాన్ని శాసిస్తోంది.

 రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

1981లో ఇన్ఫోసిస్ అనే మొక్కను నాటితే అది 25 ఏళ్లకు ఓ మహవృక్షమై ఇప్పుడు ఎందరికో నీడను అందిస్తోంది. నాడు ఆరుగురితో ప్రారంభమైన ప్రస్థానం నేడు 2 లక్షలకు పైగా ఉద్యోగులతో కళకళలాడుతోంది.

 రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

సుధా మూర్తికి నారాయణమూర్తి తన ప్రేమను ప్రపోజ్ చేసిందో ఎలానో తెలిస్తే అందరూ షాక్ తింటారు. నా ఎత్తు ఐదడుగులా నాలుగు అంగుళాలు. కళ్లజోడు పెట్టుకుంటాను. అందగాణ్నేం కాదు. పేద కుటుంబం నుంచి వచ్చాను. నా దగ్గర డబ్బు లేదు. సంపాదిస్తాననీ అనుకోవడం లేదు. అయినా సరే, నన్ను పెళ్లిచేసుకుంటారా?' అనడిగారు

 రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

అయితే ఎవరైనా ఇలా ప్రపోజ్ చేయగానే లాగి చెంపమీద కొడతారు. కాని సుధామూర్తి అలా చేయలేదట. నిదానంగా కాస్త ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి' అని చెప్పారట. ఇక ఆ ప్రతిపాదన కన్నవారి ముందుంచితే.. తాడూ బొంగరంలేని మనిషితో నీకు పెళ్లేమిటి అసాధ్యం' తేల్చిచెప్పారు తండ్రి. 'ఎప్పటికైనా, మీ అనుమతితోనే అతన్ని పెళ్లిచేసుకుంటాను. కాదంటే, ఇలానే ఉండిపోతాను' అని బదులిచ్చారట సుధ

 రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

వ్యాపార సంస్థ నిర్వహణ అనేది రిలే పరుగుపందెం లాంటిది. ఒకరు పరుగు ఆపగానే, మరొకరు అందుకుంటారు. మరెవరో గమ్యానికి చేరుకుంటారు. ఇంకెవరో పతకం స్వీకరిస్తారు. ఆ బృందంలో నేనూ ఒక ఆటగాడిని. నేనే సర్వస్వం కాదు.ఇది నారాయణ మూర్తిగారు రిటైర్ అవుతున్న సమయంలో వదిలిన డైలాగ్.. బెస్ట్ కోట్ గా నిలిచింది.

 రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

1976లో నారాయణ మూర్తి స్థాపించిన మొదటి కంపెనీ ఫెయిల్ అయింది. సాఫ్ట్రోనిక్స్ పేరుతో స్థాపించిన ఈ కంపెనీ అనుకోని పరిస్థితుల్లో పరాజయానికి దారి తీసింది. ఆ తరువాత ఇన్పోసిస్ అనే మహా సామ్రాజ్యానికి వారధి అయింది.

 రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

1946, ఆగస్టు 20న మైసూర్ లో ఓ పాఠశాల ఉపాధ్యాయుడి ఇంటిలో పుట్టిన నారాయణ మూర్తి కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. దీంతో డిగ్రీ పూర్తి చేసేందుకు మూర్తి ప్రైవేట్ గా ట్యూషన్లు చెప్పాల్సి వచ్చింది. ఉద్యోగంలో చేరే క్రమంలో బడా సంస్థలను కాదని, అహ్మదాబాద్ ఐఐటీలో చేసిన స్వల్పకాలిక ఉద్యోగమే మూర్తి జీవితాన్నే మార్చేసింది.

 రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

ఇన్ఫోసిస్ ప్రారంభం కాకముందు మూర్తి వేర్వేరు సంస్థల్లో ఉద్యోగిగా పనిచేసిన కాలం కేవలం రెండేళ్లే.తొలుత అహ్మదాబాద్ ఐఐటీలో చీఫ్ సిస్టం ప్రోగ్రామర్ గా విధుల్లో చేరారు. కొంతకాలానికే ఆ ఉద్యోగానికి వీడ్కోలు పలికి.. ఆ తర్వాత పుణే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పత్ని కంప్యూటర్ సిస్టమ్స్ లో చేరారు. అయితే అక్కడా ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు.

 రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

రూ. 10 వేల అప్పుతో పుట్టి ప్రపంచాన్ని శాసిస్తోంది

ఐటీ రంగంలో దూసుకెళ్తున్న ఇన్ఫోసిస్‌ 1993లో దేశీయ స్టాక్‌ మార్కెట్లలోకి ప్రవేశించింది. న్యూయార్క్‌లోని నాస్‌డాక్‌ లోనూ 1999 లో లీస్టైన ఇన్ఫోసిస్‌ తొలి భారతీయ సంస్థగా రికార్డు నెలకొల్పింది.

Best Mobiles in India

English summary
Here Write little known things about Infosys Narayana Murthy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X