Just In
- 1 hr ago
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- 1 day ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 2 days ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 2 days ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- Lifestyle
Weekly Horoscope22.01.2023-28.01.2023 - ఈ వారం ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి...
- Movies
Waltair Veerayya 9 Days Collections: సంక్రాంతి పుంజులా వీరయ్య వీరవిహారం.. బాక్సాఫీస్ ప్రాఫిట్స్ ఎంతంటే?
- Finance
Stock Market: ట్రేడర్లకు శుభవార్త.. జనవరి 27 నుంచి మారుతున్న రూల్.. ఇక ఒక్కరోజులోనే..
- News
జనసేన గ్రాఫ్ ఎంత మేర పెరిగింది : దక్కే సీట్లెన్ని..!?
- Sports
INDvsNZ : అదే మాకు కలిసొచ్చింది.. రెండో వన్డేలో సూపర్ బౌలింగ్‌పై షమీ
- Automobiles
టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయ ప్రముఖులు: రితేష్ దేశ్‌ముఖ్ నుంచి ముఖేష్ అంబానీ వరకు..
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నిస్తోంది.. అణు ఆయుధ రంగంలో ఇతర దేశాలను సవాల్ చేస్తూ దూసుకుపోతోంది. ఇతర దేశాలకు చుక్కలను చూపించే అణ్వాయుధాలను తయారుచేసేంత సామర్థ్యం భారత్ కు ఉందని..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందని అమెరికా తేల్చి చెప్పింది. అత్యంత భయానక విధ్వంసం సృష్టించే ఆయుధాలను తయారు చేయగల ప్లూటోనియంతో పాటు యురేనియం ఇండియా దగ్గర పుష్కలంగా ఉందని అమెరికాకు చెందిన ఓ రిపోర్ట్ వెల్లడి చేసింది.
Read more: పాక్‌తో యుద్ధం: ఇండియాకు 15 సెకన్లే ఎక్కువ

75 నుంచి 125 అణ్వాయుధాలు ...
భారత్ దగ్గర కావాల్సినంత ప్లుటోనియం, యురేనియం నిల్వలు ఉన్నాయి. వాటితో 75 నుంచి 125 అణ్వాయుధాలు చేసుకోవచ్చు. 2014 ఏడాది చివరి లోపే భారత్‌కు అంత శక్తి ఉందని అమెరికా అంచనా వేసింది.

ప్లుటోనియం నిల్వల ఆధారంగా భారత్ అణు సామర్ధ్యాన్ని..
అభివృద్ధిచెందుతున్న దేశాల్లో భారత్ చేపట్టిన అణు కార్యక్రమాలు అత్యంత పటిష్టమైనవని ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండర్ ఇంటర్నేషనల్ సెక్యూర్టీ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్లుటోనియం నిల్వల ఆధారంగా భారత్ అణు సామర్ధ్యాన్ని అంచనా వేశారు.

గత సంవత్సరం నాటికే ఇండియా వద్ద 125 అణ్వాయుధాలకు..
గత సంవత్సరం నాటికే ఇండియా వద్ద 125 అణ్వాయుధాలకు సరిపడా ప్లూటోనియం ఉందని ఇక ఈ యేటి అంచనాల ప్రకారం 175 వరకూ ఆయుధాలకు సరిపడా అణుశక్తి ఉండవచ్చని 138 అణ్వాయుధాల తయారీ పూర్తయి ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపింది.ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న యురేనియంలో 70 శాతం మాత్రమే అణ్వాయుధాల తయారీకి వినియోగిస్తున్నారు.భారత్ వద్ద ఉన్న ప్లుటోనియం నుంచి సుమారు 123 అణ్వాయుధాలను తయారు చేసుకోవచ్చు.

గత ఏడాది చివరి వరకు భారత్ కేవలం 97 ఆయుధాలను..
కానీ గత ఏడాది చివరి వరకు భారత్ కేవలం 97 ఆయుధాలను చేసి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. డేవిడ్ అల్‌బ్రైట్, సెరినా కెల్లర్‌లు ఆ నివేదికను రూపొందించారు.ఇండో-అమెరికా అణు ఒప్పందానికి గతంలో అల్‌బ్రైట్ వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

భారత్ దగ్గర 200 కిలోల యురేనియం..
భారత్ దగ్గర 200 కిలోల యురేనియం ఉందని..అది అణ్వాయుధాల నిర్మాణానికి ఉపయోగపడుతుందని రిపోర్టు పేర్కొంది. ఈ సంధర్భంగా భారత్ అమ్ములపొదిలో ఉన్న యుద్ధ విమానాలపై పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

ah-64 అపెచ్ ఫైటర్ జెట్ విమానం
అపెచ్ లాంగ్ బో గన్ షిప్ యుధ్ధ విమానం ఇది. ఇప్పుడు యుఎస్ ఆర్మీ వాడుతోంది.. ఇదొక అత్యాధునికమైన యుద్ధ విమానం..దన్ని భారత్ 1.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు అంతా రెడీ అయినట్లు తెలుస్తోంది. 39 అపెచ్ యుధ్ధ విమానాల కోసం డీల్ ఒకే అయినట్లు తెలుస్తోంది.

c-17 గ్లాంబ్ మాస్టర్ -111
70 టన్నుల కార్గోని మోసుకెళ్లగల అత్యాధునిక యుద్ధ విమానం ఇది. దాదాపు 4200 కిలోమీటర్లు మోసుకెళ్లగలదు. ఈ యుద్ధ విమానాన్ని 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నారు. 10 గ్లాంబెపస్టర్ కోసం దాదాపు 4.1 బిలియన్ డాలర్లుకు 2011లోనే ఆర్డర్లు ఇచ్చారు.అయితే మరొక 6 గ్లాంబ్ మాస్టర్ కోసం ఆర్డర్ చేసినట్లుగా తెలుస్తోంది.

m777 హౌట్జిర్స్
155 ఎమ్ ఎమ్ 39 కాటిబర్ గన్ ఇది. ఎంత దూరంలో ఉన్న వాటినైనా క్షణాల్లో ధ్వంసం చేయగలదు. దీనికి 770 మిలియన్ల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దాదాపు 145 గన్స్ కోసం ఇండియా యుఎస్ గవర్నమెంట్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది.

ch-47చినోక్స్
సైనికుల క్యారీ బ్యాగులను మోసుకెళ్లే విమానాలు ఇవి. వీటి కోసం 1.1 బిలియన్ల డాలర్ల ఒప్పందం కుదిరింది. 15 చినోక్స్ కొనుగోలుకు ఆర్థిక శాఖ అమోదం కోసం చూస్తోంది.

p-81 ఎయిర్ క్రాఫ్ట్
907 kmph వేగంతో దూసుకెళ్లే ఈ విమానం అలాగే 1200 నాటికల్ మైళ్ల దూరం వరకు దూసుకుపోగలదు.టెర్రరిస్టులను ఉగ్రవాదులను ఏరిపారేయడానికి ఈ యుద్ధ విమానాలను ఉపయోగించనున్నారు. దీని కోసం 1 బిలియన్ డాలర్ల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. 4 యుద్ధ విమానాల కొనుగోలుకు ఢిపెన్స్ ఆక్విసిటేషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే 8 యుద్ధ విమానాల కోసం 2. 1 బిలియన్ల డాలర్లతో 2009 లో ఒప్పందం కుదిరింది.

వీటితో పాటు రఫాలే అత్యాధునిక యుద్ధ విమానాలు..
అయితే వీటితో పాటు రఫాలే అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా త్వరలో భారత్ అమ్ములపొదిలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 36 రఫాలే విమానాలు అర్జంట్ గా కొనుగోలు చేసే ఆలోచనలో నరేంద్ర మోడీ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధ విమానాల కోసం దాదాపు8.9 బిలియన్ల డాలర్లు ఖర్చు చేరనున్నట్లు సమాచారం. ఇవి నెల లేదా రెండు నెలల్లో ఇండియాకు తీసుకువచ్చే పనిలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470